Home » Latest Stories » వ్యాపారం » చేపలు అమ్ముదాం..చక్కని సంపాదనపరులవుదాం

చేపలు అమ్ముదాం..చక్కని సంపాదనపరులవుదాం

by Sajjendra Kishore
498 views

చికెన్, చేపలు వీటి మార్కెట్ రోజు రోజుకు వస్తోంది. అందువల్ల చేపలు చికెన్ రిటైలింగ్ బిజినెస్ ఔత్సాహిక వ్యాపారస్తును ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇందులో అధిక లాభాలు ఉండటమే. సరైన ప్రణాళిక, అమలు మరియు మార్కెటింగ్‌తో ఈ ఫిష్ చికెన్ రిటైలింగ్ బిజినెస్ ద్వారా మీరు నెలకు కనీసం 10 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే ఇందుకు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం

అందులో మొదటిది, ప్రధానమైనది బిజినెస్ ప్రారంభించే ప్రాంతం అంటే చేపలు చికెన్ రిటైలింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి దశ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం. మీరు మీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి ప్లాన్ చేసే ప్రాంతంలోని కస్టమర్‌ల అవసరాలు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు ఈ సమాచారాన్ని సేకరించడానికి మార్కెట్‌ను క్షుణంగా పరిశోధించవచ్చు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి తదనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలి. 

విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలి..

మీరు మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించిన తర్వాత, మీరు విక్రయించాలనుకుంటున్న చేపలు , చికెన్ రకాన్ని నిర్ణయించుకోవాలి. మంచినీటి చేపలు, ఉప్పునీటి చేపలు, బ్రాయిలర్ చికెన్, లేయర్ చికెన్, నాటీ కోళ్లు మొదలైన అనేక ఎంపికలు ఉన్నాయి. మీ టార్గెట్ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేపలు , చికెన్ రకాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల విక్రయాలు జోరుగా జరుగుతూ అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏ  రకాల చేపలు, చికెన్ విక్రయించాలని నిర్ణయించుకున్న తర్వాత, మీరు వాటిని సరైన సరఫరాదారునుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు స్థానిక రైతులతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా హోల్‌సేల్ పంపిణీదారులతో కూడా ఇటువంటి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల చేపల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అటు పై వస్తువు నాణ్యత చాలా ముఖ్యం. అంటే  విక్రయించే చేపలు , చికెన్ తాజాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మార్కెట్లో అధిక లభించడానికి వీలవుతుంది. 

ధరను నిర్ణయించడం పై మెళుకువలు

ఇక మార్కెట్‌ను అనుసరించి చేపలు , చికెన్‌కు ధరను నిర్ణయించడం కోసం లాభాల పై ప్రభావాన్ని చూపుతుంది.  చేపలు , చికెన్‌ను నిర్ణీత ధరకు విక్రయించడాన్ని అందులో ఒక వ్యూహ్యం. ఇక రెండవది ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి డిస్కౌంట్‌లు, వివిధ డీల్స్‌ను అందించడం. ధరలను నిర్ణయించేటప్పుడు ఉత్పత్తి వ్యయం మరియు మార్కెట్‌లోని పోటీని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడు మాత్రమే లాభాలు అందుకోవచ్చు. కేవలం ఆఫ్ లైన్‌లో మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో విక్రయించడం వల్ల ఎక్కువ వినియోదారులను మీ వ్యాపార సేవలను అందించడానికి వీలుపడదు. అందువల్ల ఆన్‌లైన్ విధానాల్లో కూడా విక్రయాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టోర్ ఏర్పాటులో మనం డిజైన్, ప్రాంతం, ఇంటీరియర్ తదితర విషయాలను పరిగనణలోకి తీసుకుంటాం. అదేవిధంగా ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటులో మీరు ప్రత్యేక వెబ్‌సైట్, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ తో టై అప్ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని విక్రయాలు కొనసాగించాలి. స్థానికులతో వాట్స్‌అప్ గ్రూపులు ఏర్పాటు కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. 

మార్కెటింగ్ మెళుకువలు

మొత్తంగా రీటైల్ బిజినెస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మార్కెటింగ్ మెళుకువల పై కూడా అవగాహన అవసరం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కూడా ప్రకటనలు ఇవ్వాలి. సోషియల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రస్తుతం చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి వీలవుతుంది. మార్కెటింగ్‌తో పాటు, కస్టమర్‌లను నిలుపుకోవడానికి మరియు కొత్త వారిని ఆకర్షించడానికి మీరు కస్టమర్ సర్వీస్ పై దృష్టి పెట్టాలి. ఇందులో అద్భుతమైన కస్టమర్ సర్వీసెస్ అందించడం, కస్టమర్ ఫిర్యాదులు మరియు ప్రశ్నలను వెంటనే పరిష్కరించడం మరియు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందించడం వంటివి ఇందులో ప్రధానమైనవి. ఈ విషయలన్నింటిని పరిగణనలోకి తీసుకుని సరైన ప్రణాళికతో చికెన్, చేపల రీటైలింగ్ బిజినెస్‌ను ప్రారంభించడం వల్ల నెలకు రూ.10 లక్షల ఆదాయాన్ని గడించవచ్చు. అయితే, ఈ వ్యాపారంలో విజయానికి అంకితభావం, కృషి మరియు పట్టుదల అవసరమని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

 ఈ రకమైన వ్యాపారం వీరికి నప్పుతుంది.

మాంసాహార చిల్లర వర్తక రంగంలో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు చేపల మరియు చికెన్ రిటైల్ బిజినెస్ ప్రారంభించవచ్చు. మాంసాహార రీటైల్ బిజినెస్ రంగంలోకి రావాలనుకుంటున్నవారు ఈ బిజినెస్ గురించి ఒకసారి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉంటుంది.  వివిధ రకాల రిటైల్ బిజినెస్ లను చేస్తూ తమ ఫోర్ట్‌ఫోలియోలో మరో రంగాన్ని చేర్చుకోవాలనుకుంటున్నవారు ఈ చేపలు చికెన్ రిటైల్ బిజినెస్ లాభదాయకం. పౌల్ట్రీ / ఫిషరీస్ కోర్సులు చదువుతూ సొంతంగా ఆయా విభాగాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న విద్యార్థులు ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. అదేవిధంగా వ్యాపార ప్రారంభానికి అవసరమైన సహాయ సహకారాలు ఎంతమేరకు అందుతాయన్న విషయాన్ని ffreedom App అందించే కోర్సు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. 

చేపలు, చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు

చేపలు మరియు చికెన్ రెండు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోటీన్ వనరులు. అంతేకాకుండా ఈ చేపలు ఎక్కువగా  ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి హృదయ సంబంధ రోగాలు దరిచేయకుండా కాపాడుతాయి. అదేవిధంగా కొన్ని రకాల క్యాన్సర్‌లకు అడ్డుకట్టువేస్తాయి. ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3లో పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా చేపలు విటమిన్ డి, అయోడిన్, సెలీనియంను కూడా మనకు అందిస్తాయి. ముఖ్యంగా సెలీనియం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. ఇక చికెన్‌లో ప్రోటీన్స్ ‌తో పాటు విటమిన్ బి, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు, గోళ్లు పెరగడానికి సహాయం చేస్తాయి. అదేవిధంగా ఇందులోని ఇనుము శరీరం అంతటా ఆక్సిజన్ రవాణా చేయడానికి సహాయపడుతుంది. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!