Home » Latest Stories » వ్యక్తిగత ఫైనాన్స్ » వీటిలో మదుపు చేస్తే మీ కోసం డబ్బు పనిచేస్తుంది

వీటిలో మదుపు చేస్తే మీ కోసం డబ్బు పనిచేస్తుంది

by Sajjendra Kishore

మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి ఇది చాలా క్లిష్టమైన విషయంగా అనిపించవచ్చు. అయితే కొన్ని ప్రాథమిక విషయాల పై అవగాహన పెంచుకుంటే మ్యూచువల్ ఫండ్ అనేది చాలా సులభమైన సరళమైన పెట్టుబడి మార్గం లేదా సాధనం అని అర్థమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒకే విధమైన పెట్టుబడి ఉద్దేశ్యం కలిగిన వ్యక్తులు లేదా ఇన్వెస్టర్ల ద్వారా సొమ్మును సేకరించి ఒక ట్రస్టు ద్వారా ఒక వ్యక్తి నిర్వహిస్తారు. ఆ వ్యక్తినే ప్రొఫెషన్ ఫండ్ మేనేజర్ అని అంటారు. ఇలా సేకరించిన డబ్బును ఈక్విటీలు, బాండ్లు, మనీ మార్కెట్ ఇస్ట్రుమెంట్స్ మరియు సెక్యూరిటీలతో పెట్టుబడిగా పెడుతారు. అయితే పెట్టుబడి పెట్టే సమయంలో ప్రతి వ్యక్తిని ఇన్వెస్టర్‌గా పరిగణించబడుతారు. ఇక ఇన్వెస్టర్‌ మారిన తర్వాత పెట్టుబడిన సొమ్ము పరిమాణానికి అనుగుణంగా యూనిట్లు కేటాయిస్తారు. ఈ యూనిట్లు ఫండ్ హోల్డింగ్ భాగాన్ని తెలుపుతుంది. ఇలా సంయుక్తంగా పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభం లేదా ఆదాయాన్ని నికర ఆస్తి విలువ లేదా ఎన్ఏవి అంటారు. దీనిలో నుంచి ఫండ్‌మేనేజర్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు తీసివేసి మిగిలిన సొమ్మును పెట్టుబడిదారులకు వారు పెట్టిన సొమ్ము పరిమాణాన్ని అనుసరించి పంచుతారు. ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం వల్ల సులభంగా ఆదాయాన్ని లేదా లాభాన్ని అందుకోవచ్చు. సమాన్య మదుపుదారులకు అత్యంత వీలైన, సులభమైన పెట్టుబడి సాధానాలు అని చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం మ్యూచువల్ ఫండ్స్ అన్నవి అత్యంత నిపుణులైన ఫండ్ మేనేజర్ల ద్వారా తక్కువ ఖర్చుతో నిర్వహించబడుతాయి. అందువల్ల దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడిని ఇచ్చే సాధనాలుగా చెప్పవచ్చు. 

మ్యూచువల్ ఫండ్స్‌లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్‌ వేర్వేరు ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉండటమే కాకుండా లాభాలు, నష్టాలు కూడా ఉంటాయి. ఈ లాభనష్టాలతో పాటు మన ఆర్థిక లక్ష్యాను పరిగణనలోకి తీసుకుని ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నది మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను నిపుణులైనవారితో సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఈ రకమైన సూచనలు ffreedom App లోని ఈ కోర్సు మీకు అందిస్తుంది. కాగా, మ్యూచువల్ ఫండ్స్‌ను అవి అందించే రాబడులు, అందులో ఉన్న రిస్క్‌ను అనుసరించి చాలా మంది నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా పేర్కొంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే సమయాన్ని అనుసరించి వీటిని రెండు రకాలుగా పేర్కొటారు. ఇలా మ్యూచువల్స్ ఫండ్స్ రకాలకు సంబంధించి ఇప్పటి వరకూ అందరూ అంగీకరించిన విధానం ఏదీ స్పష్టంగా లేదు. అయితే చాలా మంది నిపుణులు సలహాలు సూచనలను అనుసరించి మ్యూచువల్ ఫండ్స్‌ రకాలను క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 

రాబడులు, రిస్క్‌ను అనుసరించి

1. స్టాక్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఈ ఫండ్స్ వేర్వేరు రంగాలకు చెందిన పెద్ద పెద్ద పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతాయి.  పెట్టుబడి పెరుగుదలతో పాటు డివిడెంట్ లేదా ఈ రెండూ కావాలనుకుంటున్నవారు ఈ రకమైన మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కాగా, ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్‌ ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. అయితే దీర్ఘకాంలో మంచి రిటర్న్స్ ఇస్తాయి. అంటే సమీప భవిష్యత్తులో మదుపు చేసిన సొమ్ము అవసరం లేదని వారు,  రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే పెట్టుబడిదారులకు ఈరకమైన మ్యూచవల్ ఫండ్స్ మంచి ఎంపిక   

2. డెట్స్ ఫండ్స్: ఈరకమైన ఫండ్స్‌లో నష్టభయం చాలా తక్కువ. కొన్ని రకాల డెట్ ఫండ్స్‌లో ఇప్పటి వరకూ పెట్టుబడిదారులు నష్టం చూడలేదని ఈక్విటీ మార్కెట్ చరిత్ర చూస్తే స్పష్టమవుతుంది. అంటే ఈ రకమైన ఫండ్ మేనేజర్లు ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్, బ్యాంకులు అందజేసే బాండ్స్‌లో పెట్టుబడులు పెడుతారు. దీని వల్ల నష్టభయం దాదాపు శూన్యం. అదేవిధంగా రిటర్న్స్ అంటే రాబడులు కూడా ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. 

3. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్: ఈ రకమైన ఫండ్స్‌లో రాబడులు, రిస్క్ మధ్యస్థంగా ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో స్పల్ప కాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగిన వారు తమ సొమ్ములను ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే కారు, విదేశీయానం వంటి ఆర్థిక లక్ష్యలు కలిగిన వారు ఇందులో తమ సొమ్ములను మదుపు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే ఈ డెట్ ఫండ్స్‌లలో రాబడి తక్కువగా, రిస్క్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా డెట్ ఫండ్స్‌తో పోలిస్తే ఈరకమైన బ్యాలెన్స్‌డ్ పండ్స్‌లో రాబడి ఎక్కువ, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే సమయాన్ని అనుసరించి

1. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్: ఈరకమైన మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ సమయంలోనైనా సొమ్మును పెట్టుబడిగా పెట్టవచ్చు. అదేవిధంగా ఏ సమయంలో అవసరమైనా పెట్టిన పెట్టుబడిని, లాభాన్ని వెనక్కు తీసుకోవచ్చు. 

2. క్లోస్డ్ ఎండెడ్ ఫండ్స్: ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ సమయంలోనైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే సొమ్మును నిర్థిష్ట సమయం తర్వాత మాత్రమే వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు డబ్బులు అవసరమైనా కూడా తీసుకోవడానికి వీలుపడదు. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!