“చదువుకు సంపాదనకు సంబంధం లేదు. అయితే సాగులో కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన మాత్రం ఉండాలి. అప్పుడే మంచి సంపాదన నల్లేరు మీద నడక అవుతుంది.” అని సూర్యపేటకు చెందిన రామమూర్తి చెబుతున్నారు. ఇంతటి ఆత్మ విశ్వాసం తనలో పెరగడానికి కారణం ఎవరో? ఈ స్ఫూర్తిదాయక కథనం ద్వారా తెలుసుకుందాం రండి.
రోజు మొత్తం కష్టపడినా…
సూర్యపేటకు చెందిన బరాజు రామమూర్తికి 5 ఎకరాల పొలం ఉంది. ఇందులో సంప్రదయా విధానంలో వరిని పండించేవారు. ఇక మేకలు, గొర్రెలను కూడా సంప్రదాయ విధానంలో పెంచేవారు. అంటే ఉదయం వాటిని మేతకు బయటకు తీసుకువెళితే తిరిగి రాత్రికి గాని వాటిని ఇంటికి తీసుకురావడానికి వీలుపడేది కాదు. అంటే రోజు మొత్తం బీడు భూముల్లో మేకలు, గొర్రెల వెంట తిరగాల్సి వచ్చేది. దీంతో అటు రామమూర్తి తీవ్రంగా అలసిపోయేవాడు. అంతేకాక సరైన పోషణ లేక మేకలు, గొర్రెల ఎదుగుదల కూడా సరిగా ఉండేది కాదు. దీంతో మార్కెట్‌లో తక్కువ ధరకే వాటిని అమ్ముకోవాల్సి వచ్చేది. మొత్తంగా అటు వరి పంట, ఇటు మేకలు, గొర్రల వల్ల ఏడాదికి లక్షరుపాయల సంపాదన మాత్రం దక్కేది. ఒక్కొక్కసారి అది కూడా దక్కేది కాదు.
సమీకృత సాగు విధానం తో…
అయితే రామ మూర్తి ఎప్పుడూ ఈ వ్యవసాయం ద్వారానే మంచి సంపాదనపరుడుగా పేరు తెచ్చుకోవాలని భావించేవాడు. ఈ క్రమంలో అతనికి ffreedom App గురించి తెలిసింది. వెంటనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వివిధ వ్యవసాయ కోర్సులను చూసారు. అందులో సమీకృత సాగు విధానం ద్వారా అధిక ఫలసాయం పొందవచ్చునని అర్థం చేసుకున్నారు. దీంతో మొదట తనకు ఉన్న 5 ఎకరాల్లో అర ఎకరాలో సమీకృత సాగు విధానంలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అర ఎకరాలో వివిధ రకాల కాయగూరలు, ఆకు కూరలు పండిస్తున్నారు. వీటిని స్థానిక మార్కెట్‌లో అమ్మూతూ రోజూ కొంత సంపాదన కళ్లచూస్తున్నాడు. అదేవిధంగా మేకలు, గొర్రెలను పొలం వద్దే ప్రత్యేక షెడ్డులో పెంచుతున్నారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గింది. అంతేకాకుండా నాణ్యమైన ఆహారం ఇవ్వడం వల్ల అవి బాగా పెరుగుతూ మంచి ధరకు అమ్ముడు పోతున్నాయి. ఇలా మేకలు, గొర్రెలను పెంచుతూ ప్రతి వారం డబ్బులు సంపాదిస్తున్నారు. మొత్తంగా నెలకు సమీకృత సాగు విధానం వల్ల రూ.50 వేలను సంపాదిస్తూ ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై రామ మూర్తి ffreedom App ప్రతినిధితో మాట్లాడుతూ…సంప్రదాయ విధనంలో వరి సాగు చేయడం వల్ల ఏడాది సంపాదన కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. అయితే సమీకృత సాగు తో అర ఎకరాతోనే నెలకు రూ.50 వేలకు పైగా సంపాదిస్తున్నాను. త్వరలో 5 ఎకరాల్లోనూ సమీకృత వ్యవసాయ విధానంలోనే పంటలు పండించబోతున్నాను.” అని పేర్కొన్నారు.