“శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది.” అన్న వాఖ్యానం రాయచూరుకు చెందిన నందిని చెరుకూరి వ్యాపార జీవితానికి సరిగ్గా సరి సరిపోతుంది. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈమెకు స్థానికంగా పికిల్స్ వ్యాపారవేత్తగా మంచి పేరు వచ్చింది. ఇందుకు దోహద పడిన విషయాలు ఏమిటో? ఆమె విజయ రహస్యం ఏమిటో తెలుసుకుందాం రండి.
ఎక్కడి నుంచి ఎక్కడికో ffreedom App ద్వారా
వ్యవసాయ కుటుంబానికి చెందిన 31 సంవత్సరాల నందిని చెరుకురి ప్రస్తుతం రాయచూరులో ఉంటున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఏదేని వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని బలంగా కోరుకునేవారు. ఈ క్రమంలోనే పెళ్లైన తర్వాత తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఈ క్రమంలో టీవీలో ఓసారి వచ్చిన ఫ్రీడం యాప్ యాడ్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆమెలో దాగున్న వ్యాపారవేత్త కావాలనే ఆలోచనలకు ఆ యాడ్ ఊతమిచ్చింది. దీంతో వెంటనే ఆ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అందులో వివిధ వ్యాపార కోర్సులకు సంబంధించిన వీడియోలను చూసారు.
అనేక విషయాలు యాప్ ద్వారానే
అందులో నుంచి పికిల్స్ తయారీతో పాటు, పాపడ్ తయారీ, చాక్లెట్ తయారీ కోర్సులను నేర్చుకున్నారు. అయితే తన ఇంటి పరిస్థితులకు సరిపోయే పచ్చళ్ల (పికిల్స్) తయారీ వ్యాపారాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకోవాలని నిశ్చయించుకున్నారు. యాప్ ద్వారా పికిల్స్ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి, రిజిస్ట్రేషన్, అనుమతులు, గురించి నేర్చుకున్నారు. అటు పై ఏ ఏ సమయంలో ఏ ఏ పికిల్స్ తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్న విషయం పై అవగాహన పెంచుకున్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ మెళుకువలను నేర్చుకున్నారు. ముఖ్యంగా స్థానిక మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులకు ధరలను ఎలా నిర్ణయించాలో తెలుసుకున్నారు.
ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా అందుబాటులోకి
యాప్ ద్వారా తాను నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలు పెట్టారు. మొదట రూ.5వేల పెట్టుబడితో టమోట, మామిడి, నిమ్మ, ఉసిరి, టమోట, మిర్చితో పికిల్స్ తయారు చేసి బంధువులు, స్నేహితులు పొరుగువారికి అమ్మేవారు. అయితే పచ్చళ్లు రుచిగా ఉన్నా కూడా పాకింగ్ సరిగా లేకపోవడం వల్ల నాణ్యత పరంగా వినియోగాదులు సంతృప్తి చెందలేదు. ఈ సమయంలోనే ffreedom App ఆమెకు ప్యాకేజింగ్ విషయంలో సరైన సలహాలు సూచనలు అందించింది. దీంతో ప్యాకింగ్ విషయంలో కూడా నందిని పట్టుసాధించారు. అటు పై వ్యాపార విషయంలో నందిని వెనక్కు తిరిగి చూడలేదు. వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం ప్రతి నెలా రూ.15 వేల ఆదాయాన్ని పచ్చళ్ల వ్యాపారంతో నందిని పొందుతున్నారు. ఈ విషయమై ffreedom App ప్రతినిధితో నందిని మాట్లాడుతూ… “కుటుంబ సభ్యుల సహకారం ఉండటం వల్ల అటు గృహిణిగా, ఇటు వ్యాపారవేత్తగా బాధ్యతలు నిర్వహించడం నాకు ఇబ్బంది అనిపించడం లేదు. అయినా శ్రమిస్తేనే కదా మనం అనుకున్నది దక్కుతుంది. ఇక నేను తయారు చేసిన పికిల్స్‌ను ffreedom App ఫ్లాట్ ఫాం పై కూడా అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నాను.” అని పేర్కొన్నారు.