“సరైన ప్రణాళికకు తోడు కష్టపడే తత్వం నీ వద్ద ఉంటే ఏ రంగంలోనైనా విజయం నీకు దాసోహం అవుతుంది”. ఈ వాఖ్యలు తెలంగాణకు చెందిన కరీంనగర్ కుర్రాడు శ్రీవర్థన్ కు సరిపోతాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ffreedom app చేయూతతో సరైన వ్యూహంతో ముందుకు వెళ్లడంతో పచ్చళ్ల వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి 3 రోజుల్లో 3 రెట్ల లాభం చేజెక్కించుకున్నాడు. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఇతని వ్యాపార వ్యూహాలు, చతురత మెచ్చి డిస్ట్రిక్ట్ రూరల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (DRDA) పాతిక లక్షల రుపాయలు రుణంగా ఇవ్వడానికి ఒప్పుకుంది. మరోవైపు ఈ పికిల్ బిజినెస్ ను మైక్రో ఇండస్ట్రీగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తానని ప్రామీస్ చేసింది.
“0” తో మొదలు
ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న శ్రీవర్థన్ కు ఏదో అసంతృప్తి. Bcom చదివిన ఈ యువకుడు వ్యాపారం పై మనసు పారేసుకున్నాడు. దీనివల్ల తాను ఒకరి వద్ద పనిచేయకుండా తానే పదిమందికి ఉపాధి కల్పించాలని కలలు కనేవాడు. అయితే అతని వద్ద ఇందుకు అవసరమైన పెట్టుబడితో పాటు వ్యాపార సంబంధ నైపుణ్యాలు ఏమాత్రం ఉండేవి కావు. అయినా కూడా వ్యాపారం ప్రారంభించాలని వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేయడం మానలేదు. ఈ క్రమంలోనే ffreedom app గురించి తెలిసింది. ఈ యాప్‌ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. అటు పై అందులో ఉన్న వ్యాపార సంబంధ అనేక కోర్సులను చూసాడు. అందులో ఉన్న వందల సంఖ్యల కోర్సులు చూసిన తర్వాత శ్రీవర్థన్ ను పికిల్స్ తయారీ బిజినెస్ కోర్సు బాగా ఆకర్షించింది. దీంతో ఈ పికిల్ లేదా పచ్చళ్ల వ్యాపారానికి సంబంధించిన కోర్సులో చేరి బిజినెస్ కు సంబంధించిన అన్ని విషయాల పై పూర్తిగా అవగాహన పెంచుకున్నారు.
A to z విషయాలు ఈ ffreedom app ద్వారానే
స్థానిక పరిస్థితులతో పాటు తన మనస్థత్వానికి దగ్గరగా ఉండే పచ్చళ్ల లేదా పికిల్స్ తయారీ బిజినెస్‌ను ప్రారంభించాలని శ్రీవర్థన్ నిర్ణయించుకున్నారు. ffreedom app లోని పికిల్ బిజినెస్ సంబంధిత కోర్సులో ఉన్న మాడ్యూల్స్ ద్వారా పెట్టుబడి, రిజిస్ట్రేషన్, అనుమతులకు సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకున్నారు. అంతేకాకుండా ఏ సమయంలో ఎటువంటి పికిల్స్ తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచితే మంచి లాభాలు అందుకోవచ్చన్న విషయం పై ffreedom app వల్ల స్పష్టత తెచ్చుకున్నారు. ముఖ్యంగా మార్కెట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తయారీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తయారైన పికిల్స్‌కు ధరలను ఎంత నిర్ణయించాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకున్నారు.
ఆ రెండు పికిల్స్ అంటే లొట్టలేసుకుంటారు
ఈ యాప్ ద్వారా అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ పికిల్స్ తయారీ, విక్రయానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకున్న తర్వాత శ్రీవర్థన్ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఎగ్ పికిల్, ఫిష్ పికిల్ తయారీ పై శ్రీ వర్థన్ మంచి పట్టు సాధించారు. వీటి సాంపుల్స్ ను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచగా వారు లొట్టలేసుకుంటూ తిని బాగుందన్నారు. దీంతో రూ. 5 వేల పెట్టుబడితో పికిల్స్ తయారు చేసి శ్రీవర్థన్ మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టాడరు. కేవలం 3 రోజుల్లోనే శ్రీ వర్థన్ తయారు చేసిన పికిల్స్ అన్నీ అమ్ముడు పోయి చేతికి రూ.45 వేలు అందాయి. ఇందులో ఎక్కువ భాగం ఎగ్, ఫిష్ పికిల్స్ అమ్మగా వచ్చిన లాభాలే. . అంతే శ్రీ వర్థన్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. తనకు ఇంతటి లాభాలు అందించడానికి కారణమైన ffreedom app కు ధన్యవాదాలు చెబుతున్నారు.
ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో DRDA అధికారులను కలిసి
పికిల్స్ అమ్మగా వచ్చిన లాభం కళ్లజూసిన శ్రీవర్థన్ రెట్టించిన ఉత్సాహంతో పికిల్స్ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి DRDA అధికారులను కలుసుకున్నాడు. వారికి తన వ్యాపార ప్రణాళికలు వివరించాడు. ఈ వ్యాపార ప్రణాళికలు నచ్చిన అధికారులు అతను కోరినట్లు రూ.25 లక్షలను వ్యాపార విస్తరణకు రుణంగా ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో శ్రీ వర్థన్ ఈ పికిల్స్ తయారీ యూనిట్‌ను ఓ మైక్రో ఇండస్ట్రీ స్థాయిగా మార్చడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఓ మామూలు ఉద్యోగిని పారిశ్రామికవేత్తగా మార్చిన ffreedom app లక్ష్యాలు మీరు కూడా తెలుసుకుని వెంటనే వ్యాపార ప్రణాళికలు రచించి, అమలు చేయడం మొదలుపెట్టండి. కాగా, తన విజయానికి కారణమైన ఈ యాప్ మేలును ఎన్నటికీ మరిచిపోనని శ్రీ వర్థన్ చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాపార నిర్వహణకు సంబంధించి తనకు వచ్చే సందేహాలకు అవసరమైన సమాధానాలు ఇప్పటికీ ffreedom app అందిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.