పాడి పరిశ్రమల నిర్వహణ పై ఆసక్తి ఉన్నవారికి జెర్సీ ఆవుల పెంపకం లాభదాయకమైన వ్యాపారం. సరైన పరిజ్ఞానం మరియు నిర్వహణ నైపుణ్యంతో, ఒక రైతు కేవలం 100 ఆవుల నుండి సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించవచ్చు. జెర్సీ ఆవు అధిక పాల ఉత్పత్తికి మరియు అధిక వెన్న శాతం ఉన్న పాలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రసిద్ధ జాతి. ఈ జాతి ఆవులు చాలా శాంత స్వభావంగా ఉంటాయి. అందువల్ల పాడి పశువుల్లో మిగిలిన ఇతర జాతుల కంటే వీటి సంరక్షణ చాలా సులభం. జెర్సీ ఆవులో డెయిరీ ప్రారంభించడానికి చాలా నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ కోర్సు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కోర్సులో జెర్సీ ఆవులను గుర్తించడం ఎలాగో నుంచి ఈ జెర్సీ ఆవులతో డెయిరీ నిర్వహణ వరకూ ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే విధానం వరకూ అన్నీ విషయాలను నేర్చుకుంటాం.
అనేక విషయాల కలయిక ఈ కోర్సు..
శరీర ఆకృతిని అనుసరించి జెర్సీ ఆవులను ఎలా గుర్తించాలనే విషయం ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం. అదే విధంగా జెర్సీ జాతి ఆవుల డెయిరీ నిర్వహణకు అవసరమైన పెట్టుబడి పై అవగాహన ఏర్పడుతుంది. డెయిరీ ఏర్పాటు, పశువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు, సబ్సీడీల గురించి కూడా ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటాం. పశువుల పాక లేదా షెడ్ నిర్మాణంలో అనుసరించాల్సిన శాస్త్రీయత గురించి ఈ కోర్సు ద్వార నేర్చుకుంటాం. ఆవులకు అందించే ఆహార నాణ్యత పై ఆవులు అందించే పాల పరిమాణం, పాల నాణ్యత ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే జెర్సీ ఆవులకు ఏ సమయంలో ఎంత ఆహారం అందించాలన్నది కూడా ఈ కోర్సు మనకు తెలియజేస్తుంది. జెర్సీ ఆవుల జీవిత చక్రమం పై ఈ కోర్సు ప్రాథమిక అవగాహన కలిగిస్తుంది. దీనివల్ల దూడలు ఎప్పుడు ఎదకు వస్తాయి, ఒక ఆవు తన జీవిత కాలంలో ఎన్ని దూడలను అందిస్తుంది తదితర విషయాల పై అవగాహన కలుగుతుంది. తద్వార ఆవులు, దూడల ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాల పై స్పష్టత వస్తుంది. డైయిరీ నిర్వహణలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ పై కూడా ఈ కోర్సు ద్వారా నేర్చుకోవడానికి వీలవుతుంది. మార్కెట్, ధరలు తదితర విషయాలన్నింటినీ ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. పాడి, పశుపోషణకు సంబంధించిన అనేక రకాల కోర్సులను మీరు ffreedom App లో చూడవచ్చు.
అధిక స్థాయిలో ప్రోటీన్స్
జెర్సీ ఆవు పాలు లో కాల్షియం, ప్రోటీన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు అధిక స్థాయిలో ఉంటాయి. అందువల్లే ఈ పాలకు డిమాండ్ ఎక్కువ. ఇందులో విటమిన్ ఎ మరియు డి కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఎముకలు మరియు దంతాల దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ప్రోటీన్స్‌లో అధిక స్థాయిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలు ఉంటాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.. మొత్తంమీద, జెర్సీ ఆవు పాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచి సమాయకారిగా ఉంటాయి.
ఎవరు ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు.
జెర్సీ ఆవులతో డెయిరీ ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా జెర్సీ-ఆవు-పాడి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యక్తిగత వ్యవస్థాపకుడు కావచ్చు, పెట్టుబడిదారుల సమూహం కావచ్చు లేదా రైతుల సహకారం కావచ్చు. అయితే జెర్సీ ఆవులు మరియు పాడి పరిశ్రమతో అనుభవంతో సహా వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు వనరులను కలిగి ఉండటం చాలా చాలా కీలకం. అదేవిధంగా సమగ్ర లేదా సమీకృత విధానం ద్వారా సాగుతో పాటు పాడిని నిర్వహించాలనుకుంటున్నవారు ఈ వైపు అడుగులు వేయవచ్చు.
వ్యవసాయ, పాడి, పశుపోషణకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక కథనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.