“మనసుకు నచ్చిన పని కష్టమైనా ఇష్టంతో చేస్తాం. విజయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తాం” అంటున్నారు నల్గొండకు చెందిన బొల్లం చంద్రకళ. వ్యాపారవేత్తగా ఎదగాలన్న కలను 35 ఏళ్లలో నిజం చేసుకున్న ఈమె ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయం.
టీచర్ ఉద్యోగానికి రాజీనామ చేసి
నల్గొండకు చెందిన బొల్లం చంద్రకళ వయస్సు 33 ఏళ్లు. ఆమె B.Sc (నర్సింగ్) పూర్తి చేసిన తర్వాత ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఆయితే ఆమెకు మొదటి నుంచి వ్యాపారవేత్తగా ఎదగాలనే కోరిక బలంగా ఉండేది. అందువల్లే వివిధ వ్యాపార, పారిశ్రామిక వేత్తల ప్రసంగాలను వింటూ ఉత్తేజం పొందేవారు. ఈక్రమంలోనే ఓ సారి ffreedom App వ్యవస్థాపకులై C.S సుధీర్ గారి ప్రసంగాలు ఆమెను చాలా ప్రభావితం చేశాయి. దీంతో తన మనసు చెప్పినట్లు వ్యాపార వేత్తగా మారాలని గట్టిగా నిర్ణయించుకుని టీచర్ ఉద్యోగానికి రాజీనామ చేశారు. ఈ క్రమంలో వచ్చిన విమర్శలను సైతం లెక్క చేయలేదు. అటు పై స్థానిక పరిస్థితులతో పాటు తనకు అనుకూలమైన వివిధ వ్యాపారాల కోసం అన్వేషించడం మొదలు పెట్టారు.
అక్కరకు వచ్చిన యాప్ పాఠాలు
ffreedom App లో అనేక కోర్సులను చూసి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఓ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన కోర్సులు ఆమెను బాగా ఆకర్షించాయి. ఈ క్రమంలో తన పరిస్థితులకు సరిపోయే రియల్ ఎస్టేట్ బిజినెస్ ను మొదలుపెట్టాలనుకున్నారు. దీంతో ffreedomApp సహకారంతో ఇందుకు సంబంధించిన అర్హతలు పెంపొందించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కావలసిన అనుమతులు కూడా పొందారు. అటు పై నెట్‌వర్కింగ్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్స్ తదితర విభాగాల పై పట్టుసాధించారు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.
రూ.12 లక్షల సంపాదన
యాప్ ద్వారా నేర్చుకున్న వాటితో పాటు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్‌లో స్వానుభవంతో నేర్చుకున్న విషయాలతో కస్టమర్ రిలేషన్స్ పై దృష్టి పెట్టింది. అంతే కాకుండా కష్టమర్స్ తో చక్కగా మాట్లాడి వారి పరిస్థితులకు తగ్గట్టు నివాస స్థలాలు, వ్యాపార స్థలాలు, భవనాలను లీజుకు మరియు అద్దెకు ఇప్పించడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సంపాదన నెలకు రూ.1 లక్ష కు తక్కువ కాకుండా ఉంది. ఈ లెక్కన బొల్లం చంద్రకళ ఏడాదికి దాదాపు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ విషయమై మన ఫ్రీడమ్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ “రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా మంది దూరంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు. అయితే సరైన ప్రణాళికతో ముందుకు వెళితే విజయం మనదే. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నా సంపాదనతోనే కారు కూడా కొన్నాను. నాకు అడుగడుగునా సాయం చేసిన, చేస్తున్న ffreedom App కు ఈ సందర్భంగా ధన్యవాదాలు” అని చంద్రకళ ఆనందం నిండిన కళ్లతో చెప్పారు.