Home » Latest Stories » వ్యవసాయం » గరీబును నవాబును చేసే “గిర్” ఆవులు 

గరీబును నవాబును చేసే “గిర్” ఆవులు 

by Bharadwaj Rameshwar
240 views

పాడి పశువులను పెంచి వాటి పాలను అమ్ముతూ అత్యధిక లాభాలను గడించాలనే ఆలోచనతో ఉన్న ఔత్సాహిక పాడి రైతులకు గిర్ ఆవుల పెంపకం మంచి ఎంపిక అవుతుంది. సరైన విషయ పరిజ్ఞానం మరియు నిర్వహణ నైపుణ్యం ఉంటే ఒక నెలలోనే రూ.3 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి రూ.36 లక్షల ఆదాయాన్ని అందుకోవచ్చు. గిర్ జాతి ఆవు పాలలో అధిక శాతం వెన్న ఉంటుంది. గిర్ జాతి పాడి పశువులు పరిమాణంలో పెద్దవిగా ఉన్నా కొంత శాంత స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల పాడి పశువుల్లో ఇతర జాతులతో పోలిస్తే వీటి పెంపకం చాలా సులభం. అయితే గిర్ పాడి పశువుల పెంపకానికి, డెయిరీ వ్యాపార నిర్వహణకు చాలా నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. ముందుగా గిర్ జాతి ఆవుల పాలకు మార్కెట్‌లో ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉందో తెలుసుకుంటే గిర్ ఆవుల డెయిరీ ఫామ్ ఎందుకు లాభదాయకమో అర్థమవుతుంది. 

గిర్ ఆవు పాలు ఎంతో ఆరోగ్య కరమైనవి…

గిర్ ఆవు పాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆవు పాలలో అత్యంత ఆరోగ్యకరమైన మరియు అత్యంత పోషకమైన రకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. గిర్ ఆవు పాలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్లు A, D మరియు B12, అలాగే కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. గిర్ ఆవు పాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందువల్ల తమ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలని భావిస్తున్న వారికి గిర్ ఆవు పాలు బాగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఈ గిర్ ఆవు పాలలో అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. గిర్ ఆవు పాలలో కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA)తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి ఇవి మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. అంతేకాకుండా 

గిర్ ఆవు పాలు ఇతర ఆవుల పాల కంటే సులభంగా జీర్ణమవుతాయి. లాక్టోస్ అంటే పడని  చాలా మంది వ్యక్తులు కూడా గిర్ ఆవు పాలను ఎటువంటి సమస్య లేకుండా తాగుతారు. గిర్ ఆవు పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది గుండె జబ్బులు మరియు ఇతర హృదయ సంబంధ ఇబ్బందులతో బాధపడేవారు కూడా గిర్ ఆవు పాలను తాగవచ్చు. గిర్ ఆవు పాలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలలు కూడా కలిగి ఉంటాయి. గిర్ ఆవు పాలలో లభించే విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. అందుకే గిర్ ఆవుల పాలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. 

ఈ కోర్సు ద్వారా అనేక నైపుణ్యాలు అలవరుచుకుంటాం…

బాహ్య శరీర ఆకృతిని అనుసరించి గిర్ ఆవులను ఎలా గుర్తించాలనే విషయం ఈ కోర్సు మనకు నేర్పుతుంది. అదే విధంగా గిర్ జాతి ఆవుల డెయిరీ ఫామ్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడి ఎంత ఉండాలో ఈ కోర్సు ద్వారా ఒక స్పష్టత వస్తుంది. డెయిరీ ఏర్పాటు, పశువుల కొనే సమంలో ప్రభుత్వం నుంచి సబ్సిడీని ఎలా అందుకోవాలో తెలుస్తుంది. గిర్ ఆవులకు అందించే ఆహార నాణ్యత పై అవి ఇచ్చే పాల దిగుబడి ఆదారపడి ఉంటుంది. అందువల్లే గిర్ జాతి ఆవులకు ఏ సమయంలో ఎంత ఆహారం ఇవ్వాలన్న విషయం కూడా ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం. ఈ కోర్సు గిర్ ఆవుల జీవిత చక్రమం పై ప్రాథమిక అవగాహన కల్పిస్తుంది. దీని వల్ల గిర్ జాతి దూడలు ఎన్ని నెలల్లో ఎదకు వస్తాయి? ఒక ఆవు తన జీవిత కాలంలో ఎన్ని దూడలను అందిస్తుంది తదితర విషయాల పై మనకు స్పష్టత వస్తుంది. దీనివల్ల గిర్ ఆవుల పెంపకం వల్ల అందే ఆర్థిక ప్రయోజనం పై అవగాహన పెరుగుుతంది. గిర్ ఆవులకు వచ్చే వ్యాధులు, నివారణ, వాక్సీన్ తదితర విషయాలకు సంబంధించిన విషయాలన్నింటినీ ఈ కోర్సు ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాగా, పాడి, పశుపోషణకు సంబంధించిన అనేక కోర్సుల కోసం మీరు ffreedom App ను సందర్శించవచ్చు. 

ఎవరు గిర్ ఆవుల డెయిరీ నిర్వహించవచ్చు

గిర్ ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలనే ఆక్తి ఉన్న ఔత్సాహిక పాడి రైతులు ఎవరైనా ఈ వ్యాపారం నిర్వహించవచ్చు. ఒక్కరుగా, కొంతమంది కలిసి లేదా రైతులు సహకార సంఘంగా ఏర్పడి గిర్ ఆవుల డెయిరీ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. అయితే గిర్ ఆవులు మరియు పాడి పరిశ్రమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు వనరులను కలిగి ఉండటం చాలా అవసరం. అదేవిధంగా సమీకృత విధానం ద్వారా సాగుతో పాటు పాడి పరిశ్రమను నిర్వహించాలనుకుంటున్నవారు ఈ గిర్ ఆవుల డెయిరీ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. 

వ్యవసాయ, పాడి, పశుపోషణకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!