Home » Latest Stories » వ్యవసాయం » సమీకృత సాగు విధానాలు…ప్రతి రోజూ సొమ్ముల గల గలలకు ప్రతీకలు

సమీకృత సాగు విధానాలు…ప్రతి రోజూ సొమ్ముల గల గలలకు ప్రతీకలు

by Sajjendra Kishore
1.2K views

సమీకృత వ్యవసాయం లేదా సమగ్ర వ్యవసాయం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక రకమైన వ్యవసాయం. దీనిని పాలీ కల్చర్ అని కూడా అంటారు.  ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంలో  ఒకే ఉత్పత్తి వ్యవస్థలో పంటలు, పశువులు మరియు చేపల వంటి బహుళ భాగాల ఏకీకరణ వలన సాధ్యమవుతుంది. వ్యవసాయానికి సంబంధించిన ఈ విధానం పొలంలోని వివిధ భాగాలు, సాగు విధానంలోని వివిధ పద్దతుల మధ్య సహాయ, సహకారాల వల్ల సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈ సమీకృత వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యం సాగు, పశుపోషణ, చేపల ఉత్పత్తి, పౌల్ట్రీ తదితర ఉత్పాదకతను పెంచడమే కాకుండా ప్రతి రోజూ వీటి వల్ల సంపాదించడం. అంటే ఆర్థిక స్థిరత్వం, ఉత్పాదక పెంపు సమీకృత వ్యవసాయ విధానం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు. ఈ సమీకృత వ్యవసాయ విధానాన్ని ffreedom App లోని ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు ఔత్సాహిక రైతులు తమ సొంత భూమిలో ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని అందించడంలో సహాయపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పంటల సాగు, పశుపోషణ మరియు చేపల పెంపకం వంటి అనేక రకాలైన వ్యవసాయాల విభాగాలను ఒక వ్యవస్థగా మిళితం చేసే ఒక రకమైన వ్యవసాయం. ఈ రకమైన వ్యవసాయం భూమి, శ్రమ మరియు వనరుల వినియోగాన్ని పెంచడంతో పాటు మరియు వ్యవసాయ వ్యవస్థ యొక్క స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఒకే చోట సాగు, పశుపోషణ

సమీకృత వ్యవసాయ విధానంలో విభిన్న రకాల పంటలను పండించడం మరియు అనేక రకాల జంతువులను పెంచడం ద్వారా, రైతులు వివిధ వనరుల నుండి ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. దీని వల్ల సంప్రదాయ వ్యవసాయ విధానం మాదిరి ఒకటే వ్యవసాయ ఉత్పత్తి పై ఆధారపడి ఆమేరకు నష్టపోవడాన్ని తగ్గించవచ్చు.  అంటే వాతావరణం లేదా చీడపీడల కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఈ సమీకృత వ్యవసాయ విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రైతు వాతావరణ మార్పుల వల్ల ఒకటి లేదా రెండు రకాల పంటలను నష్టపోయినప్పటికీ మిగిలిన రకాల పంటలు, పశుపోషణ, చేపల పెంపకం తదితర వాటి వల్ల ఆదాయం పొందడానికి వీలవుతుంది. మరోవైపు ఒక విభాగంలోని ప్రధాన ఉత్తత్పి కారకాలు మరో విభాగానాకి పరోక్షంగా సహాయపడుతాయి. ఉదాహరణకు తేనెటీగల పెంపకం. సమీకృత వ్యవసాయంలో తేనెటీగల పెంపకం లేదా ఏపికల్చర్ కూడా ఉంటుంది. తేనెటీగలు అనేక పంటలకు ముఖ్యమైన పరాగ సంపర్కాలు, మరియు వాటి తేనె మరియు ఆ తేనెపట్టులోని  మైనం వల్ల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వ్యవసాయ వ్యవస్థలో తేనెటీగలను ఏకీకృతం చేయడం ద్వారా, రైతులు తమ పంటల దిగుబడి మరియు వైవిధ్యాన్ని పెంచుకోవచ్చు, అలాగే తేనెటీగల నుండి విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు. అంటే సమీకృత వ్యవసాయం వ్యవసాయ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. 

ఒక విభాగం వ్యర్థం..మరో విభాగానికి ఎరువు

సమీకృత వ్యవసాయ విధానంలో ఒక విభాగం ద్వారా ఉత్పత్తి కాబడిన వ్యర్థాలను మరొకదానికి వనరుగా ఉపయోగించడం ద్వారా రైతులు అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని తగ్గించడానికి వీలవుతుంది. ఉదాహరణకు, కోళ్లు మరియు పందులను పెంచే రైతు వాటి వ్యర్థాలను సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని ఇతర పంటలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. దీని వల్ల పంటలకు సహజ ఎరువులను అందించినట్లవుతుంది. అంతేకాకుండా రసాయన ఎరువుల కొనుగోలుకు అయ్యే ఖర్చును తగ్గించవచ్చు. ఈమేరకు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మరోవైపు రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల మృత్తిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసినట్లవుతుంది. సమీకృత వ్యవసాయం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది భూమి, నీరు మరియు శ్రమ వంటి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. వ్యవసాయం యొక్క బహుళ రూపాలను కలపడం ద్వారా, రైతులు తమ భూమి మరియు వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మరియు వారి ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవచ్చు.

స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి

సమీకృత వ్యవసాయం స్థానిక సమాజంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. విభిన్న రకాల ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడం ద్వారా, రైతులు ఆహార భద్రతను మెరుగుపరచడంలో మరియు దిగుమతి చేసుకునే ఆహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఇంటిగ్రేటెడ్ ఫామ్‌ ఉపాధి అవకాశాలను స్థానికంగానే అందించగలవు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తాయి. అంటే సమీకృత వ్యవసాయ విధానం అన్నది ఒక్క సాగుకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ సమీకృత వ్యవసాయ విధానం అన్నది వ్యవసాయ, పశుపోషణ, చేపల పెంకానికి సంబంధించిన విధానాలను తెలియచేయచేస్తుంది. ఒక వ్యవసాయ క్షేత్రంలోని వివిధ విభాగాలను ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. అంటే మైక్రోమేనేజ్మెంట్ పై అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా వేర్వేరు సమయంలో చేతికి అందే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి సొమ్ములు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అంటే మార్కెటింగ్ నైపుణ్యాలు కూడా ఈ సమీకృత వ్యవసాయ విధానాల వల్ల తెలుస్తాయి.  అంతేకాకుండా బడ్జెట్ తయారీ, రికార్డ్ కీపింగ్ మరియు ఫైనాన్సింగ్‌తో సహా వ్యవసాయాన్ని నడపడంలో ఆర్థిక మరియు వ్యాపార అంశాల గురించి కూడా ఈ సమీకృత వ్యవసాయ విధానాల వల్ల తెలుసుకోవచ్చు.

సమీకృత వ్యవసాయ కోర్స్ ఆచరాత్మకం, ప్రయోగాత్మకం

అనేక సమీకృత వ్యవసాయ కోర్సులు ప్రయోగాత్మకంగా ఉంటాయి మరియు పని చేసే వ్యవసాయ క్షేత్రంలో ఆచరణాత్మక శిక్షణను కలిగి ఉంటాయి. ఇవి సమీకృత వ్యవసాయంలోని విభిన్న భాగాలతో విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తాయి. అనుభవజ్ఞులైన రైతుల నుండి నేర్చుకోవడానికి మరియు ఆచరణలో వివిధ పద్ధతులు మరియు వ్యూహాలు ఎలా పని చేస్తాయో చూసి నేర్చుకోవడానికి ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రం ఒక మంచి సాధనం అని స్పష్టమవుతోంది. చిన్న వర్క్‌షాప్‌ల నుండి సర్టిఫికేట్ లేదా డిగ్రీ ప్రోగ్రామ్‌ల వరకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సులను అందించే అనేక పాఠశాలలు మరియు సంస్థలు భారత దేశంలో ఉన్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ విధానంలో కూడా ffreedom Appసమీకృత వ్యవసాయ విధానం పై కోర్సును అందిస్తోంది.  కొన్ని కోర్సులు వ్యవసాయ అనుభవం లేని వ్యక్తుల కోసం రూపొందించబడ్డాయి, మరికొన్ని అనుభవజ్ఞులైన రైతుల కోసం వారి నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని విస్తరించేందుకు ఉద్దేశించబడ్డాయి. మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సులో చేరాలనుకుంటూ ఉంటే మీరు మొదట మీ అవసరాలు మరియు లక్ష్యాలకు సరిపోయే ప్రోగ్రామ్‌ను కనుగొనడం చాలా ముఖ్యం. అనుభవజ్ఞులైన రైతులు బోధించే మరియు ప్రయోగాత్మక శిక్షణ మరియు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే కోర్సుల వల్ల మీ లక్ష్యాల పై స్పష్టత వస్తుంది. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!