“ధైర్యం నీ ఆయుధమైతే విజయం నీ వశమవుతుంది.” ఈ వాఖ్యానం అథెనా దీనా డిసౌజాకు సరిగ్గా సరిపోతుంది. కోవిడ్ దెబ్బకు ఉద్యోగం కోల్పోయినా ఆమె అధైర్య పడలేదు. తనకు ఇష్టమైన వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఇతరులకు ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదిగారు.
కోవిడ్ దెబ్బకు ఉద్యోగం కోల్పోయి
మంగళూరుకు చెందిన 33 ఏళ్ల ఎథీనా దీనా డిసౌజా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువు పూర్తి అయిన తర్వాత ఓ విమానయాన సంస్థలో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేవారు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఆమె ఉద్యోగం కోల్పోయారు. ఒక్కసారిగా జీవితం తలకిందులయ్యింది. ఉద్యోగి కంటే యజమానిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా! అని ఆలోచించడం మొదలుపెట్టారు. దీంతో ఏదేని వ్యాపారాన్ని ప్రారంభించాలని సంకల్పించుకున్నారు. ఆ సమయంలో దీనా యూ ట్యూబ్ లో ffreedom App గురించి తెలుసుకున్నారు.
ffreedom App చేయూతతో
యాప్ సబ్ స్రిప్షన్ తీసుకుని వివిధ వ్యాపార కోర్సుల్లో జాయిన్ అయ్యారు. ఇందులో కొవ్వొత్తుల తయారీ, BV 389 కోళ్ల పెంపకం (పౌల్ట్రీ) మరియు తేనెటీగల పెంపకం పై ఆసక్తిని పెంచుకున్నారు. అందులోని మొళుకువలను నేర్చుకున్నారు. మొదట మైసూర్ వెళ్లి కొవ్వొత్తుల తయారీలో అనేక ఏళ్ల అనుభవం ఉన్న (మెంటార్) శ్రీవిద్యను కలిశారు. ఆమె నుండి కొవ్వొత్తుల తయారీలోని మొళుకువలను నేర్చుకున్నారు. దీంతో క్యాండిల్ తయారీ విభాగం పై పట్టు వచ్చినట్లయ్యింది. అటు పై శ్రీ విద్య నుంచి రూ. 15,000 విలువైన కొవ్వొత్తులను తీసుకుని దీనా మార్కెటింగ్ చేశారు. ఇలా క్యాండిల్ మార్కెటింగ్ విభాగం పై కూడా పట్టు సాధించారు. అటు పై రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి సొంత బ్రాండ్‌తో క్యాండిల్స్ తయారు చేశారు.
పౌల్ట్రీ రంగంలో ప్రవేశం
తయారైన క్యాండిల్స్ ను ఫ్రీడమ్ నెస్ట్ (ffreedomnest)లో తన బ్రాండ్ క్యాండిల్స్‌ను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా దీనా తన ఉత్పత్తుల పై 30 నుంచి 40 శాతం మార్జిన్ అందుకుంటున్నారు. క్యాండిల్ తయారీ రంగంలో నిలదొక్కుకున్న తర్వాత ffreedom App ద్వారా నేర్చుకున్న కోళ్ల పెంపకం పై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు అందించే BV 380 కోళ్ల పెంపకం చేపట్టారు. ఈ రంగంలో కూడా ఇప్పుడిప్పుడే లాభాలు తీసుకుంటున్నారు. ఈ విషయమై దీనా డిసౌజ మన ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ ఉద్యోగం కోల్పోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో ffreedom App నాకు ఆశాకిరణమయ్యింది. నా ఊహలకు రెక్కలు తొడిగి వ్యాపార రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోయేలా చేస్తోంది.” అంటూ సంతోషం వ్యక్తం చేసారు.