Home » Latest Stories » వ్యవసాయం » రైతన్నా…  నీకు వందనం!

రైతన్నా…  నీకు వందనం!

by Rishitaraj
289 views

“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్” అన్నారు గురజాడ! మన దేశ ప్రజలను ఉద్దేశించి, ఆయన  చెప్పిన మాటలవి. ఈ మాటలు మన రైతన్నలకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే, భారత దేశంలోని మట్టి, రైతన్నల చెమటతో తడిచి, పులకించి పోతుంది. భూమాత వారి చెమటతో గంగా స్నానాలు చేసి, మనకు ఫలంగా పంటను ఇస్తూ ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, రైతులు వ్యవసాయాన్ని ఆపేస్తే… దాని వల్ల వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో? ప్రజలకు నాలుగు వేళ్ళు లోపలికి కూడా వెళ్లవు. ఆహార సంక్షోభంతో అల్లాడిపోతాం.  ఆ దుర్భర స్థితులను ఊహించుకుంటేనే, అమ్మో! భయంగా ఉంది కదూ!.రైతులు, మన దేశానికి వెన్నెముక వంటివారని అందరికీ తెలుసు. అలాంటి రైతన్నల కోసం ఒక రోజు ఉందని మీలో ఎంతమందికి తెలుసు? 

డిసెంబర్ 23- జాతీయ రైతు దినోత్సవం

ప్రతి దేశానికీ, ఒక ప్రత్యేక రోజునాడు, రైతుల దినోత్సవంగా వేడుకలు జరుపుతారు. మన దేశంలో డిసెంబర్ 23 తేదీన, జాతీయ రైతు దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటారు. ఆరోజు, భారతదేశ ఐదవ ప్రధానమంత్రి శ్రీ చౌదరీ చరణ్ సింగ్ పుట్టిన రోజు. ఆయన, ఈ దేశ ప్రజల కోసం ఎంతో చేశారు. జమిందారీ వ్యవస్థను రద్దు చెయ్యడంలో, సఫలం అయ్యారు. కౌలుదారీ చట్టం రూపొందించడంతో పాటుగా, రైతుల జీవితాలని మెరుగుపరచడం కోసం ఎంతగానో పాటుబడ్డారు. ఆయన చివరి రోజు వరకు ఆయన రైతు నాయకుడిగానే బ్రతికారు.  ఆయన 1989 సంవత్సరంలో, మే 29 న మరణించారు. ఆయన వ్యవసాయం కోసం చేసిన కృషికి, రైతులకి చేసిన  సేవలకి గానూ, మన ప్రభుత్వం, ఆయన జన్మదినోత్సవంను “కిసాన్ దివాస్” గా ప్రకటించింది. 

మట్టిని బంగారం చెయ్యగల నేర్పరి!

మనమందరం, మట్టిని మట్టిలాగే చూస్తాం. కానీ, రైతోక్కడే, మట్టిని మట్టిలా కాకుండా, బంగారంలా చూస్తాడు. అవును, రైతు మట్టి నించి బంగారం తీయ్యగల నేర్పరి. కాక మరేంటి? మనం తినే అన్నం, దుంపలు, కూరగాయలు, పాడి, పౌల్ట్రీ ఇవన్నీ మన జీవితానికి బంగారం వంటివి. కాదు కాదు, అంతకంటే ఎక్కువ. బంగారం లేకపోయినా బతకగలం కానీ, ఒక్క పూట పస్తులు ఉండడం కూడా చాలా కష్టం. ఎన్ని ఉన్నా, ఆకలి తీరని కడుపు వ్యర్ధమే కదా?

మా కడుపులు నింపే, నీ కన్నీరు తుడిచేదెలా?

దేశం ఆకలి తీరుస్తున్న రైతులు, రాజుగా బ్రతకాలి, రారాజుగా ఉండాలి. కానీ, రైతు స్థితి చూస్తుంటే, అలా లేదు. ఎంతో మంది రైతులు దీన స్థితిలో వారి జీవితాల్ని, గడుపుతున్నారు. వాటికి కారణాలెన్నో! అతి వృష్టి, అనావృష్టి లేదా గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివి ఏవైనా కావచ్చు. వారి జీవితాల్లో చీకటిని నింపుతున్నాయి. అప్పుల బాధలు తాళలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  వారి గుండెమంటలు ఆర్పేదెలా? వారి కన్నీరు తుడిచేదెలా?

ప్రభుత్వ చేయూత

కష్టాల్లో ఉన్న రైతులని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక సంస్కరణ కార్యక్రమాలు చేపట్టింది. రుణ మాఫీ, కిసాన్ క్రెడిట్ కార్డు, ఫసల్ బీమా వంటివి అందులో ముఖ్యమైనవి. ఇవి రైతుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తున్నాయి. అయితే, పూర్తి స్థాయిలో ఇవి వారి ఎదుగుదలకి తోడ్పడడం లేదు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మార్పు రావాల్సి ఉంది. వాటికి మరికొంత సమయం పెట్టె అవకాశం లేకపోలేదు. 

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి- నాగలి పట్టి!

ప్రస్తుత కాలంలో, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం మరియు సాంకేతికతను జోడించి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. పట్టణాల్లో యాంత్రిక జీవితాలు, ఉద్యోగాలను విడిచిపెట్టి పల్లెల్లో పచ్చని పైరు గాలిని పీలుస్తూ, చక్కగా సంపాదించుకున్న ఎంతో మంది జీవితాలు, రైతులుగా మారాలి మరియు వ్యవసాయం చెయ్యాలి అని అనుకున్నవారికి ఆదర్శదాయకం. 

మా కోసం ఆరుగాలం కృషి చేసే రైతులకి, ffreedom App సలాం!

ఋతువులతో సంబంధం లేకుండా, పగలనక, రాత్రనక కష్టించే రైతులు పూర్తి స్థాయిలో వారి శ్రమకి తగ్గ ఫలితాలను అనుభవించలేకపోతున్నారు. ఇటువంటి వారందరికీ, ఆర్థిక స్వతంత్రం కలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ffreedom App. ఎటువంటి పంటలు వెయ్యాలి, ఎలాంటి వ్యవసాయం విధానంలో సాగు చెయ్యాలి, అధిక దిగుబడిని పొందడం ఎలా, ఇలా రైతులకి కావాల్సిన ఎన్నో ఫార్మింగ్  కోర్సులను మా App లో పొందుపరిచాం. 

నెక్స్ట్ టైం, మీకు భవిష్యత్తులో ఏం చెయ్యాలో తోచనప్పుడు, మీ కెరీర్ గురించి ఆలోచించే 

సమయంలో, వ్యవసాయం గురించి కూడా ఆలోచిస్తారు కదూ! రైతుగా బ్రతడానికి గర్వపడే రోజు అతి త్వరలో వస్తుందని ఆకాంక్షిద్దాం!

మాకోసం చెమటోడ్చే రైతన్నా- నీకు మా సలాం!

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!