ఒకవైపు ప్రజల నాడీ చూసి, వారికి మందులిచ్చే వైద్యుడు. మరో వైపు, పొలంలో కష్టపడి వ్యవసాయం, చేస్తూ, మట్టి నుంచి బంగారం తీసే ఈ కాలం యువ నగిషీ. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును, డాక్టర్ అంటే కేవలం సూది, మందులు పట్టుకోవడమే కాదు, పొలంలో మొక్కలు కూడా నాటగలడు అని నిరూపించాడు, మన మెదక్ జిల్లా డాక్టరు, మన్నె సుధాకర్ గారు! వినడానికే, ఎంతో కొత్తగా ఉన్న వీరి కథను మరింత వివరంగా తెలుసుకుందామా?
29 ఏళ్ళ మెదక్ కుర్రాడి పరిచయం
మన్నె సుధాకర్, 29 ఏళ్ళ యువకుడు. వీరిది మెదక్ జిల్లా. వీరు, రూరల్ మెడికల్ ప్రాక్టీస్ (RMP) లో డిప్లొమా హోల్డర్. దాదాపు దశాబ్ద కాలంపైగా, వీరు వైద్య వృత్తిలో ఉంటూ, సొంత గ్రామానికి అమూల్యమైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. సుధాకర్ వైద్య వృత్తిలో ఎంతో నిబద్దతతో పని చేసినప్పటికీ, చిన్న వయసు నుంచి వీరి మనసులో, వ్యవసాయం పట్ల అమితమైన ప్రేమతో ఉండేవారు. సుధాకర్ “అటు వైద్యం చేస్తూ, ఇటు వ్యవసాయం చేయవచ్చా?” అని ఎంతో ఆలోచించారు. రెండింటిలో, వారి దారెటు?
వైద్యాన్ని విడలేను… సైద్యాన్ని విడకూడదు
రెండు వృత్తులపై ఉన్న ప్రేమ వారిని ఆలోచనలో పడేసింది. చివరగా, రెండు పడవలపై ప్రయాణం చేయాలి అని నిశ్చయించుకున్నారు. కానీ అనుకున్నంత సులభమేం కాదని, సుధాకర్ కి తెలుసు. పొలంలో పంటలు పండించాలి అంటే ఈజీ కాదు. అయితే, సరైన మార్గ దర్శకత్వం లేకపోతే మొదటికే మోసం వస్తుందని వారికి తెలుసు. అటువంటి సమయంలోనే, ffreedom app వారి తలుపు తట్టింది.
ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో లాభాలే లాభాలు
ఈ యాప్ నుంచి వ్యవసాయం కోర్సు ఎంచుకుని, కేవలం రూ. 20 వేల పెట్టుబడితో, సాగు ప్రారంభించి, మొక్కలు నాటారు. మూడు నెలలకు, వీటి ద్వారా 75 వేల రూపాయలు సంపాదించారు. దానితో వీరికి వ్యవసాయంపై, ffreedom app పై గురి కుదిరింది. ఖాళీ సమయాల్లో, ఈ యాప్ నుంచి అనేక కోర్సులను నేర్చుకోవడం ప్రారంభించారు. వారికి సమీకృత వ్యవసాయం వ్యాపార అవకాశాలు, లాభాల గురించి తెలుసుకున్న తర్వాత, ఈ సాగుకి మంచి భవిష్యత్ ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా, మెదక్ జిల్లాలో పదిహేను ఎకరాలు లీజుకి తీసుకుని సాగు చెయ్యడం ప్రారంభించారు.
వ్యవసాయం దైవ వరం!
ఈ యాప్ నుంచి సుధాకర్ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అందులో భాగంగా, ffreedom app ద్వారా సుధాకర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నారు. వ్యవసాయం అనేది భగవంతుడు ఇచ్చిన బహుమతి అని, మంచి ఆహారం ద్వారా మాత్రమే మంచి ఆరోగ్యం సాధ్యమని వారు అర్ధం చేసుకున్నారు. మెదక్ జిల్లాలో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని, బాస్మతి వరి, స్వీట్ కార్న్ మరియు పుచ్చకాయతో సహా వివిధ పంటలను పండించడం ప్రారంభించారు. ప్రస్తుతం 10 రకాల పంటలతో కూడిన వారి పొలంలో గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్న సుధాకర్ కృషి & అంకితభావం ఫలించాయి.
మిశ్రమ సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం
ffreedom app నుంచి సుధాకర్, మిశ్రమ వ్యవసాయం (అనేక పంటలను ఒకే చోట పండించడం), అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి వివరంగా తెలుసుకున్నారు. ఇది మోనో ఫార్మింగ్ (ఒకే పంట వేయడం) వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో వారికెంతో సహాయపడింది. టెక్నాలజీ సహాయంతో, అద్భుత లాభాలు పొందడం & మార్కెటింగ్ వంటి విషయాలపై ఎన్నో విషయాలు, యాప్ ద్వారా తెలుసుకున్నారు. ఇంకా ఈ ffreedom కోర్సుల ద్వారా, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసుకుని, సాగుని ప్రారంభించారు. మరొక ఉదాహరణ ఏమిటంటే, ఒకేసారి కాకుండా దశలవారీగా జొన్నలను ఎలా నాటి మంచి ఫలితాలను పొందారు.
నేను, నా కుటుంబం, నా సమాజం కల్తీ లేని ఆహరం తినాలి
“వ్యవసాయం దేవుడిచ్చిన వరం. సొంతగా సాగు చేయడం వల్ల ఫుడ్ సేఫ్టీ ఉంటుంది. తక్కువ రసాయనాలతో మనం తినే వాటిని పెంచుకోవడానికి వీలు అవుతుంది. నేను, నా కుటుంబం, నా చుట్టుపక్కల వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, ffreedom app తో ఇది సాధ్యపడింది” అని సుధాకర్ అన్నారు.
మొత్తం మీద మీద, నూతన వ్యవసాయ పద్దతుల ద్వారా, ఇటు ప్రజలకి మంచి ఆహరం అందించడంతో పాటు, అటు రైతులు మంచి లాభాలు పొందాలన్న ffreedom app లక్ష్యం, సుధాకర్‌కు వ్యవసాయం గురించి వారి పరిజ్ఞానాన్ని పెంచి, కొత్త పద్ధతులు, వ్యూహాలను అమలు చేసి, వ్యవసాయంలో గొప్ప సక్సెస్ వారి చేతికందించింది. మీరూ, ఈ రోజే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించండి.