Home » Latest Stories » వ్యవసాయం » దేశీయ కోళ్లు పెంచుదాం…లక్షల సంపాదన కళ్ల చూద్దాం

దేశీయ కోళ్లు పెంచుదాం…లక్షల సంపాదన కళ్ల చూద్దాం

by Sajjendra Kishore
1.3K views 3 mins read

నాటు కోళ్లను దేశీయ కోళ్లు అని కూడా అంటారు. అధిక పోషక విలువలు ఉన్న ఈ నాటు కోళ్లు ఏ వాతావరణంలోనైనా పెరుగుతాయి. వీటి నుంచి లభించే మాంసమే కాకుండా గుడ్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల అధిక లాభాలను అందుకోవడానికి అవకాశం ఉంది. వాణిజ్య కోళ్ల జాతులు అంటే బాయిలర్, లేయర్స్ తదితర కోళ్లతో పోలిస్తే వీటిలో వ్యాధి నిరోధకత చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రత్యేక షెడ్, ప్రత్యేక ఫీడ్ కూడా అంతగా అవసరం లేదు. కేవలం ఇంటి పెరట్లో కాని, పొలాల్లో కాని పెంచవచ్చు. అంటే వాణిజ్య జాతికి చెందిన పక్షులతో పోలిస్తే తక్కువ తిండి, కనిష్ట మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని స్పష్టంగా తెలుస్తుంది. స్థిరమైన ఆదాయాన్ని గడించాలనుకుంటున్న చిన్న, సన్నతరహా రైతులకు నాటీ లేదా దేశీయ కోళ్ల పెంపకం ఒక లాభదాయకమైనదని చెప్పవచ్చు. 

దేశీయ కోళ్ల ప్రత్యేకతలు ఇవి…

కంట్రీ కోళ్లు లేదా దేశీయ కోళ్లు లేదా నాటీ కోళ్ల ఫామ్ ను ఎలా ప్రారంభించాలనే వివరాలలోకి ప్రవేశించే ముందు అసలు దేశ కోళ్లు అంటే ఏమిటి మరియు అవి వాణిజ్య కోళ్ల నుండి ఎలా విభిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. గ్రామీణ కోళ్లు లేదా పెరటి కోళ్లు అని కూడా పిలువబడే దేశీ కోళ్లు వాణిజ్య కోళ్లతో పోలిస్తే మరింత సాంప్రదాయ మరియు సహజ వాతావరణంలో పెంచబడతాయి. అవి స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వాణిజ్య కోళ్ల జాతులకు ఆహారాన్ని మనుషులు అందజేస్తారు. అయితే దేశీయ కోళ్లు తమ ఆహారాన్ని 80 శాతం వరకూ అవే సేకరించుకుంటాయి. మిగిలిన 20 శాతం ఆహారాన్ని పెంపకందార్లు అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా BSF అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై ను ఈ దేశీయ కోళ్లకు ఆహారంగా అందిస్తారు. ఇది ఒక రకమైన ఈగ లార్వా. ఈ లార్వాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని కోళ్లకు ఆహారంగా ఇచ్చినప్పుడు ఆ పక్షులకు 40 శాతం ప్రోటీన్ అధికంగా అందుతుంది. దీంతో కోళ్లు తర్వగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతాయి. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై కోళ్లను వేగంగా ఎదగేలా చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి పక్షులు రోగాల బారిన పడకుండా అడ్డుకుంటాయి. ఈ బీఎస్‌ఎఫ్ ను కూడా అతి తక్కువ ఖర్చుతోనే సమకూర్చుకోవచ్చు. మొత్తంగా వాణిజ్యపరంగా పెరిగిన కోళ్లతో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగడం వల్ల వీటి ఉత్పత్తులు కూడా చాలా నాణ్యంగా ఉంటూ రుచి కూడా వాణిజ్య జాతుల కోళ్లతో పోలిస్తే అధికంగా ఉంటుంది. 

మార్కెట్ పరిశీలన చాలా అవసరం

అదేవిధంగా కోళ్ల ఫామ్ ప్రారంభించడానికి ముందు మార్కెట్‌ను పరిశీలించడం చాలా ముఖ్యంగా. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, మీ ఉత్పత్తికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా మీ ప్రాంతంలో దేశీయ కోళ్ల మాంసానికి ఉన్న డిమాండ్ ను మొదట తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరులు ఎవరైనా ఇప్పటికే దేశీయ చికెన్‌ను మార్కెట్‌లోకి తెచ్చి అమ్ముతున్నారా? ఒక వేళ అమ్ముతుంటే దేశీయ చికెన్ ధర ఎంత? వంటి విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఉత్పత్తి చేసే వస్తువు వ్యయం అంటే దేశీయ చికెన్ వ్యయం ఎంత అవుతుందన్న విషయం పై పూర్తి అవగాహన వస్తుంది. దీని ద్వారా ఎంత ధరకు సరుకు అంటే దేశీయ కోళ్ల మాంసాన్ని విక్రయించాలన్న విషయం పై స్పష్టత వస్తుంది. తర్వాత మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకుని విక్రయించాలి. అంటే కేవలం ఒక చిన్న చిన్న చికెన్ షాపులకు విక్రయిస్తారా? లేకపోతే వీటితో పాటు రెస్టారెంట్లు, హోటల్స్‌కు కూడా దేశీయ చికెన్‌ను విక్రయిస్తారా? అన్న విషయం పై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండవ ఆప్షన్ వల్ల ఎక్కువ లాభం సంపాదించడానికి అవకాశం ఉంది. మరోవైపు కోడి మాంసంతో పాటు పాటు కోడి గుడ్లు కూడా అధిక పోషక విలువలతో పాటు ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయి. ఒక్కొక్క గుడ్డు డిమాండ్‌ను అనుసరించి గరిష్టంగా రూ.20 వరకూ ధర పలుకుతుంది. ఇక ఆఫ్‌లైన్ తో పాటు ఆన్‌లైన్ విధానాల ద్వారా కూడా అంటే వివిధ రకాల సోషియల్ మీడియా వేదికల ద్వారా మీ కోళ్ల ఫామ్‌కు ప్రాచుర్యం కల్పించాల్సి ఉంటుంది. సోషియల్ మీడియా ద్వారా చికెన్ ధర, ఎక్కడ దొరుకుతుంది అన్న విషయాలే కాకుండా బ్రాయిలర్, లేయర్ చికెన్‌లతో పోలిస్తే దేశీయ కోళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేయాలి. దీని వల్ల విక్రయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. 

ఆరోగ్యానికి చాలా ముఖ్యం

దేశీయ చికెన్‌లో బ్రాయిలర్, లేయర్‌లతో పోలిస్తే ప్రోటీన్, ఐరన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా బ్రాయిలర్ లేదా లేయర్‌తో పోలిస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు అమ్లాలు ఉంటాయి. ఈ ఒమేగా 3 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఇక దేశీయ కోళ్ల మాంసం యాటిబయాటిక్ ఫ్రీ. అందువల్ల వీటిని ఏ వయస్సు వారైనా తినవచ్చునని వైద్యులు చెబుతున్నారు. 

రెండు కోళ్లమందికి పైగా…

భారత దేశంలో దేశీయ కోళ్లను దాదాపు రెండు కోట్లకు మందికి పైగా పెంచి విక్రయిస్తున్నారు. దీని వల్ల దేశీయ చికెన్‌కు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది నాటు కోళ్ల మార్కెట్ 18 శాతం సీఏజీఆర్ గా ఉంటోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశీయ కోళ్ల పెంపకం ఆర్థికంగానే కాకుండా గ్రామీణ ప్రాంత సామాజికాభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా మహిళలు, మరియు అట్టడుగు వర్గాలకు స్థానికంగానే మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. మొత్తంగా దేశీయ కోళ్ల పెంపకం లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపార మార్గం. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఇక దేశీయ కోళ్ల పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ffreedom App లోని ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!