“కష్టాలు వస్తే కుంగిపోకుండా కడవరకూ పోరాడారు. ఫలితం విజయమే.” ఈ వాఖ్యానం మన కొత్తగూడెం వాసిని ఉద్దేశించినదే. ఎందుకంటే హోటల్ లో రోజు కూలిగా ఉన్న ఆయన ప్రస్తుతం ఓ ఫుడ్ ట్రక్ కు యజమాని. అంతేనా త్వరలో ఓ రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసం తో చెబుతున్నారు. మాటల్లో వినిపించే ఆ ఆత్మవిశ్వాసం త్వరలో చేతల్లో కూడా నిరూపణ అవుతుందని ఆశిద్దాం. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రేరణగా నిలిచిన ఆయన విజయ గాథను ఒకసారి చదువుదాం.
కూలిగా కలలు కన్నాడు
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంకు చెందిన శ్రీనివాస్ 37 ఏళ్లు. పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్న ఇతను మొదట్లో ఓ హోటల్‌లో రోజు కూలిగా పనిచేసేవారు. వచ్చే కూలి డబ్బులు కుటుంబం పోషణకు ఏమాత్రం సరిపోయేవి కావు. అయితే మొదటి నుంచి శ్రీనివాస్ వ్యాపారం చేసి జీవితంలో పైకి ఎదగాలని కలలు కనేవారు. అయితే ఏ వ్యాపారం చేయాలి? అన్న విషయంలో మాత్రం స్పష్టత వచ్చేది కాదు.
ffreedom app తో వ్యాపారిగా ఎదిగాడు
ఈ క్రమంలో శ్రీనివాస్ స్నేహితుని సూచనతో ffreedom app లో సభ్యత్వం తీసుకున్నారు.
అటు పై యాప్ నుండి ఫుడ్ ట్రక్, పౌల్ట్రీ, రెస్టారెంట్, గంధపు చెక్కల పెంపకం మరియు వ్యక్తిగత ఫైనాన్స్ కోర్సుల్లో చేరి అనేక విషయాలు తెలుసుకున్నాడు. అటు పై తన పూర్వానుభవానికి దగ్గరగా ఉన్న ఫుడ్ ట్రక్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ffreedom app ద్వారా శ్రీనివాస్ పెట్టుబడి, వాహన ఎంపిక, వంటగది ఉపకరణాలు మరియు ముడి పదార్థాల సేకరణ, వ్యాపారాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించాలి, రిజిస్ట్రేషన్, లైసెన్స్ మరియు స్థానిక ప్రభుత్వాల నుంచి అనుమతి, మెను, సిబ్బంది, లాభాల మార్జిన్‌లు, కస్టమర్ ఆర్డర్‌లు మరియు మార్కెటింగ్, ఖాతాల నిర్వహణ వంటి వాటి పై పట్టుసాధించి వ్యాపారవేత్తగా మారాడు
మొదటి మూడు నెలలు పరీక్షా కాలం.
వ్యాపారం ప్రారంభించిన తర్వాత శ్రీనివాస్‌కు మొదటి మూడు నెలలు పరీక్ష కాలం. ఇంటి అవసరాలకు కూడా డబ్బు సరిపోయేది కాదు. అయితే ffreedom app ద్వారా నేర్చుకున్న విషయాలతో పాటు యాప్ ప్రతినిధి అందించిన సలహాలు, సూచనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ ఫుడ్ ట్రక్ బిజినెస్ ను లాభాల బాట పట్టించారు. అతి తర్వరలో శ్రీనివాస్ లక్ష రుపాయల వరకూ ఆదాయం అందుకోబోతున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు…
శ్రీనివాస్ తయారు చేస్తున్న ఫుడ్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. దీంతో శ్రీనివాస్ ఈ ఫుడ్ ట్రక్‌ని రెస్టారెంట్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోయే ఐదేళ్లలో, అతను మరిన్ని రంగాల్లో ముఖ్యంగా డైరీ ఫార్మింగ్ లేదా రెస్టారెంట్ చైన్ బిజినెస్ వంటి విభిన్న వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. ఈ విషయమై శ్రీనివాస్ మాట్లాడుతూ…”హోటల్‌లో పనిచేసే సమయంలో నేను పూరి గుడిసెలో ఉండేవాడిని. త్వరలో డాబా ఇళ్లులోకి మారిపోతున్నాను. ఈ ఒక్క విషయం చాలు నేను ఎలా ఎదుగుతున్నానో చెప్పడానికి. దీనికి ప్రధాన కారణమైన ffreedom app కు నేను ఎప్పుడు రుణపడి ఉంటా.” అంటూ చమర్చిన కళ్లతో శ్రీనివాస్ మా..మీ..కాదు..కాదు మన ffreedom app ప్రతినిధితో పేర్కొన్నారు.