Home » Latest Stories » వ్యవసాయం » కడక్‌నాథ్ కోళ్లను పెంచుదాం…కళ్లుచెదరే లాభాలు అందుకుందాం

కడక్‌నాథ్ కోళ్లను పెంచుదాం…కళ్లుచెదరే లాభాలు అందుకుందాం

by Sajjendra Kishore
307 views

మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలచెందిన కోళ్ల జాతిలో ఒక రకం ఈ కడక్ నాథ్ కోళ్లు. కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారం. ఈ కోళ్ల మాంసం చూడటానికి చాలా నల్లగా ఉంటుంది. ముఖ్యంగా అధిక ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఈ కోళ్ల మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ పెరుగుతూ ఉంది. కడక్‌నాథ్ కోళ్ల ఫారమ్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు గరిష్టంగా రూ. 1000 పక్షులను పెంచడం ద్వారా ఆరు నెలల్లో 8 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే ఇందుకు సరైన శిక్షణ అవసరం. ఈ కథనంలో మేము కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి సంబంధించిన ప్రధాన విషయాలను తెలియజేస్తాం. ఇందులో కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి, దానికి అయ్యే ఖర్చులు మరియు విక్రయం, లాభ నష్టాలు తదితర విషయాలను ఉంటాయి. 

ఎలాంటి వాతారణంలోనైనా పెరుగుతాయి. 

కడక్ నాథ్ కోళ్లు మధ్యప్రదేశ్ కు చెందిన పక్షులు అయినా అవి ఏ ప్రాంతంలోనైనా పెరుగుతాయి. అంటే అవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా మనుగడ కొనసాగిస్తాయి. అయితే వాణిజ్య పరంగా ఈ కడక్ నాథ్ కోళ్లను పెంచే సమయంలో మాత్రం వీటికి సరైన వసతి సౌకర్యాన్ని కల్పించాలి. అంటే ఈ కడక్ నాథ్ కోళ్లను పెంచే షెడ్ కొంత విశాలంగా ఉంటూ స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండాలి. దీని వల్ల ఈ కోళ్ల వ్యర్థాల నుంచి పోగయ్యే అమ్మోనియా వల్ల కలిగే నష్టాలను నివారించడానికి వీలవుతుంది. అటు పై కడక్‌నాథ్ కోడి పిల్లలను నమ్మకమైన సరఫరాదారుడి నుంచి కొనుగోలు చేయాలి. సాధారణంగా కడక్‌నాథ్ కోడి పిల్లల ధర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కొనుగోలు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికే కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో అనుభవమున్న వారి నుంచి సలహాలు తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం ffreedom App అందించే ఈ కోర్సును నేర్చుకోవడం ఉత్తమమైన మార్గం. 

ఆరోగ్యం, ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం

కాగా, కడక్ నాథ్ కోడిపిల్లలను కొనుగోలు చేసిన తర్వాత మీ ప్రాంతానికి తీసుకురావడం పై ప్రత్యేక దృష్టి సారించాలి. దీని వల్ల కోడిపిల్లల రవాణాలో జరిగే నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కోడిపిల్లలు షెడ్‌కు చేరుకున్న తర్వాత వాటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం అవసరమైతే కొన్ని మందులు ఇచ్చేలా ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల తర్వాత వాటికి నాణ్యమైన ఆహారం అందించాలి. అంటే అధిక ప్రోటిన్ కలిగిన ఆహారం కోడి పిల్లలకు ఇవ్వాలి. దీని వల్ల అవి వేగంగా, ఆరోగ్యంగా పెరగుతాయి. ముఖ్యంగా కోడి పిల్లలకు అందించే నీరు స్వచ్ఛంగా ఉండేలా జాగ్రత్తపడాలలి. అటు పై కోడి పిల్లల షెడ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా కడక్‌నాథ్ కోడిపిల్లల పెంపకంలోని ప్రతిదశలోనూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పక్షులు వేగంగా పెరుగుతాయి. దీంతో అతి తక్కువ వ్యవధిలోనే వీటిని మార్కెటింగ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. 

ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు..

ఇక కోళ్లు బాగా ఎదిగిన తర్వాత వాటి గుడ్లను, మాంసాన్ని మార్కెట్ చేయవచ్చు. అయితే కడక్‌నాథ్ గుడ్లు మరియు మాంసానికి ఉన్న  ప్రత్యేక లక్షణాల కారణంగా ఈ రెండింటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటోంది. అందువల్ల ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులతో పోలిస్తే వీటిని అధిక ధరకు విక్రయించడానికి వీలవుతుంది.  ఉత్పత్తులను విక్రయించడానికి మీరు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానాలను కూడా వినియోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి వీలవుతుంది. ఆఫ్‌లైన్ విధానాలను పరిశీలిస్తే స్థానిక వారాంతాల్లోని మార్కెట్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం, డోర్ డెలివరీ తదితర విధానాలతో కడక్‌నాథ్ ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్లు, సోషియల్ మీడియా ద్వారా ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తూ విక్రయించడం ఆన్‌లైన్ విధానాల కిందికి వస్తుంది. కాగా, కడక్‌నాథ్ ఉత్పత్తులను విక్రయించే సమయంలో కడక్‌నాథ్ పిల్లలను సేకరించినప్పటి నుంచి విక్రయించడం వరకు అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని వీటి గుడ్లు, మాంసానికి ధరను నిర్ణయించాలి. తద్వారా ఎక్కువ లాభాలను అందుకోవడానికి వీలవుతుంది. మొత్తంమీద, కడక్‌నాథ్ కోళ్ల పెంపకం లాభదాయకమైన మరియు లాభదాయకమైన వ్యాపార వెంచర్‌ అని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందుకు కొంత సమయం, ఓపిక, పట్టుదల అవసరమవుతుంది. మొత్తంగా 1000 కడక్‌నాథ్ పక్షల నుంచి ఆరు నెలల్లో రూ.8 లక్షల ఆదాయాన్ని సంపాదించడానికి వీలవుతుంది. 

ఆరోగ్య ప్రయోజనాలు:

కడక్‌నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కడక్‌నాథ్ ప్రాంతానికి చెందినది. ఈ కడక్‌నాథ్ కోళ్ల గుడ్డు, మాంసం ప్రత్యేకమైన రుచి మరియు వాసన కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతే కాకుండా  కడక్‌నాథ్ గుడ్డు మరియు మాంసం అధిక పోషక విలువల కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. కడక్‌నాథ్ గుడ్డు యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి దానిలో అధికంగా ప్రోటీన్ ఉండటం. శరీరంలోని కణజాలాల పెరుగుదల, వాటి విధులను సక్రమంగా నిర్వహణకు ప్రోటీన్ అత్యంత ఆవశ్యకం. వివిధ శారీరక విధులకు అవసరమైన ఎంజైములు, హార్మోన్లు మరియు ఇతర అణువుల ఉత్పత్తికి కూడా ఇది అవసరం. కడక్‌నాథ్ గుడ్డులోని ప్రోటీన్ అధిక నాణ్యతతో కూడుకున్నదని మరియు శరీరానికి సులభంగా శోషించబడుతుందని చెబుతారు. అందువల్ల ఈ కడక్‌నాథ్ గుడ్డులోని ప్రోటీన్ అన్ని వయస్సుల వారికి సరిపోతుందని చెబుతారు. కడక్‌నాథ్ గుడ్డులో ప్రొటీన్‌తో పాటు విటమిన్లు మరియు మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది విటమిన్లు ఎ, బి మరియు డి, అలాగే ఐరన్, జింక్ మరియు సెలీనియం వంటి ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడతాయి.

కడక్‌నాథ్ గుడ్డులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని నమ్ముతారు, ఇది ఆర్థరైటిస్ లేదా ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్నందున, గుడ్డు హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనలను కాపాడుతాయి.  కడక్‌నాథ్ గుడ్డు వలె, కడక్‌నాథ్ మాంసంలో కూడా ప్రోటీన్‌లో అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్లు B మరియు D, అలాగే ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి. కడక్‌నాథ్ మాంసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని నమ్ముతారు, ఇది ఆర్థరైటిస్ లేదా ఆస్తమా వంటి పరిస్థితులతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్నందున ఇది హృదయ ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతారు.

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!