Home » Latest Stories » వ్యవసాయం » డెయిరీ వ్యాపారం విజయవంతమైతే డబ్బే డబ్బు

డెయిరీ వ్యాపారం విజయవంతమైతే డబ్బే డబ్బు

by Bharadwaj Rameshwar

పాలకు మన ఆహారంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మనం పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తాం. అందువల్లే పాలకు పాల ఉత్పత్తులకు రోజు రోజు డిమాండ్ పెరుగుతూ పోతోంది. అందువల్ల ఈ రంగంలో వ్యాపారాన్ని ఒడిసిపట్టుకుంటే ప్రతి సంవత్సరం కోట్ల రుపాయలను కళ్ల చూడవచ్చు. అయితే డెయిరీ ఫామ్ వ్యాపారంలోకి ప్రవేశించే ముందు, క్షుణ్ణంగా పరిశోధన చేయడం చాలా అవసరం. స్థానిక మార్కెట్‌ను అర్థం చేసుకోవడంతో పాటు పాడి పశువుల నమ్మకమైన సరఫరాదారుని గుర్తించడం మరియు అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లను పొందడం కూడా చాలా అవసరం.  అటు పై మార్కెటింగ్ వ్యూహంతో సహా పటిష్టమైన వ్యాపార ప్రణాళికను కలిగి ఉండటం కూడా కీలకం.

ఎన్నో విషయాలు తెలుసుకోవాలి.

పాలకేంద్రం లేదా డెయిరీ స్థాపనకు అవసరమైన అవసరమైన ప్రాంతం ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్య రశ్మి, గాలి వెలుతురు బాగా తగిలేలా షెడ్డు నిర్మించాలి. ఇందుకోసం పశువుల పాక నిర్మాణంలో  శాస్త్రీయ విధానం తప్పక అనుసరించాల్సి ఉంటుంది.  పాల కేంద్రం లేదా డెయిరీలో వివిధ రకాల ఆవులు, గేదెలను పెంచాలి. అంటే పాలు ఎక్కువగా ఇచ్చే పశువులనే కాకుండా స్థానిక వాతావరణాన్ని తట్టుకునే జాతులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉన్న పశువులను పెంచాల్సి ఉంటుంది. 

మేకలు, గాడిద పాలకూ డిమాండ్ 

కేవలం గేదెలు, ఆవులే కాకుండా ఇటీవల మేకలు, గాడిద పాలకు కూడా డిమాండ్ ఎక్కువవుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీటి పెంపకానికి సంబంధించి కూడా ఆలోచించడం మంచిది. ఇక డెయిరీ ఫామ్‌లో పెరిగే పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటి వయస్సుతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అందించే టీకాలు ఎప్పటికప్పుడు అందించాలి. దీని వల్ల పశువులు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా అవి ఇచ్చే పాల పరిమాణంలో కూడా తగ్గకుండా ఉంటుంది. ఇక పాడి రైతులకు స్థానిక ప్రభుత్వాలు అనేక రాయితీలు అందిస్తోంది. అంటే పశువుల కొనుగోలుకు అవసరమైన రుణాలు అందించడం, రుణాల వడ్డీ పై సబ్సిడీలు అందిస్తూ పశు పోషణ పై రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే డెయిరీ ఏర్పాటు పెట్టుబడి కొంత వరకూ తగ్గుతుంది. 

ఉప ఉత్పత్తుల ద్వారా కూడా సంపాదన

పాలతో పాటు పాల ఉప ఉత్పత్తులను తయారు చేయడం, వాటిని మార్కెటింగ్ చేయడం పై కూడా అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించడానికి వీలవుతుంది. ముఖ్యంగా పాలతో పాటు ఫ్లేవర్డ్ మిల్క్, కోవ, దూద్‌పేడ, పన్నీర్ తయారు చేసి అమ్మవచ్చు. వీటి కోసం డెయిరీకి స్వతంగా బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. బ్రాండింగ్ కోసం అందుబాటులో ఉన్న సోషియల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. 

వ్యర్థాల ద్వారా కూడా సంపాదన

పాడి పశువుల వ్యర్థాలను కూడా అమ్ముతూ డబ్బును సంపాదించుకోవచ్చు. డెయిరీలోని పశువుల వ్యర్థాలను ఎరువుగా మార్చి వాటిని మార్కెట్లో విక్రయించవచ్చు. అదేవిధంగా ఈ వ్యర్థాలను బాగా కుళ్లబెట్టి వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్‌ను తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక వ్యర్థాలను బయో గ్యాస్‌గా మార్చి కూడా వినియోగించుకోవచ్చు. ఇలా డెయిరీ ఫామ్ ద్వారా కేవలం పాలను మాత్రమే విక్రయించడమే కాకుండా పాల ఉప ఉత్పత్తులు, పాడి పశువుల వ్యర్థాలను కూడా విక్రయిస్తూ అధిక ఆదాయాన్ని గడించడానికి వీలవుతుంది. 

మీరూ ఈ డెయిరీ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు.

పాల వ్యాపారంతో స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న ఔత్సాహిక యువత డెయిరీ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పటికే పాడి పశువులను పెంచుతూ ఉన్న రైతులు స్వతంగా డెయిరీ పెట్టి పాలను, పాల ఉప ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారికి అధిక లాభాలు వస్తాయి. పాలు, పాల ఉప ఉత్పత్తులతో అధిక లాభాలు అందుకోవాలనుకుంటున్న వారు ఈ డెయిరీ బిజినెస్ ప్రారంభించడానికి సిద్ధం కావచ్చు. ముఖ్యంగా సమీకృత వ్యవసాయ విధానం పై ఆసక్తి ఉన్నవారు ఈ డెయిరీ బిజినెస్ ప్రారంభించి అధిక అధాయాన్ని పొందడానికి వీలువుతంది. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!