“ఏ వయస్సులో ప్రారంభించామన్నది కాదు. ఎలా ఎదుగుతున్నామన్నది ముఖ్యం “ ఈ వాఖ్యానం మన హైదరాబాద్‌కు చెందిన జయలక్ష్మి వ్యాపార జీవితానికి అతికినట్టు సరిపోతుంది.
56 ఏళ్ల వయస్సులో
హైదరాబాద్‌కు చెందిన జయలక్ష్మీకి 56 సంవత్సరాలు. ఆమెకు కొన్ని నెలల క్రితం వరకూ కుటుంబ వ్యవహారాలతోనే కాలం గడిచిపోయేది. అయితే ప్రస్తుతం కొద్దిగా సమయం దొరకడంతో తన కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారు. అదే వ్యాపారవేత్తగా కావడం. మరో పదిమందికి ఉపాధి కల్పించడం. ఇలా తన కలను నిజం చేసుకునే దారి వెదుకుతున్న సమయంలోనే ffreedom App గురించి తెలిసింది. అందులో అందుబాటులో ఉన్న కోర్సులను నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు.
అన్ని యాప్ ద్వారానే నేర్చుకుని
యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పచ్చళ్ల తయారీతో పాటు అప్పడాల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, క్లౌండ్ కిచెన్ వంటి కోర్సులను నేర్చుకున్నారు. అటు పై ప్రస్తుతం తన పరిస్థితులకు సరిపోయే పచ్చళ్ల తయారీ విక్రయం పై దృష్టి సారించారు. పచ్చళ్ల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు. పరికరాల సేకరణ, డిమాండ్, మార్కెట్, వినియోగదారులు, జమా ఖర్చులు తదితర విషయాలన్నింటి పై పట్టు సాధించారు. అటు పై వ్యాపార నిర్వహణకు అవసరమైన అనుమతులు కూడా తెచ్చుకున్నారు.
అనుకున్న సమయం కంటే ముందుగానే లాభాలు
యాప్‌లోని కోర్సుల ద్వారా నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మొదట రూ.5వేలతో పచ్చళ్లు ( పికిల్ ) తయారు చేయడానికి అవసరమైన ముడిపదార్థాలను కొని వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది. మొదట కొద్దిమొత్తంలో తయారు చేసి తన స్నేహితులు, బంధువులు, పొరుగువారికి అమ్మేవారు. వారి నుంచి వచ్చిన సలహాలు, సూచనలతో మరింత రుచిగా పచ్చళ్లు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత 2 నుంచి 3 రోజుల లోపు పచ్చళ్లను వినియోగదారుల వద్దకు చేరుస్తోంది. జయలక్ష్మి తయారు చేసిన పచ్చళ్లకు మంచి పేరు రావడంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారం పుంజుకున్నది. దీంతో జయలక్ష్మి వ్యాపారం లాభాల బాట పట్టింది. ఈ ఉత్సాహంలోనే జయలక్ష్మి మరిన్ని బిజినెస్‌లను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయమై జయలక్ష్మి మన ఫ్రీడం యాప్ ప్రతినిధి మాట్లాడుతూ…” పనిలో ఉన్నప్పుడు నాకు వయస్సు గుర్తుకు రాదు. అందుకే ఎప్పుడు పని చేస్తూ ఉండాలనుకుంటా. పచ్చళ్ల వ్యాపారంలో నేను అనుకున్న లాభాలు అన్నకున్న సమయం కంటే ముందుగానే వచ్చాయి. అందుకే త్వరలో హెయిర్ ఆయిల్ బిజినెస్ తో పాటు మిల్లెట్స్ పౌడర్ తయారీ, పాపడ్ తయారీ వ్యాపారాలను కూడా ప్రారంభించబోతున్నాను.” అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు.