“కృషికి సరైన మార్గదర్శకత్వం తోడైనప్పుడే నీవు ప్రయాణించే మార్గంలో విజయ శిఖరం త్వరగా చేరువవుతుంది” అన్న విషయం తెలుగింటి గృహి గగుటూరు షర్మిలా జీవితానికి అద్దం పడుతుంది. వ్యాపార రంగంలో విజయం సాధించాలన్న షర్మిలా తపనకు ffreedom app సరైన సమయంలో, సరైన దిశలో మార్గదర్శకత్వం అందించి ఆమెను విజయ తీయరాలను చేర్చింది. ఇందుకు సంబంధించిన విషయాలు క్లుప్తంగా మీ కోసం…
యానిమేటర్ నుంచి ఎంటర్పెన్యూర్‌గా ఎదిగిన షర్మిలా
షర్మిలా గారు యానిమేటర్‌గా పనిచేసేవారు. ఆమెకు ఆరు నెలలకు ఒకసారి కాని జీతం అందేది కాదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సార్లు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే ffreedom app కు సంబంధించిన యాడ్ ఆకర్షించింది. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని చాక్లెట్స్ బిజినెస్ సంబంధించి సంపూర్ణ మార్గదర్శకత్వం అందించే చాక్లెట్ బిజినెస్ కోర్సును చూశారు. కేవలం రూ.1000 తో చాక్లెట్స్ తయారు చేసి విక్రయించవచ్చునని తెలుసుకున్నారు. దీంతో ఈ కోర్సుకు సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకుని వాటిని తూ.చా తప్పకుండా అమలు చేశారు. అంతేకాకుండా తన ఇంటి పక్కన ఉండే ఒకరిద్దరికి ఈ చాక్లెట్ తయారీని నేర్పించారు. వారు తయారు చేసిన చాక్లెట్స్ తీసుకుని మార్కెట్ చేసేవారు. ఇలా చాక్లెట్స్ బిజినెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే రూ.10,000 లాభం అందుకుని ఎంటర్పెన్యూర్‌గా విజయం సాధించారు. ఈ విషయంలో ffreedom app మార్గదర్శకత్వం మరువలేనిదని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు.
సమీకృత వ్యవసాయన్ని ఇష్టంగా మార్చిన ffreedom app
షర్మిలా గారికి మొదటి నుంచి వ్యవసాయం అంటే అంత సదభిప్రాయం ఉండేది కాదు. అయితే ffreedom app లోని వ్యవసాయ సంబంధ కోర్సులు ముఖ్యంగా తక్కువ స్థలంలోనే అధిక లాభాలను అందించే సమీకృత వ్యవసాయ సంబంధిత కోర్సులు ఆసక్తిని కలిగించాయి. దీంతో ఆమె జంగారెడ్డి గూడెం నుంచి 3110 తైవాన్ జామ మొక్కలను తెప్పించి మూడు ఎకరాల్లో సాగుచేయడం మొదలుపెట్టారు. మొత్తంగా పెట్టుబడిబడికి రూ.1,00,000 ఖర్చు చేశారు. మరో రెండు నెలల్లో పంట కోతకు రానుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కడే ఒక ఎకరంలో బంతిపూలు, టమోటాలు, అలసందలు, మునగ తదితర పంటలు వేశారు. ఈ కూరగాయలను రెండు, మూడు రోజులకు ఒకసారి పల్లెలకు తీసుకువెళ్లి అమ్ముతుంటారు. ఇలా రోజుకు ఈ పూలు, కాయగూరలను అమ్మడం వల్లే ఆమెకు రూ.2,000 నుంచి రూ.2,500 ఆదాయం వస్తోంది.
ఒక్క యాప్ అనేక వ్యాపార సంబంధిత కోర్సులు
ఈ ffreedom app నుంచి షర్మిలా గారు ప్రకృతికి ఏమాత్రం హాని చేయని సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాలను కూడా నేర్చుకున్నారు. అటు పై ఒక ఆవు, ఒక గేదెను తన సమీకృత వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నారు. వీటి నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఎరువులను తయారు చేసి వాటిని తన పంట పొలంలో వాడుతున్నారు. ఇలా ఈ ఒక్క ffreedom app నుంచే షర్మిలా గారు అనేక బిజినెస్ సంబంధిత కోర్సులను చేర్చుకుని నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఈ రోజే ffreedom app లక్ష్యాల గురించి తెలుసుకోండి. విజయ శిఖరాలను చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టండి.