“సరైన వ్యాపార సూత్రాలను నేర్చుకుంటే రైతు రాజుగా మారుతాడు” అని ffreedom app చెబుతోంది. ఇందుకు నరసింహ మూర్తి బొప్పాయి సాగు, విక్రయ విధానాలు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఈ బొప్పాయి పంటలో అధిక లాభాలు అందుకోవడానికి ffreedom app లోని బొప్పాయి పంట సాగు కోర్సు ఎంతగా ఉపయోగపడిందో ఈ కథనం మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఉత్తమ రైతుగా ప్రశంసలు అందుకుంటున్న ఆ నరసింహ మూర్తి జీవితం ఎందరికో ఆదర్శం. ముఖ్యంగా దళారుల చేతికి చిక్కి గిట్టుబాటు ధర దక్కక బాధపడిన ఈ నరసింహ మూర్తి వినూత్న పంథాలో వెళ్లి దళారుల బెడద తప్పించుకున్నాడు. అంతేకాకుండా అధిక లాభాలు అందుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం…
వినూత్న పంథాలో సాగుతూ…విజయం సాధించారు
కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలూకలోని జాడె గొండేనహళ్లి కి చెందిన నరసింహ మూర్తి మాములు రైతు. మొదట తన పొలంలో చిరుధ్యాన్యాలు పండించేవాడు. వాటిని విక్రయిస్తూ జీవితం కొనసాగించేవారు. సాధారణంగా దళారుల చేతుల్లో చిరుధాన్యాల మార్కెట్ ఉంటుంది. అందువల్ల నరసింహ మూర్తి పండించిన పంటకు సరైన ధర దక్కేది కాదు. ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర కూడా లభించేది కాదు. అయినా ఆయన ఏనాడూ బాధపడలేదు. విభిన్న మార్గంలో వెళ్లి లాభాలు రాబట్టాలని ఆలోచించారు. ఈ క్రమంలో సరికొత్తగా వ్యవసాయం చేసి అధిక లాభాలు అందుకోవాలని ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వ్యవసాయ నిపుణులు, స్నేహితుల సహాయం తీసుకునేవారు. అప్పుడే నరసింహ మూర్తికి ffreedom app గురించి తెలిసింది.
బొప్పాయి ని సాగు చేసి .. లాభాలు అందుకుని
ffreedom app ను డౌన్లోడ్ చేసుకుని లోని వ్యవసాయ సంబంధ కోర్సులు చూసారు. అన్ని కోర్సుల పైకి బొప్పాయి సాగుకు సంబంధించిన కోర్సు నరసింహ మూర్తిని ఎక్కువగా ఆకర్షించింది. దీంతో ఈ యాప్ సహాయంతో బొప్పాయి సాగుకు సంబంధించిన అన్ని మెళుకువలను తెలుసుకున్నాడు. అంటే పంటను పండించడానికి అనువైన భూమి, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు, వాతావరణ పరిస్థితులు తదితర విషయాల పై ffreddom app ద్వారా అవగాహన పెంచుకున్నారు. బొప్పాయి పంటను ఆశించే తెగులు, వ్యాధులను ముఖ్యంగా ఆధునిక విధానాల ద్వారా ఎలా నివారించాలో స్పష్టత తెచ్చుకున్నారు. అటు పై పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాకింగ్, అమ్మకం వంటి విషయాల పై మెళుకువలను నేర్చుకున్నారు. పెట్టుబడి, రోజువారి ఖర్చులు, ఆదాయం, నిఖర లాభం తదితర విషయాల పై అవగాహన పెంచుకున్నారు. ఈ క్రమంలో యాప్‌లో వీడియోల రూపంలో ఉన్న మాడ్యూల్స్, మెంటార్స్ నరసింహమూర్తికి సహాయం అందించాయి.
మార్కెట్ మెళుకువలను నేర్పిన ffreedom appబొప్పాయి పంట పండిన తర్వాత అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే అధిక లాభాలు అందుకోవచ్చునని నరసింహమూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఈయన పొలం హైవేకు అత్యంత సమీపంలో ఉంది. ఈ పరిస్థితిని తన లాభాల బాటకు అనువైన మార్గంగా ఎంచుకున్నారు. ఒక ఎకరాలో బొప్పాయి పంట పండించిన తర్వాత మార్కెట్‌కు తీసుకువెళ్లలేదు. హైవే పక్కగా చిన్న దుకాణం తెరిచి అక్కడే బొప్పాయిని నేరుగా వినియోగదారులకు విక్రయించేవారు. దళారులు లేకపోవడం వల్ల మంచి లాభాలు దక్కాయి. ఈ విషయమై నరసింహ మూర్తి మాట్లాడుతూ “వినియోగదారులకు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే నా వద్ద సరుకు దొరుకుతుంది. దీంతో ఎక్కువ మంది నా వద్ద కొనాడానికి వస్తుంటారు. ఇక రైైతుగా నాకు దళారుల బెడద తప్పుతుంది. ఇలా అటు వినియోగదారులకు ఇటు రైతుకు ఇద్దరికీ ఈ విధానం మేలు చేస్తుంది. ఇలాంటి మార్కెటింగ్ మెళుకువలను ఎన్నింటినో నేర్పించిన ffreedom app కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.” అని చెప్పారు. ఇక మరెందుకు ఆలస్యం వెంటనే ffreedom app లక్ష్యాలను తెలుసుకుని మీరు కూడా వ్యవసాయ కోర్సుల మెళుకువలను నేర్చుకోండి. లాభాల సాగుతో విజయ శిఖరాలను చేరుకోండి.