చాక్లెట్ .., పిల్లలతో పాటు పెద్దలకూ ఇష్టమైనది. ఏ చిన్న సంతోషకరమైన సంఘటన జరిగా కూడా చాక్లెట్ తో ఆ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అందుకే చాక్లెట్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది. అందుకే పెద్దగా చదువుకోని హైదరాబాద్‌కు చెందిన వాసవి ఈ రంగంలో కాలుమోపి విజయపథకాన్ని ఎగురవేసారు. ఆమె స్ఫూర్తిదాయక కథనం వింటే చదువుకు వ్యాపారానికి అందులో విజయం సాధించడానికి చదువుతో సంబంధం లేదన్న విషయం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిందే.
చదివింది 8వ తరగతి మాత్రమే…
చాక్లెట్ వ్యాపారంలోకి రావాలనుకున్న వాసవి 8వ తరగతి మాత్రమే చదివారు. వీరు హైదరాబాద్‌కు చెందిన వారు. వాసవికి మొదటి నుంచి వ్యాపారం చేయాలని ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకునేది. పెళ్లైన కూడా తన లక్ష్యాన్ని మరిచిపోలేదు. ముఖ్యంగా కేవలం గృహిణిగా మాత్రమే మిగిలిపోవాలని భావించలేదు. దీంతో వ్యాపారం ఎలా ప్రారంభించాాలి? ఏ వ్యాపారం చేయాలి? వంటి వ్యాపార సంబంధిత సమాచారం సేకరించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాపార అవకాశాల కోసం ఎప్పుడూ ఎదురుచూసేవారు. ఈక్రమంలో ffreedom app గురించి తెలిసింది. దీంతో వెంటనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న వేర్వేరు కోర్స్‌ల గురించి తెలుసుకున్నారు.
అన్ని విషయాలు ffreedom app నుంచే
ffreedom app నుంచి ఆమె అనేక వ్యాపార సంబంధ కోర్సులను చూసారు. అందులో వాసవికి హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారం బాగా నచ్చింది. తన కుటుంబ పరిస్థితులకు ఈ వ్యాపారం బాగా సరిపోతుందని భావించారు. ముఖ్యంగా చాక్లెట్ వ్యాపారం ఇంటి వద్ద ఎలా ప్రారంభించాలి? వ్యాపారం చేయడానికి అవసరమైన పెట్టుబడి ఎంత ఉండాలి? వ్యాపారానికి అవసరమైన రుణాలు ఎక్కడ నుంచి సంపాదించాలి? రిజిస్ట్రేషన్ ఎక్కడ? ఎలా? చేపించాలి. వంటి విషయాల పై వాసవి స్పష్టత తెచ్చుకున్నారు. అదేవిధంగా తయారైన చాక్లెట్స్‌ను ఎలా మార్కెట్ చేయాలి? వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎటువంటి మెళుకువలు పాటించాలో యాప్ ద్వారా వాసవి తెలుసుకున్నారు. అదేవిధంగా మార్కెట్‌ను అనుసరించి ధరలను ఎలా నిర్ణయించాలో ffreedom app ద్వారా వాసవికి సంపూర్ణ అవగాహన వచ్చింది.
పెట్టుబడి రూ.4000 మాత్రమే…
చాక్లెట్ తయారీ, విక్రయానికి సంబంధించి ffreedom app ద్వారా నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా రూ.4000 పెట్టుబడిగా వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిని సొమ్ముతోనే ముడిపదార్థాలు, వివిధ రకాల తయారీ పరికరాలు కొన్నారు. అటు పై వేర్వేరు రకాల ప్లేవర్డ్ చాక్లెట్లను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. ఇలా తయారైన చాక్లెట్లను మొదట బంధువులు, స్నేహితులకు పంచారు. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను అనుసరించి ముడిపదార్థాల పరిమాణం, చాక్లెట్ల ఆకారం తదితర విషయాల్లో మార్పులు చేసి విక్రయించం మొదలు పెట్టారు. ఈ సమయంలో ffreedom app ప్రతినిధుల సహకారం కూడా అందుకున్నారు. ఇలా క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెంది వాసవికి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విషయమై వాసవి మాట్లాడుతూ “ఓ సాధారణ గృహిణి అయిన నేను విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి కారణం ffreedom app. నా స్వానుభావంతో చెబుతున్నాను. చాక్లెట్ బిజినెస్‌లో లాభాలు అతి త్వరగా అందుతాయి. అందుకే చాక్లెట్ వ్యాపారంలో దక్కే లాభాలు కూడా చాలా తియ్యగా ఉంటాయి” ఆనందం నిండిన కళ్లతో పేర్కొన్నారు.