అధిక ఆదాయం, సమాజంలో గౌరవం ఈ రెండూ కర్ణాటకకు చెందిన మంగళమ్మకు దక్కడానికి ఆమె ప్రయాణించిన వినూత్న మార్గమే కారణం. వాణిజ్య తరగతికి చెందిన చందనం చెట్లు లేదా శ్రీ గంధం చెట్ల పెంపాకన్ని చేపడుతూ ఆమె కోట్ల రుపాయల ఆదాయాన్ని అందుకోబోతున్నారు. ఈమె కథనం చదివిన వారికి “నలుగురు నడిచిన దారిలో నడవడం నాకు తెలియదురో” అన్న ప్రిన్స్ మహేశ్ బాబు పాట ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది.
చేయూతను ఇచ్చిన ffreedom app
50 ఏళ్ల వయస్సు ఉన్న మంగళమ్మ కర్ణాటకలోని చిక్కబళాపురకు చెందినవారు. ఆమె ఓ చేనేత కార్మికరాలు. తాను నేసిన చీరలను మార్కెట్లో కూడా విక్రయించేవారు. అయినా కూడ వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఎప్పుడూ ఆర్థిక కష్టాలతో సతమతమయ్యేవారు. దీంతో చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం పై దృష్టి సారించింది. అందరూ పండించే పంటలను కాకుండా అధిక ఆదాయాన్ని అందించే వాణిజ్య రకానికి చెందిన పంటలను సాగు చేయాలని భావించారు. ఇందుకోసం వివిధ రూపాల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే యూ ట్యూబ్లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలు, కథనాలు ఎక్కువగా వీక్షించేవారు. అదేసమయంలో ffreedom app కు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వివిధ రకాల వ్యవసాయ సంబంధ కోర్సులను చూశారు. ఇదిలా ఉండగా వ్యవసాయం అంటే చాలా మంది వరి, చెరుకు వంటి పంటలను పండించడానికే సిద్ధపడుతారు. అయితే మంగళమ్మ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేఖ పంథాను ఎంచుకున్నారు. అందుకే అటవీ, బహువార్షిక పంటల సాగుకు సంబంధించిన కోర్సుల్లో చేరి ఎర్రచందనం, శ్రీ గంధం చెట్ల సాగును చేయాలని నిర్ణయించుకుని ఆమేరకు ప్రణాళికలు రచించడం మొదలుపెట్టారు.
డిమాండ్ 7000 టన్నులు సరఫరా 600 టన్నులు
ఈ చందనం చెక్క లేదా శ్రీ గంధం చెక్కకు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఓ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా శ్రీ గంధం చెక్కకు 6000 నుంచి 7000 టన్నులకు డిమాండ్ ఉంది. అయితే ఇందులో 600 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అందులోనూ 200 టన్నులు ఒక్క భారత దేశం నుంచే జరుగుతోంది. దీని బట్టి ప్రపంచ మార్కెట్లో ఈ చెక్కకు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా భారత దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నయన్న విషయం అర్థమవుతుంది. ఇంతటి డిమాండ్ కు ప్రధాన కారణం ఈ చందనం లేదా శ్రీ గంధాన్ని వేర్వేరు రంగాల్లో ముడిపదార్థంగా వాడటమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఈ శ్రీ గంధంను సౌందర్య సాధనాలు తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఔషదాలు, ఆహార పరిశ్రమలో కూడా ఈ చెక్కను ఎక్కువగా వినియోగిస్తారు. మొత్తంగా ప్రస్తుతం ప్రతి ఏడాది దాదాపు 5000 టన్నుల శ్రీ గంధం కొరత ఉంది. భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల స్పష్టమవుతుంది.
300 మొక్కలు నాటిన మంగళమ్మ
ప్రపంచ వ్యాప్తంగా శ్రీ గంధం లేదా చందనం చెక్కకు పెరుగుతున్న డిమాండ్ ను అర్థం చేసుకున్న మంగళమ్మ తనకు ఉన్న ఎకరం పొలంలో శ్రీ గంధం మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. ఇందు కోసం ffreedom app లోని శ్రీ గంధం చెట్ల పెంపకానికి సంబంధించిన కోర్సును పూర్తి చేశారు. ఆ కోర్స్‌లో ఉన్న విషయాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఒక ఎకరం పొలంలో 300 శ్రీ గంధం మొక్కలతో పాటు 40 మహాగని మొక్కలను నాటారు. అంతేకాకుండా నిమ్మ, మునగ చెట్లను కూడా నాటారు. కాగా, ప్రస్తత మార్కెట్ రేటునే పరిగణనలోకి తీసుకుంటే ఈ 300 శ్రీ గంధం చెట్ల నుంచే వందల కోట్ల రుపాయల ఆదాయం అందుతుంది. అదేసమయంలో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ప్రస్తుతం నిమ్మ, మనగ చెట్ల నుంచి క్రమం తప్పక ఆదాయం వస్తోంది. ఇక ఈమె సాగు విధానాలను చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు.