Home » Latest Stories » వ్యవసాయం » టాప్ 5 బెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆప్షన్స్ ఇవే!

టాప్ 5 బెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆప్షన్స్ ఇవే!

by Rishitaraj
504 views

“ఆహా, ఏమీ రుచి, తినరా మైమరచి, రోజూ తిన్నా మరీ మోజే తీరనిది” అన్నారు ఓ తెలుగు కవి. అంతలా మన జీవితంలో, ఫుడ్ అనేది మన జీవితాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు బ్రతకడానికి తింటుంటే, మరికొందరు బ్రతికేదే తినడం కోసం అనేట్టుగా తింటారు. రోజంతా పని ఒత్తిడి, అలసట, ఉరుకులు-పరుగుల జీవితాలు. అందుకే కాస్త ఆహారమైన, కొంచెం రుచిగా తినాలని భావిస్తుంటారు. మన ఇళ్లల్లో, బంధువులు లేదా అనుకోని అతిథులు వచ్చినప్పుడు, అప్పటికప్పుడు ఫుడ్ వెరైటీస్ చేయడం అనేది కష్టం& శ్రమతో కూడుకున్న విషయం. ఇటువంటి విషయాల నుంచి ఇంట్లో వారికి (ముఖ్యంగా ఆడవారు) విముక్తి కలిగిస్తున్నవి, హోటల్స్, రెస్టారెంట్స్. అందుకే వీటికి అంతగా డిమాండ్. 

పక్క దేశాలు, మన వంటింట్లోకి చొరబడ్డాయి!

 కొంత మందికి కొత్త కొత్త రుచులను, ఇతర ప్రాంతాల ఫుడ్ తినాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో టీనేజ్, మిడిల్ ఏజ్ వారు, కొరియన్ పాప్, కొరియన్ & జాపనీస్ డ్రామాలు, యానిమేషన్ ఎక్కువగా చూడడం ద్వారా, కొరియన్, జపనీస్ వెరైటీస్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అదివరకు, కొత్త దేశం రుచులు చూడాలంటె, ఆ దేశం వీసా కోసం అప్లై చేయాల్సివచ్చేది. ఇప్పుడు కేవలం స్విగ్గీ, జొమాటోలలో ఆర్డర్ చేస్తే చాలు, పక్క దేశాల రుచులు వచ్చి, ఇంట్లో వాలుతున్నాయి. మారుతున్న గ్లోబల్ కల్చర్ ద్వారా, ఇప్పుడు మన దగ్గర కూడా ఇతర దేశ వంటకాలను అందించే రెస్టారెంట్స్ ఎన్నో వెలిశాయి.

కాకా హోటల్ నుంచి ఫైవ్ స్టార్ వరకు, అన్నిటికీ డిమాండ్!

ఈ ఫుడ్ సంబంధిత మరో గొప్ప విషయం ఏంటంటే, అందరికీ రెస్టారెంట్లో భోజనం చేసే స్థోమత ఉండకపోవచ్చు. అందుకే ఆటో- రిక్షా నడిపే వారు, ఇతర కార్మికులు, డబ్బులు లేని వారు, రోడ్ సైడ్ బండి (ఫుడ్ కార్ట్) దగ్గర తక్కువ ధరకే కడుపు నింపుకుంటూ ఉంటారు. ఇలా అందరి ఆకళ్ళు & ఇష్టాలు తీర్చే ఫుడ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి! అందుకే, వారాలు, ప్రాంతాలు, సీజన్స్ తో పని లేకుండా ఫుడ్ బిజినెస్ రన్ అవుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో కూడా, ఫుడ్ బిజినెస్ వారికి మంచి లాభాలే ఉండేవి అంటే నమ్ముతారా? 

అందుకే ఎందరో నిరుద్యోగులు, వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు, ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టం ఉండే వారు, ఇంటర్నెట్ లో దీని గురించి వెతుకుతూ ఉన్నారు. మనదేశంలో ఫుడ్ బిజినెస్ లాభమా? నష్టమా? ఫుడ్ బిజినెస్ లాభాలేంటి? ఎటువంటి ఫుడ్ బిజినెస్ స్థాపించాలి? ఎవరైనా ఫుడ్ ట్రక్ వ్యాపారం ప్రారంభించవచ్చా? బేకరీ బిజినెస్ సంగతేంటి? అమ్మో ఇలా చాలా ప్రశ్నలు! వీటన్నిటికీ, సమాధానం ఈ బ్లాగులో మీకు లభిస్తుంది. ఇంకెందుకు లేట్, ముఖ్యమైన టాప్ 5 ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందామా?

రెస్టారెంట్ బిజినెస్ – లాభాలు భేష్

ఈ ఫుడ్ బిజినెస్లో, అత్యంత ప్రముఖమైనది, రెస్టారెంట్ బిజినెస్. ఈ రెస్టారెంట్ బిజినెస్లో భాగంగా, నిర్ణిత స్థలం తీసుకుని అందులో కూర్చీలు, బల్లలు, తినడానికి వసతులు కలిపించాలి. వంట చేయడానికి వేరుగా అన్నీ వసతులు ఉండాలి. ఫుడ్ సర్వ్ చేసేవారు వేడి వేడిగా సర్వ్ చేస్తుంటే, తినే వారందరికీ మహారాజభోగంలా అనిపించక మానదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కలిసి వెళ్లి తినడానికి, రెస్టారెంట్ బెస్ట్ ఆప్షన్. అందుకే కొత్తవి ఎన్ని వచ్చినా, వీటి క్రేజ్ అలాగే ఉంటుంది. ఇందులో మీరు హోటల్లో చక్కని పరిశుభ్రత వాతావరణం, ఆకట్టుకునే ఇంటీరియర్, చక్కని మెన్యూ కలిపిస్తే, మంచి లాభాలని పొందొచ్చు. వీటి పెట్టుబడి వివరాలు, ఎక్కడ రెస్టారెంట్ స్థాపిస్తే బాగుంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లాభాలు పొందాలంటే ఎలా, ఇలా ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ffreedom app నుంచి, రెస్టారెంట్ బిజినెస్ గురించి A టూ Z నేర్చుకోండి. 

కేటరింగ్ బిజినెస్- గల్లాపెట్ట కళకళ

ఇక ఫుడ్ బిజినెస్లో, మంచి లాభాలను తెచ్చిపెట్టే మరో బిసినెస్, కేటరింగ్ బిజినెస్. ఇందులో భాగంగా, ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి, వారికి ఫుడ్ సప్లై చెయ్యాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మీరు మీ పాకశాలలో వండవచ్చు లేదా ఆర్డర్ చేసిన వేదిక దగ్గర వండవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఎక్కువ మొత్తంలో ఫుడ్ వండాల్సి వచ్చినపుడు, కేటరింగ్ వారిని ఆశ్రయిస్తారు. ఈ బిజినెస్ ప్రారంభించాలి అంటే, మీ వద్ద తగిన మొత్తంలో సిబ్బంది, ఎక్కువ మందికి వండడానికి కావాల్సిన పెద్ద పాత్రలు, అలాగే ధరలు, ఫుడ్ అంచనా వేయగల నేర్పరితనం ఉండాలి. ఇందులో మీరు వెజ్ లేదా నాన్-వెజ్  వంటలు వండవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్ సీజన్లో కేటరింగ్ బిజినెస్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మిగతా కాలంలో కూడా, పుట్టిన రోజు, ఇతర సింపుల్ ఫంక్షన్స్ కోసం ఎక్కువమంది కేటరింగ్ ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఈ బిసినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, ffreedom app నుంచి కేటరింగ్ బిజినెస్ గురించి నేర్చుకోండి. 

ఫుడ్ ట్రక్ బిజినెస్తో, ఫుల్లుగా లాభాలు!

ఈ మధ్య కాలంలో ప్రతీ చోటా ఎక్కువగా వినిపించేది, కనిపించేది, ఫుడ్ ట్రక్ బిజినెస్. ‘పెళ్ళిచూపులు’ మూవీ చూసిన ప్రతీ వారికి, దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫుడ్ కార్ట్, బండి, ట్రక్ వంటి వాహనాలలో అప్పటికప్పుడూ, ఫుడ్ చేసి లేదా ఆల్రెడీ వండిన ఫుడ్ అమ్ముతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ బిసినెస్ కొరకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి, ఫుడ్ ట్రక్ బిజినెస్లు. రద్దీగా ఉండే ప్రాంతాలలో, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, గణనీయమైన లాభాలు అందుకుంటున్నవారు ఎందరో. రెస్టారెంట్ కంటే తక్కువ పెట్టుబడి, నిర్వహణా ఖర్చులు తక్కువగా ఉండడం, రద్దీ ఎక్కువగా లేకపోతే/ బిజినెస్ సరిగ్గా సాగని పక్షంలో వేరే లొకేషన్ కి వెంటనే షిఫ్ట్ చేసుకునే వసతి ఉండడం. పెద్ద స్థలం లేకపోయినా సరే, దీనిని నిర్వహించుకోవచ్చు. ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి, ffreedom app నుంచి, ఈ కోర్సును నేర్చుకుని బాగా సంపాదిస్తున్న శ్రీనివాస్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోండి. 

క్లౌడ్ కిచెన్ బిజినెస్ లాభాలతో క్లౌడ్ నైన్లో  ఉండండి!

క్లౌడ్ కిచెన్ అంటే ఇప్పటి యువతకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలియని వారు, పేరు విని గాల్లో తేలుతూ భోజనం చేయడం అనుకుంటారేమో, కాదండీ! ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అవుతున్న ఫుడ్ బిజినెస్ ఇది. ఇదొక డెలివరీ- ఓన్లీ బిజినెస్ మోడల్. ఇందులో మీ వంటగది/ కమర్షియల్ కిచెన్ సెట్ అప్ నుంచి డెలివరీ లేదా టేక్ అవే మాత్రమే ఉంటుంది. ఇందులో, మీ దగ్గరికి వచ్చి తినడానికి వీలు పడదు. ఇటువంటి బిసినెస్ కొరకు మీరు డెలివరీ పార్టనర్స్ తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఇట్స్ వంటి వాటితో ఒప్పందం చేసుకుని, వారికి మీ లాభంలో కొంత చెల్లించాలి. మీకు వీలైన సమయంలోనే వంట చేయడం, పెట్టుబడి ఎక్కువగా లేకపోవడం, ఎక్కువ డెలివరీలు చేయగలగడం, ఇందులో ప్లస్ పాయింట్స్. ఈ కిచెన్ ప్లానింగ్ నుంచి, లాభాలను ఎలా అర్ధం చేసుకోవాలి అని తెలుసుకోవడానికి, ffreedom app రూపొందించిన క్లౌడ్ కిచెన్ కోర్సు, ఈ రోజే నేర్చుకోవడం మొదలు పెట్టండి. 

ఆర్గానిక్/ హెల్తీ ఫుడ్ కొరకు హై డిమాండ్  

కరోనా పరిణామాల తర్వాత, ప్రజలకి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే కరోనా సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ కాలంలో అందరూ ఒత్తిడితో జీవిస్తున్నవారే. ఉద్యోగాలు, తగినంత వ్యాయామం లేకపోవడంతో, సగానికి పైగా జనాభా, బీపీలు, మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ, ప్రవేశపెట్టిందే హెల్తీ ఫుడ్. మీ ఆరోగ్యాన్ని బ్యాలన్స్ చేసే విధంగా దీనిని వండుతారు. ఈ ఫుడ్లో వాడే పదార్ధాలు, చేసే విధానం, క్వాంటిటీ ఇలా ప్రతిదాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ బిజినెస్ కోసం న్యూట్రిషన్ విలువలు తెలిసిన నిపుణులు మన వద్ద ఖచ్చితంగా ఉండాలి. హెల్త్ పై పెరుగుతున్న ఆసక్తి, ఇప్పటికే మనల్ని ఆవరించి ఉన్న అనారోగ్యాలకు, హెల్తీ ఫుడ్/ ఆర్గానిక్ ఫుడ్ చక్కని ఉపశమనం. రానున్న రోజుల్లో, దీనిపై కోర్సు కూడా రూపొందించనున్నాం. ఎందుకంటే, సరైన జీవనోపాధి మార్గాలను అందించడమే, ffreedom app లక్ష్యం, కాస్త వేచి ఉండండి!

మరెన్నో ఫుడ్ బిజినెస్ ఆప్షన్స్

ఇవే కాకుండా టిఫిన్ సెంటర్స్, బేకరీ బిజినెస్, జ్యూస్ సెంటర్స్, ఐస్ క్రీమ్స్ షాప్, కేఫ్ లు, చాక్లెట్ బిజినెస్ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఇటువంటి కోర్సులపై పూర్తి సమాచారం మీకు ffreedom appలో లభిస్తుంది. కేవలం బిజినెస్ గురించే కాకుండా ఇందులోని లోతుపాతులు, లైసెన్స్ ప్రక్రియలు, పెట్టుబడి అవసరాలు, పెట్టుబడిని ఎలా సమకూర్చాలి, తక్కువ పెట్టుబడితో ఎలా వ్యాపారం ప్రారంభించాలి, ఎటువంటి లొకేషన్లో వీటిని ఓపెన్ చేస్తే మంచి లాభాలుంటాయి, అని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మీరు కూడా ఈరోజే ఈ యాప్ నుంచి ఫుడ్ బిసినెస్ గురించి తెలుసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే, ఫుడ్ బిజినెస్ లో సగటు ప్రాఫిట్ మార్జిన్ 30 శాతం ఉంటుంది. డబ్బుకు డబ్బు, కస్టమర్లకు మంచి ఆహరం అందించడం మీ లక్ష్యం అయితే ffreedom app ఈ ప్రయాణంలో మీ తోడుంది. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!