“సమర్థతకు చదువు, వయస్సు కొలమానం కాదు” అన్న నానుడి ఎస్తేర్ రాణి దుడ్డు కు సరిపోతుంది. పదో తరగతి మాత్రమే చదవుకున్న ఈ 22 ఏళ్ల గృహిణి తన చాక్లెట్ వ్యాపారాన్ని లోకల్ టు గ్లోబెల్ దిశగా విస్తరిస్తున్నారు.
ఎస్తేర్ రాణి నుంచి చాక్లెట్ వ్యారంలో రాణి వరకూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ ప్రాంతానికి చెందిన ఎస్తేర్ రాణి దుడ్డు ప్రస్తుత వయస్సు 22. ఈమె 10 తరగతి వరకూ మాత్రమేచదివారు. చిన్నవయస్సులోనే పెళ్లి కూడా అయిపోయింది. అయితే అందరి అమ్మాయిలా పెళ్లి అయిన తర్వాత గృహిణిగా మాత్రమే ఉండిపోదలుచుకోలేదు. తన సంపాదన కూడా కుటుంబ అవసరాలకు అక్కరకు రావాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఇందుకు కోసం అనేక ప్రయత్నాలు చేసారు. అయితే అవి ఏవి అనుకున్నంత మంచి ఫలితాలు ఇవ్వలేదు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఎస్తేర్ రాణి దుడ్డు తన ప్రయత్నాలు మానలేదు. చివరికి ఇంటిలోనే ఉంటూ వ్యాపారం చేయదగ్గ అవకాశాలను అన్వేషించడం ప్రారంభించింది. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని చోట్ల వెదికేవారు. ముఖ్యంగా పేపర్లు, టీవీతో పాటు సోషియల్ మీడియాలోనూ వెదికేవారు. చివరికి ffreedom App లో సమాధానం లభించింది.
ఫ్రెండ్ సిఫార్సుతో
ఎస్తేర్ రాణి దుడ్డు పరిస్థితి గురించి బాగా తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఆమెకు ffreedom App గురించి చెప్పారు. దీంతో రాణి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అనేక కోర్సులను చూసారు. అందులో చాక్లెట్ తయారీ విక్రయానికి సంబంధించిన కోర్సు ఆమెను బాగా ఆకర్షించింది. తన పరిస్థితికి తగ్గట్లు అతి తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలు పొందవచ్చునని నిర్థారణకు వచ్చారు. ఈ యాప్ ద్వారానే మార్కెటింగ్, ప్యాకేజింగ్ , రవాణా, మార్కెట్‌ను అనుసరించి ధరను నిర్ణయించడం మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర విషయాల పై సంపూర్ణ అవగాహన పెంచుకున్నారు. అటు పై వెంటనే తన వ్యాపార ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించారు.
విఫలం నుంచి విజయం వైపు ప్రయాణం.
ffreedom app ద్వారా వ్యాపారానికి అవసరమైన అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలుసుకున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఖచ్చితంగా చెప్పాలంటే రూ.10వేలుతో చాక్లెట్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, పరికరాలను కొనుగోలు చేసి చాక్లెట్లు తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో రెండు మూడు సార్లు తయారు చేసిన చాక్లెట్ల నాణ్యత అంత బాగా ఉండేది కాదు. అంటే చాక్లెట్ల ఆకారం, రుచి అనుకున్నట్లు వచ్చేది కాదు. ఈ సమయంలో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అటు పై యాప్ ప్రతినిధి సలహాలు, సహకారాలు తీసుకుని మెల్లమెల్లగా చాక్లెట్ తయారీ మెళుకువలను పెంచుకున్నారు. మొదట్లో కొద్ది మొత్తంలో మాత్రమే చాక్లెట్‌లను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వయా ffreedom App
ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ చాక్లెట్లు, ఫ్రూట్ ప్లేవర్ చాక్లెట్లకు మంచి పేరు వచ్చింది. క్రమంగా ఆర్డర్లు పెరుగుతూ వస్తున్నాయి. మొదట్లో వాట్స్ అప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఆర్డర్లు కూడా తీసుకునేవారు. అయితే క్రయ విక్రయాలు స్థానికంగా మాత్రమే జరిగేవి. అటు పై ffreedom App ఫ్లాట్ ఫామ్ ద్వారా కూడా ఆర్డర్లు సంపాదించేవారు. అయితే క్రమంగా కస్టర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ రావడంతో కొన్ని ఈ కామర్స్ సైట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా ఆమె ఉత్పత్తులు చేరుతున్నాయి. దీంతో మొదట్లో రూ.10వేల పెట్టుబడితో ముడిపదార్థాలు కొని చాక్లెట్లు తయారు చేసిన ఎస్తర్ రాణి ప్రస్తుతం అంటే మూడు నెలల్లోనే ఒక్కొక్క విడుతకు రూ.50 వేల విలువ చేసే ముడిపదార్థాలను కొని వివిధ ఫ్లేవర్లలో ఛాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఒక్క విషయం చాలా ఎస్తర్ రాణి చాక్లెట్ వ్యాపారం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి. మీకు ఇంతటి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తే తడుముకోకుండా “ఇంకెక్కడి నుంచి ffreedom App నుంచే” అని తడుముకోకుండా నవ్వుతూ సమాధానం వచ్చింది ఈ చాక్లెట్ వ్యాపార “రాణి” నుంచి. ఇంతటి సక్సెస్ ఫుల్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ యొక్క వ్యాపార ప్రయాణం ఎంతో మంది మహిళలకు ఆదర్శం కాదంటారా?