టర్కీ లేదా సీమ కోడి దీని పెంపకం మంచి లాభదాయకంగా ఉంటుంది. నార్త్ అమెరికాకు చెందిన ఈ పౌల్ట్రీ బ్రీడ్ పెంపకం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. దాదాపు 9 కిలోలు పెరిగే ఈ టర్కీ కోడిని ఏడు నెలల్లోనే మార్కెటింగ్ చేయడానికి వీలువుతుంది. ఒక కిలో టర్కీ కోడి మాంసం రూ.450 నుంచి రూ.600 వరకూ ఉంటుంది. ఇక ఈ టర్కీ కోడి గుడ్డు మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.60 ధర పలుకుతోంది. ఒక ఆడ టర్కీ కోడి ఒక సంవత్సరంలో 60 గుడ్లను పెడుతుంది. ఇలా మాంసం, గుడ్లు అమ్ముతూ ఒక కోడి నుంచి ఒక ఏడాదిలో రూ.4500 ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 1000 కోళ్లను పెంచుతూ ఏడాదికి కనిష్టంగా రూ.10 లక్షల ఆదాయన్ని పొందడానికి వీలవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ffreedom App అందించే టర్కీ కోళ్ల పెంపకానికి సంబంధించిన కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.
అనేక విషయాలను తెలుసుకోవాలి…
టర్కీ కోళ్ల పెంపకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ కోళ్లను పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఈ టర్కీ కోళ్ల పెంపకానికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిద్వారా సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇలా సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల అసలు టర్కీ కోళ్ల పెంపకం అంటే ఏమిటి? అందులో ఉన్న లాభ నష్టాల పై కొంత వరకూ అవగాహన ఏర్పడుతుంది. తర్వాత టర్కీ కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడి, ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీల గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం స్థానిక ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.
శాస్త్రీయంగా షెడ్ నిర్మాణం చేపట్టాలి…
టర్కీ కోళ్ పెంపకానికి సంబంధించిన అనుమతులు లభించిన తర్వాత సరైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తూ షెడ్‌ను శాస్త్రీయంగా నిర్మించాలి. టర్కీ కోళ్ల గుడ్లను హేచరీల్లో పొదిగించి పిల్లలు అయ్యేలా చూడాలి. అటు పై టర్కీ కోళ్ల పిల్లలను వాటి వయస్సు ఆధారంగా వేర్వేరు సమూహాలుగా విభజించి షెడ్‌లో పెంచాలి. ఇక ఈ పిల్లలకు అందించే ఆహారం చాలా నాణ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురించి చర్చించాలి. అదే టర్కీ కోళ్ల పెంపకాన్ని చేపట్టే సమయంలో వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. దీని కోసం సమయానికి తగ్గట్లు టీకాలు వేయించాలి. ఈ పనులన్ని చేయడానికి అవసరమైన శ్రామికులను నియమించుకోవడమే కాకుండా వారికి అవసరమైన సమయంలో శిక్షణ కూడా ఇస్తూ ఉండాలి. ఇక డిమాండ్‌ను అనుసరించి టర్కీ మాంసం, గుడ్లకు ధరను నిర్ణయించి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇలా టర్కీ కోళ్ల పెంపకంలో ప్రతి దశను నిశితంగా పరిశీలించి కోళ్లను, గుడ్లను మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒక్క ఏడాదిలో 1000 టర్కీ కోళ్ల నుంచి రూ.10 లక్షలను సంపాదించవచ్చు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు…
టర్కీ న్యూట్రీషియన్ మాంసం. అందువల్లే దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా తింటారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. టర్కీ మాంసంలో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టర్కీ మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. టర్కీ మాంసంలో విటమిన్ బీ, మరియు జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. జింక్ శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.