లక్షల ఆదాయాన్ని అందుకోవడానికి చదువే అక్కర లేదు. సరైన పట్టుదల, ప్రణాళికతో పాటు మార్గదర్శకత్వం ఉంటే నెలకు ఓ సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం అందుకోవచ్చు. అటువంటి మార్గదర్శకత్వాన్ని ffreedom app అందించిందని గొర్రెలు, మేకల పెంపకంలో ఆదర్శ రైతుగా పేరుతెచ్చుకున్న బసవరాజ్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం…
చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి
మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మాన్వీ గ్రామం బసవరాజ్ సొంత ఊరు. ఇంటర్మీడియట్ అంటే PUC మాత్రమే చదివారు. దీంతో కుటుంబ పోషణకు ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. అటు పై పెయింటింగ్ కు సంబంధించిన షాపు నడిపేవాడు. అయితే ఇందులో కూడా అనుకున్నంతగా ఆదాయాన్ని గడించలేకపోయాడు. మరోవైపు షాపు నిర్వహణతో పాటు వారసత్వంగా వచ్చిన పొలంలో కొద్దిగా వ్యవసాయం కూడా చేసేవారు. అయితే బసవరాజ్‌కు వ్యవసాయం పై కంటే పశుపోషణ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఈ పశుపోషనను పారిశ్రామిక స్థాయిలో నిర్వహిస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు అందుకోవచ్చేనేది ఆయన ఆలోచన.
ఆలోచనకు చేయూతను ఇచ్చింది ffreedom app
అయితే బసవరాజ్ ఎప్పుడూ తన ప్రయత్నాలను వీడలేదు. పశుపోషణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో తెలుసుకుంటూనే ఉండేవారు. ముఖ్యంగా వార్తాపత్రికలు, టీవీ, ఆన్‌లైన్ ఇలా అన్ని దారుల్లో సమాచారాన్ని సేకరించేవాడు. అయితే ఏ మార్గమూ తనకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ద్వారా ffreedom app గురించి తెలిసింది. దీంతో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కోళ్లు, మేకలు, గొర్రెలు ఇలా పశుపోషణ, పౌల్ట్రీ పెంపకానికి సంబంధించిన అనేక కోర్సులను చూశారు. వీటి ద్వారా మేకలు, గొర్రెల పెంపకాన్ని చేపట్టాడు. ముఖ్యంగా అధిక మాంసాన్ని ఇచ్చే జాతులు ఏవో తెలుసుకున్నాడు. వాటి పోషణ, సంరక్షణ మేళుకువల పై అవగాహన పెంచుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందే వివిధ రకాల సబ్సిడీల గురించి తెలుసుకున్నారు. రుణాలు పొందడం ఎలాగో తెలుసుకున్నాడు.
నెలకు రూ.1 లక్ష ఆదాయం
ffreedom app ద్వారా నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించాడు. ముఖ్యంగా యాప్‌లోని కోర్సుల్లో పేర్కొన్నట్లు డిమాండ్‌ను అనుసరించి ధరను నిర్ణయించడం, సరఫరా వంటి విషయాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో అతి తక్కువ కాలంలోనే పశుపోషణలో అధిక లాభాలను అందుకున్నాడు. ప్రస్తుతం బసవారాజ్ ఫామ్‌లో 30 మేకలు, ఏడు గొర్రెలు, వందల సంఖ్యలో కోళ్లు ఉన్నాయి. ఇందులో ఒక్క మేకలు, గొర్రెలను స్థానిక మార్కెట్లో అమ్ముతూ నెలకు రూ.1 లక్ష రుపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. అదేవిధంగా కోళ్ల మాంసం, గుడ్లు అమ్మతూ మరింత ఆదాయం అందుకుంటున్నారు. ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణమైన ffreedom app గురించి బసవరాజ్ ఏమని చెబుతున్నాడంటే… “నీకు చదువులేదు. అందువల్ల వ్యాపారాన్ని సరిగా చేయలేవు. నష్టాలే వస్తాయి. అంటూ నన్ను హేళన చేసేవారు. అయితే ffreedom app లోని కోర్సులు నాలాంటి వారికి కూడా వ్యాపారాన్ని, పరిశ్రమను ఎలా లాభసాటిగా నిర్వహించాలో అర్థమయ్యేలా వివరించే వీడియోలు ఉన్నాయి. అందులోని విషయాలను నేర్చుకుని అమలు చేయడంతో ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ ఎంత జీతం అందుకుంటున్నాడో దాని కంటే ఎక్కువ ఆదాయంన నాకు వస్తోంది. ఇందుకు నేను ffreedom app కు ధన్యవాదాలు చెబుతున్నా” అని పేర్కొన్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ffreedom app లక్ష్యాలను తెలుసుకుని మీరు కూడా పశుపోషణ ద్వారా అధిక ఆదాయం గడించండి.