నందినికి మేకప్ అంటే మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఆమెను మేకప్ ఆర్టిస్ట్‌గా మార్చింది. క్రమంగా ఈ మేకప్ ఆర్టిస్ట్ అయిన నందిని మేకప్ స్టుడియో ఓనర్‌గా మారి లక్షల ఆదాయాన్ని అందుకుంటోంది. ఈమె విజయ ప్రస్థానం ఎంతోమంది గృహిణులకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఆమె కన్న కలలు పెళ్లితర్వాత నిజమయ్యాయి. ఈ విజయానికి దోహదం చేసింది ఓ యాప్ అన్న విషయం మీకు తెలుసా? అసలు ఆ యాప్ ఎలా పనిచేస్తోందో తెలుసుకుని మీరూ మీ మనసుకు నచ్చిన పనిచేస్తూ లక్షల ఆదాయాన్ని అందుకోవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కథనం చదివి మీ ప్రణాళికలు అమలు చేయండి.
చిన్నప్పటి కల … ffreedom app తో తీరింది ఇలా
బెంగళూరుకు చెందిన నందినికి చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తాను అందంగా తయారవ్వడమే కాకుండా తోటి వారిని కూడా అందంగా తయారు చేసేది. ఈ విషయంలో చిన్నపాటి శిక్షణ కూడా తీసుకుంది. అటు పై దీనినే తన కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నారు నందిని. అయితే అన్ని రోజులు మనవి కావు కదా? దీంతో కొన్ని రోజులు నందిని చాట్ సెంటర్‌లో పనిచేశారు. అయితే మేకప్ ఆర్టిస్ట్ కావాలన్న తన కోరికను మాత్రం వీడలేదు. ఈ క్రమంలోనే ఆమెకు ffreedom app గురించి తెలిసింది. వెంటనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న కోర్సుల ద్వారా మేకప్‌కు సంబంధించిన మెళుకువలన్నింటినీ నేర్చుకున్నారు.
స్టుడియోను రన్ చేస్తూ లక్షల ఆదాయాన్ని అందుకుంటూ..
మేకప్‌కు సంబంధించిన మెళుకువలను నేర్చుకున్న తర్వాత కొంత కాలం పాటు బ్యూటీషియన్‌గా పనిచేశారు. అటు పై సొంతంగా ఓ బ్యూటీ బొటిక్‌ను నడిపారు. అయితే ఇంతటితో ఆమె సంతృప్తి చెందలేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నారు. ఈ క్రమంలోనే మేకప్ స్టుడియోను స్థాపించి తాను నేర్చుకున్న విద్యను ఔత్సాహిక విద్యార్థులకు నేర్పించేవారు. ఇందుకుగాను కొంత రుసుమును వసూలు చేసేవారు. ఈ విధంగా స్టుడియోను రన్ చేస్తూ ప్రతి నెల దాదాపు లక్షరుపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఈవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే. మిగిలిన శని మరియు ఆదివారాల్లో తన వద్దకు వచ్చేవారి అందానికి మెరుగులు దిద్దుతూ అదనపు ఆదాయాన్ని అందుకుంటున్నారు. అంటే ప్రతి నెల ఈ మేకప్ స్టుడియో ద్వారా లక్ష రుపాయలకు పైగానే నందిని ఆదాయం అందుకుంటున్నారు. మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నందిని చేసిన ప్రయాణం గురించి ఈ విధంగా చెబుతోంది. “మేకప్ ఆర్టిస్టు కావాలనే నా కలను నిజం చేసింది ffreedom app. ఆ యాప్ అనేది లేకపోయిఉంటే నేను ఈ స్థితిలో ఉండేదానిని కాను. ఇక నావద్ద నేర్చుకున్నవారు సొంతంగా మేకప్ స్టుడియో రన్ చేస్తుండగా మిగిలినవారందరికీ ఏదో ఒక బ్యూటీ పార్లర్‌లో మంచి ఉద్యోగాలు దొరికాయి.” అని పేర్కొన్నారు.