రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం వల్ల ఆర్థికంగా లాభదాయకం అవుతుంది. ఈ క్రమంలో చాలా మంది వేర్వేరు ఆవు, గేదె జాతులకు చెందిన పశువులను పెంచుతుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు ముర్రా గేదెల పెంపకం చాలా బాగుంటుందని అటు రైతులతో పాటు నిపుణులు కూడా చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయంగా ముర్రా గేెదెల ను పెంచడం వల్ల ప్రతి ఏడాది రూ.12 లక్షలకు తక్కువ కాకుండా ఆదాయం అందుకోవచ్చు. అది ఎలాగో ఈ కథనం ద్వారా మీకు అర్థమవుతుంది.
ఎందుకు ముర్రా జాతి గేదెల పెంపకం లాభదాయకం
మిగిలిన జాతి గేదెలతో పోలిస్తే ముర్రా గేదెల పెంపకం ఎక్కువ లాభదాయకం అని ఈ రంగంలో చాలా ఏళ్ల అనుభవం ఉన్న ఎంతో మంది చెబుతున్నారు. ఇందుకు వారు ప్రధానంగా నాలుగు కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది ముర్రా గేదెల పాలలో కేలరీలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీంతో ముర్రా గేదెల పాలు పసిపిల్లలకు కూడా మంచివి. అందువల్లే ఈ ముర్రా జాతి గేదెల పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఇక ముర్రా జాతి గేదె దూడలు 40 నుంచి 50 నెలల్లోనే ఎదకు రావడం ఆర్థికంగా రైతుకు లాభదాయకం. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ముర్రా గేదెలు తమ జీవిత కాలంలో 16 నుంచి 18 దూడలకు జన్మనిస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ముర్రా గేదెలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని జీవించగలుగుతాయి. అందువల్ల కూడా రైతులు వీటి పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పాల పరిమాణంతో పాటు వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉన్న ముర్రా గేదెల పెంపకం అంటే ఎందుకు రైతులు ఆసక్తి చూపించరో మీరే చెప్పండి.
ముర్రా గేదెల పెంపకం విషయంలో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
ముర్రా గేదెల పెంపకం లాభదాయకం కావాలంటే మీరు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవి ముర్రా గేదెల ఇచ్చే పాల పరిమాణం వాటికి అందించే ఆహార నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ముర్రా గేదెలతో ఏర్పాటు చేసే పాల కేంద్రానికి ప్రభుత్వం నుంచి అనేక ప్రోత్సహాకాలు, సబ్సిడీలు అందుతాయి. అయితే ఇవి ఆయా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్ణయం పై ఆధారపడి ఉంటాయి. ముర్రా గేదెల వ్యాధి నిరోధకత ఎక్కువే అయినా టీకాలు మాత్రం వేయించాల్సి ఉంటుంది. వీటి గురించి ఫ్రీడం యాప్‌లో ఈ కోర్సులో మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ముర్రా గేదెల తో పాటు వివిధ పాడి పశువుల పెంపకానికి సంబంధించిన విషయాలు కూడా ffreedom App ద్వారా తెలుసుకోవచ్చు.