సోలిపేట గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా? మనలో చాలా మందికి, ఈ ప్రాంతం గురించి తెలిసి ఉండకపోవచ్చు. సిటీకి దాదాపు పాతిక కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిన్న గ్రామం అది. ఆ మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు, వినయ్ కుమార్ చవ్వా! అయితేనేం, వారు అదే ఊరులో ఉంటూ, ఏడాదికి అక్షరాలా పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నమ్మశక్యంగా లేదు కదూ! కార్పొరేట్ జీతాల కంటే ఎక్కువ డబ్బులు, ఫార్మింగ్ చేస్తూ, సంపాదించడం అసలు సాధ్యమేనా? అని ఆలోచిస్తున్నారా? ఇది నిజం! అవును! సొంత ఊరిలోనే ఉంటూ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ద్వారా, గణనీయంగా సంపాదిస్తున్న, వినయ్ కుమార్ చవ్వా కథను చదవడం మొదలుపెట్టండి.
బి.కాం గ్రాడ్యుయేట్, వ్యవసాయంలో తడబడ్డాడు
వినయ్ బి.కాం గ్రాడ్యుయేట్. పది సంవత్సరాల క్రితం, ఒక హార్డ్వేర్ షాపును ప్రారంభించారు. దాని నుంచి ఆశించినంతగా లాభాలు రాలేదు. ఆ సమయంలో, వారికి చిన్నతనం నుంచి మక్కువ పెంచుకున్న వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. చిన్నప్పటి నుంచి పొలం పనులలో, వారి తండ్రికి సహాయం చేయడం వల్ల కాస్త, అవగాహన ఉండడంతో, వెంటనే సాగు చేయడం ప్రారంభించారు. అయితే, వ్యవసాయం చేయడం అనుకున్నంత సులభం కాదని, వారికి అర్దమైయింది. వీరికి పొలం పనులు చేసే శ్రామికులు సరిగ్గా దొరకకపోవడం, క్లైమేట్, పంట తెగుళ్లు, రోగాలు, సాగు చేయడంపై సరైన అవగాహన లేకపోవడంతో, ఫార్మింగ్ లో అనుకున్నంత సంపాదించలేకపోయారు.
సాగుకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ffreedom app
ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో, వారు కాస్త నిరాశ చెందారు. అదే సమయంలో, ffreedom app వారి తలుపు తట్టింది. ఒకరోజు మొబైల్ చూస్తూ ఉండగా, సోషల్ మీడియా ద్వారా, ఈ యాప్ కనుగొన్నారు. వారికి ఫార్మింగ్ పై ఉండే ఎన్నో ప్రశ్నలకు, ఈ యాప్ సమాధానంగా నిలిచింది. వెంటనే, ffreedom appను డౌన్‌లోడ్ చేసి, దానికి సభ్యత్వాన్ని పొందారు. సమీకృత వ్యవసాయం (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్), తేనెటీగల పెంపకం, గొర్రెలు మరియు మేకల పెంపకం, జీరో-బడ్జెట్ వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఇప్పడి దాకా, వారు చేసిన వ్యవసాయంలో ఏం తప్పులు చేస్తున్నారో కూడా అర్ధం చేసుకున్నారు.
ఒకే పంట కన్నా, మిశ్రమ పంట మిన్న!
ffreedom app నుంచి, అనేక రకాల ఫార్మింగ్ విధానాలు, రకరకాల ఫార్మింగ్ కోర్సులను చూశాక, వారికీ మిశ్రమ సాగు, సమీకృత సాగుపై ఆసక్తి పెరిగింది. అంటే, ఒక స్థలంలో ఒకే పంట వేయడం కంటే, అదే స్థలంలో వివిధ పంటలను ఒకే సారి వేయడం, పంటలతో పాటు పౌల్ట్రీ, హనీ బీ ఫార్మింగ్, పాడి పశువుల పెంపకం చేయడం ద్వారా, అధిక లాభాలను పొందడమే కాక, అనవసర ఖర్చులు మిగుల్చుకోవచ్చు అని అర్ధం చేసుకున్నారు. వారి ఆశకు, ffreedom app తోడయ్యింది. ఇక లాభాలను ఎవరు ఆపగలరు?
“ఈ లాభాలను చూసి, మిగతా రైతులు కూడా అనుసరిస్తున్నారు!”
ffreedom app లక్ష్యం, మెరుగైన భారతదేశాన్ని నిర్మించడం. ఫార్మింగ్ లో ఉండే సవాళ్ళను, అవకాశాలగా మార్చి, రైతులకి మంచి లాభాలను అందించడమే కల! వినయ్, 26 ఎకరాల్లో, ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ, ఏడాదికి పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీరిని చూసి, మిగతా రైతులు కూడా, ఇదే సాగును చేయడం ప్రారంభించారు.
వినయ్ కుమార్ కు, వ్యవసాయం అంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు. వారు ffreedom app నుంచి వ్యవసాయ మెళకువలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, వివిధ పంటలను ఎలా పండించాలి, నష్టాలను ఎలా అరికట్టాలి అని నేర్చుకుని, ఇప్పుడు అమోఘమైన లాభాలు అందుకుంటున్నారు. మీరూ, మరో వినయ్ కుమార్ లా, ఫార్మింగ్ చేస్తూ, సక్సెస్ అవ్వాలి