బాతుల పెంపకం అనేక విధాలుగా లాభం…
బాతుల పెంపకం ఇటీవల లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ పక్షుల నుంచి కేవలం మాంసమే కాకుండా గుడ్లు, ఈకలను కూడా సేకరించి అమ్ముకోవచ్చు. అంటే ప్రధాన ఉత్పత్తులే కాకుండా ఉప ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంది. రెండవది ఇతర పౌల్ట్రీ పక్షులతో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. అంటే ఆహారం, వ్యాధి నివారణ తదితరులకు పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెటింగ్ తర్వాత వచ్చే లాభం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మూడవది అతి తక్కువ స్థలంలో లేదా ప్రత్యేక షెడ్డు అవసరం లేకుండా కూడా బాతులను పెంచవచ్చు. అందువల్ల బాతుల పెంపకం అన్నది చాలా లాభదాయకమైన వ్యాపారంగా చెప్పవచ్చు. ఈ కథనంలో ఈ బాతుల పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాతుల పెంపకం చాలా సులభం…అధిక లాభం
సాధారణంగా బాతులను ఇంటి పెరట్లో కూడా పెంచవచ్చు. అయితే వీటిని ప్రత్యేక షెడ్‌లో పెంచడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో కూడా వీటి పెంపకాన్ని చేపట్టవచ్చు. బాతులు ఏ వాతావరణంలోనైనా బాగా పెరుగుతాయి. బాతుల్లో అనేక జాతులు ఉన్నాయి. కొన్ని జాతులను మాంసం కోసం పెంచితే మరికొన్ని జాతులను గుడ్ల కోసం పెంచుతారు. ఉదాహరణకు పెకిన్, ముస్కోవి అన్నవి మాంసం కోసం పెంచుతారు. అదేవిధంగా ఖాకీ కాంప్‌బెల్, ఇండియన్ రన్నర్ బాతు జాతులను వాటి గుడ్ల కోసం పెంచుతారు. వీటి గుడ్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి. కోడి గుడ్ల కంటే వీటి పరిమాణం ఎక్కువ అందువల్ల బేకింగ్ ఇండస్ట్రీలో వీటికి డిమాండ్ అధికం. అందువల్ల వీటికి మార్కెట్లో అధిక ధర లభిస్తోంది.
కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం
ముందుగానే చెప్పినట్లు బాతుల సంరక్షణ చాలా సులభం, కానీ పరిగణించవలసిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. బాతులకు ఎల్లవేళలా స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండాలి మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వాటి నివాస స్థలాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బాతులకు సమతుల్య ఆహారం కూడా అవసరం. సమతుల్య ఆహారం వల్ల పక్షులు ఆరోగ్యంగా, వేగంగా పేరుగుతాయి. అందువల్ల వీటికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. ఈ ప్రాథమిక అవసరాలతో పాటు, బాతులు నిద్రించడానికి షెడ్ లేదా కూప్ వంటి సురక్షితమైన స్థలాన్ని కలిగి ఉండటం మరియు అవి సంచరించడానికి మరియు మేత కోసం కంచెతో కూడిన మైదాన ప్రాంతం ఉండటం వల్ల కూడా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. బాతులు ఏ వాతావరణంలోనైనా మనుగడ సాగిస్తాయి. అంటే అటు ఉష్ణ ఇటు శీతల వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెరుగుతాయి. అందువల్ల వీటి పెంపకానికి ఎక్కువ ప్రారంభ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.
పౌల్ట్రీ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి…
పౌల్ట్రీ రంగంలో రాణించాలని భావిస్తున్న వారు ఈ బాతుల పెంపకాన్ని చేపట్టవచ్చు. అదేవిధంగా ఇప్పటికే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కూడా బాతుల పెంపకాన్ని ఒక యూనిట్‌గా ప్రారంభించవచ్చు. సమీకృత వ్యవసాయ విధానాల ద్వారా అధిక లాభం పొందాలని భావిస్తున్న ఔత్సాహిక రైతులు కూడా ఈ బాతుల పెంపకాన్ని చేపట్టవచ్చు. అయితే బాతుల పెంపకాన్ని చేపట్టే ముందు ఈ రంగంలో ఇప్పటికే అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందుకోసం ఈ కోర్సును పరిశీలించవచ్చు. ఒక్క జాతికి చెందిన బాతులే కాకుండా వివిధ రకాల జాతులను పెంచడం వల్ల స్థిరంగా, అధిక లాభాలు అందుకోవచ్చు. పెట్టుబడితో పాటు బాతుల పెంపకానికి అవసరమైన అనుమతులు, ప్రభుత్వం అందించే సబ్సిడీల గురించి తెలుసుకోవడం మంచిది. బాతు జీవిత చక్రం తెలుసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఏ సమయంలో ఏ ఆహారం, మందులు ఇవ్వాలో తెలుస్తుంది. అంతేకాకుండా ఏ సమయానికి మార్కెట్ చేయవచ్చన్న విషయం పై స్పష్టత వస్తుంది. చివరిగా మార్కెట్‌ను అనుసరించి బాతులను, వాటి గుడ్లను ఈకలకు ధరను నిర్ణయించి అమ్మడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాగా, పౌల్ట్రీ రంగానికి చెందిన వివిధ రకాల కోర్సుల కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.