“మధనం మంచి మార్గంలో నడిపిస్తే మంచి విజయం నీ చెంతకు చేరుతుంది.” ఓ ప్రైవేటు టీచర్, వ్యావసాయదారుడిగా ఉత్తమ ఫలితాలు అందుకున్న రాయప్ప జీవితాన్ని ఒక్క వాఖ్యంలో చెప్పమంటే ఇలా చెప్పవచ్చు. చాలీ చాలని సంపాదనతో జీవనం కొనసాగిస్తున్న ఎంతోమందికి ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే అందే ప్రతిఫలం ఎంత మధురంగా ఉంటుందో ఈ స్ఫూర్తిదాయక కథనం ద్వారా తెలుసుకుందాం రండి
తొమ్మిదో తరగతి చదివిన నా సంపాదన ఏడాదికి రూ.50 లక్షలు. మరి నీ సంపాదన?
“నేను తొమ్మిదో తరగతి మాత్రమే చదివాను. ప్రస్తుతం నా ఏడాది సంపాదన రూ.50 నుంచి రూ.60 లక్షలు. నీవు MSc చదవడమే కాకుండా ఉపాధ్యాయ శిక్షణ కూడా పూర్తి చేసావు. మరి నీ సంపాదనా రూ.10 వేలు మించడం లేదు. ఎందుకు?” అన్న ప్రశ్న ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న రాయప్పకు కన్న తండ్రి నుంచే ఎదురయ్యింది. అంతే రాయప్ప నోట మాట రాలేదు. అదే సమయంలో తాను ఏ దారిలో వెలుతున్నాను? నాలో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లేదా? మా నాన్న ప్రశ్నలో తప్పేమున్నది? ఇలా ఒక్కసారిగా ప్రశ్నలు చుట్టుముట్టాయి. అంతే అప్పడే నేను కూడా మంచిగా సంపాదించాలన్న కసి రాయప్పలో మొదలయ్యింది.
చేయూతను అందించిన ffreedom App
సంపాదనను పెంచుకునే మార్గాలను రాయప్ప అన్వేషించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ffreedom App గురించి తెలిసింది. వెంటనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వివిధ కోర్సులను చూడటం నేర్చుకున్నారు. కుటుంబం నుంచి వచ్చిన భూమిలో దానిమ్మ పండించాలని భావించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ ద్వారా తెలుసుకున్నారు. అంటే మొక్కలను ఎక్కడ నుంచి సేకరించాలి? నేలను ఎలా దుక్కి దున్నాలి? పంటను ఆశించే వ్యాధులు, నివారణ, డిమాండ్, మార్కెటింగ్ వంటి విషయాల పై అవగాహన పెంచుకున్నారు. దీంతో మొదట 1.5 ఎకరాల పొలంలో దానిమ్మ సాగు చేయడం ప్రారంభించారు. మొదటి రెండేళ్ల తర్వాత దానిమ్మ ఫలసాయం అందించడం మొదలు పెట్టింది. దీంతో మొదటి ఏడాదిలోలనే రూ.4 లక్షల ఆదాయం అందుకున్నారు.
మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ ద్వారా….
యాప్‌లోని వ్యవసాయ కోర్సులనే కాకుండా బిజినెస్ సంబంధిత కోర్సులను కూడా రాయప్ప నేర్చుకున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్స్‌లో మదుపు చేయడం వంటి విషయాల పై అవగాహన పెంచుకున్నారు. సొంతంగా వీటిలో ఇన్వెస్ట్ చేయడంతో పాటు స్నేహితులకు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తూ నెలకు అదనంగా రూ.10వేల దాకా సంపాదిస్తున్నారు. ఇలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటూ తన సంపాదనను ప్రతి నెలా పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషయమై రాయప్ప ffreedom App ప్రతినిథితో మాట్లాడుతూ… మా నాన్న ప్రశ్న నన్ను బాధపెట్టలేదు. అయితే నీలో ఉన్న శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదన్న గుర్తిచేసినట్లు అనిపించింది. ఆ సమయంలో నాకు ఫ్రీడం యాప్ ఎంతో సహాయం చేసింది. దానిమ్మ సాగు తెచ్చిన విజయం నా ఆలోచన దృక్పథాన్ని మార్చింది. ఇక పై నేను పాడి పశువుల పెంపకంతో పాటు మేక, గొర్రెల పెంపకం చేపట్టి ఎప్పటికైనా మా నాన్న అంతటి సంపాదనపరుడు అవుతాను. ఇప్పుడు నా సంపాదన చూసి మా నాన్న కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్రెడిట్‌లో అధిక భాగం ffreedom App కు చెందుతుంది” అని సంతోషం వ్యక్తం చేశారు.