Home » Latest Stories » వ్యాపారం » నాన్ వెజ్ పికిల్స్… తింటే నోటికి రుచి అమ్మితే గళ్లాపెట్టెకు మంచిది

నాన్ వెజ్ పికిల్స్… తింటే నోటికి రుచి అమ్మితే గళ్లాపెట్టెకు మంచిది

by Sajjendra Kishore
617 views

పికిల్ దీనినే ఊరగాయ అని అంటారు. భారత దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశ ఆహార పదార్థం ఈ ఊరగాయ లేదా పికిల్. భోజనంలో ఊరగాయ లేదా పికిల్ లేదా ఆవకాయ లేనిదే ముద్ద కూడా తినని వారు ఎంతో మంది. మొదట్లో కేవలం గాయగూరలు, మామిడి వంటి పండ్లతో మాత్రమే తయారు చేసే పికిల్స్‌ మాత్రమే చాలా మంది తమ ఆహారంలో భాగంగా తీసుకునేవారు. అయితే కొంతకాలంగా నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా మంది తింటున్నారు. తింటున్నారు అనడం కంటే నాన్ వెజ్ పికిల్స్‌కు బానిసలయ్యారు అనడం సబబుగా ఉంటుందేమో.  అందువల్లే ఈ నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ రోజు రోజుకు పెరిగి పోతోంది. భారత దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసే నాన్ వెజ్ పికిల్స్‌ విదేశాల్లో కూడా ఎంతో మంది ప్రియులు ఉంటున్నారు. అందుకే ప్రతి రోజూ కొన్ని లక్షల రుపాయలు విలువ చేసే నాన్ వెజ్ పికిల్స్ వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక నాన్ వెజ్ పికిల్స్ అన్నవెంటనే మనకు గుర్తుకు వచ్చేది అతిథ్యానికి పేరెన్నికగన్న ఉభయగోదావరి జిల్లాలు. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం ఈ నాన్ వెజ్ పికిల్స్‌కు ఎంతో ప్రాచూర్యం చెందినది. ఈ ఒక్క భీమవరంలోనే రోజుకు కోట్ల రుపాయల విలువ చేసే నాన్ వెజ్ పికిల్స్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా వివిధ దేశాల్లోని తెలుగు వారు కూడా తెప్పించుకుంటున్నారు. దీని వల్ల నాన్ వెజ్ పికిల్స్‌కు ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ffreedom App లోని ఈ కోర్సు మీకు వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తాయి. ఇక ఈ కథనంలో నాన్ వెజ్ పికిల్స్‌కు సంబంధించిన A to Z విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మొదట అసలు నాన్ వెజ్ పికిల్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. 

నాన్ వెజ్ పికిల్ అంటే ఏమిటి?

పిక్లింగ్ అనేది వెనిగర్, ఉప్పునీరు లేదా మరొక రకమైన ఆమ్ల ద్రావణంలో ఆహారాన్ని నిల్వ చేయడం ద్వారా సంరక్షించే ప్రక్రియ. ఈ నేపథ్యంలో నాన్ వెజ్ పికిల్ లేదా నాన్ వెజ్ ఊరగాయ అనేది మాంసాన్ని ప్రధాన ఇన్ గ్రేడియంట్‌గా చేసుకుని తయారు చేసిన ఆహార పదార్థం. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి రకరకాల మాంసాలతో నాన్ వెజ్ పికిల్స్ లేదా ఊరగాయలను తయారు చేసుకోవచ్చు. అవి సాధారణంగా మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో  తయారు చేయబడుతాయి. ఈ నాన్-వెజ్ పికిల్స్  ఊరగాయలు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందాయి, ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలలో వీటిని తరచుగా సైడ్ డిష్ గా అందిస్తారు. వాటిని సొంతంగా ఆస్వాదించవచ్చు లేదా శాండ్‌విచ్‌లు, రోల్స్ మరియు సలాడ్‌లు వంటి ఇతర వంటలలో ఒక మూలవస్తువుగా ఉపయోగించవచ్చు.

నాన్ వెజ్ పికిల్ ఎలా తయారు చేస్తారు?

నాన్ వెజ్ ఊరగాయను తయారుచేసే ప్రక్రియ అనేక దశలను కలిగి ఉంటుంది:

మొదట, మాంసం శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తరువాత, మాంసం సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల మిశ్రమంలో మెరినేట్ చేయాల్సి ఉంటుంది. మాంసం రకం మరియు కావలసిన రుచి ప్రొఫైల్ ఆధారంగా మారినేట్ మారవచ్చు. అంటే ఎంతసేపు మారినేట్ చేయాలి? ఇందుకు ఇపయోగించాల్సిన దినుసులు ఏవి అన్న విషయాలు ఆదారపడి ఉంటాయి.  నాన్-వెజ్ ఊరగాయ మెరినేడ్‌లలో ఉపయోగించే కొన్ని సుగంధద్రవ్యాలు అంటే కారం పొడి, గరం మసాలా, కొత్తిమీర, జీలకర్ర మరియు పసుపు మొదలైనవి. నాన్ వెజ్ పికిల్ లేదా ఊరగాయ రుచిని పెంచడానికి మారినేట్ చేయబడిన మాంసాన్ని కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజుల పాటు అలా వదిలేయాల్సి ఉంటుంది.  మెరినేషన్ కాలం పూర్తయిన తర్వాత, మాంసం ఉడికినంత వరకు మీడియం స్థాయిలో పాన్ లేదా వొవెన్ లో వేడి చేయబడుతుంది. మాంసం ఉడికిన తర్వాత, దానిని వెనిగర్ లేదా మరొక ఆమ్ల ద్రావణంతో కలుపుతారు మరియు రుచులు కలిసిపోయేలా చేయడానికి మరికొన్ని గంటల పాటు ఈ మిశ్రమాన్ని అలా వదిలేస్తారు. చివరి దశ ఊరగాయను క్రిమిరహితం చేసిన జాడిలో ప్యాక్ చేసి వాటిని మూసివేయడం. ఊరగాయను చాలా నెలలు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ఎయిర్ ప్యాక్ క్యాన్‌లలో ఈ పికిల్స్‌ను నిల్వచేస్తారు. దీని వల్ల పికిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇటీవల కాలంలో కుందేలు మాంసం పికిల్స్ బాగా ప్రాచుర్యం చెందింది. అందుకే చాలా మంది ఈ పికిల్స్ తయారీ పరిశ్రమలకు అమ్మడానికి వీలుగా కుందేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 

నాన్-వెజ్ పికిల్స్ అనుమతులు… 

నాన్ వెజ్ ఊరగాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ప్రాంతంలోని సంబంధిత అధికారుల నుండి అనుమతి అవసరం. మొదట మీ ప్రాంతంలో ఆహార వ్యాపారాన్ని ప్రారంభించడానికి స్థానిక నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫుడ్ హ్యాండ్లర్ లైసెన్స్ పొందడం, స్థానిక అధికారులతో మీ వ్యాపారాన్ని నమోదు చేయడం మరియు ఏవైనా అవసరమైన అనుమతులు లేదా ఆమోదాలను పొందడం వంటివి ఉండవచ్చు. మీ నాన్-వెజ్ ఊరగాయలను సిద్ధం చేయడానికి వాణిజ్య వంటగదిని సెటప్ చేయండి లేదా లైసెన్స్ పొందిన వంటగదికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయండి. ఈ నాన్ వెజ్ వంటగది అవసరమైన ఆహార భద్రతా ప్రమాణాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. మీరు లక్ష్యంగా ఎంచుకున్న మార్కెట్, ధర మరియు మార్కెటింగ్ తదితర వివరాలతో వ్యాపార ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. నాన్‌వెజ్ వ్యాపారంలో ప్యాకింగ్ అన్నది ప్రధాన పాత్ర వహిస్తుంది. అందువల్ల ఈ ప్యాకింగ్‌లో భాగంగా  జాడి, లేబుల్స్ మరియు ఇతర ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి అవసరమైన పరికరాలు మరియు సామాగ్రిని సమకూర్చుకోవాలి. మీరు ఈ దశలను పూర్తి చేసిన తర్వాత, మీరు మీ వ్యాపార ప్రణాళికతో పాటు అవసరమైన పత్రాలన్నింటిని నాన్ వెజ్ పికిల్స్ వ్యాపార అనుమతి కోసం సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఫ్రీడం యాప్ అందించే ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది. 

నాన్ వెజ్ పికిల్స్…బిలియన్ల వ్యాపారం

నాన్-వెజ్ ఊరగాయ వ్యాపారం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు తమ భోజనంలో ఈ నాన్ వెజ్ పికిల్ ఉండేలా చూసుకుంటున్నారు.  ముఖ్యంగా భారతదేశంలో, ఈ మార్కెట్ ముఖ్యంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవలి డేటా ప్రకారం, ప్రపంచంలో నాన్ వెజ్ ఊరగాయల మార్కెట్ పరిమాణం కొన్ని బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ రకమైన ఊరగాయలకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున, రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచ నాన్ వెజ్ మార్కెట్‌లో అధిక వాట భారతదేశానిదే.  ఒక అంచనా ప్రకారం ఈ వ్యాపార పరిమాణం $7 బిలియన్ల నుండి $10 బిలియన్ల వరకు ఉంటాయి. ఇక భారత దేశంలో నాన్ వెజ్ వ్యాపారం రాష్ట్రాల వారిగా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాన్ వెజ్ పచ్చళ్ల మార్కెట్ పరిమాణం కూడా గణనీయంగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోని జనాభాలో ఎక్కువ మంది  తమ భోజనంలో ఊరగాయలను లేదా పికిల్స్‌ ఉండేలా చూసుకుంటున్నారు.  అందువల్ల ఇటీవల కాలంలో ఈ నాన్ వెజ్ పికిల్స్ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమవరం పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లోని 50 మంది దాకా ఈ నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నాన్ వెజ్ పికిల్స్ లేదా నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం కొన్ని వందల మందికి ఈ ఒక్క ప్రాంతంలోనే ఉపాధి కల్పిస్తోంది. ఇక భీమవరం వచ్చే నాన్ వెజ్ పికిల్స్ రుచి చూడకుండా వెనుతిరగరు అనడం అతిశయోక్తి కాదేమో? ఇక ఈ భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్ పచ్చళ్లు అమెరికా, ఆస్ట్రేలియ, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్ రష్యా వంటి దాదాపు 50 దేశాలకు వెళ్తుంటాయి. ఈ నాన్ వెజ్ పచ్చళ్లు ఆయా రకాన్ని బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకూ ఉన్నా చాలా మంది వీటిని ఎగబడి కొంటున్నారు. ఇక ఫిష్ పికిల్స్, రొయ్యల, చికెన్ పికిల్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఫిష్ పికిల్స్ విషయం తీసుకుంటే శీలవతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుళ్లు తదితర చేపల రకాల పికిల్స్ మనకు దొరుకుతాయి. అదేవిధంగా చికెన్ పికిల్స్ విషయం తీసుకుంటే బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ పికిల్స్‌లో ఎక్కువ మంది కొనుగోలు చేసే రొయ్యల పికిల్స్ లో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో చిన్న రొయ్య, పెద్ద రొయ్య వంటి పికిల్స్‌ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. అదేవిధంగా పీత, మటన్ బోన్, మటన్ బోన్‌లెస్, మటన్ ఖీమా వంటి వివిధ రకాల పచ్చళ్లు కూడా నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనవి. 

అంటే భారతదేశంలో చికెన్ మరియు మటన్ నుండి చేపలు మరియు పీత వరకు అనేక రకాల నాన్ వెజ్ ఊరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఊరగాయలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో అధిక శాతం నాన్ వెజ్ పికిల్స్ తయారీ ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మాంసాన్ని వెనిగర్‌‌లో కొద్ది కాలం పాటు నిల్వ ఉంచి తర్వాత తింటారు. 

అనేక విజయగాథలు..అందులో ఫ్రీడం యాప్ విజయ గాథ ఇక్కడ మీకోసం

కాగా, పచ్చళ్ల వ్యాపారంతో లక్షల రుపాయల ఆదాయం ఉన్నట్లు ఎంతో మంది చెబుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలోని గోపి పికిల్స్, తెలంగాణాలోని కరీంనగర్‌కు చెందిన శ్రీ వర్థన్. ఇందులోనూ శ్రీ వర్థన్ ఇతను పికిల్స్ బిజినెస్‌లో పెట్టుబడికి దాదాపు మూడు రెట్ల లాభాలను అందుకున్నారు. దీన్ని బట్టి నాన్ వెజ్ పికిల్స్‌కు ఉన్న మార్కెట్‌ గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రీ వర్థన్ సంబంధించిన విజయ గాథను ఇక్కడ పంచుకోవడం సబబుగా ఉంటుంది.  సరైన వ్యూహానికి తోడు కష్టపడే తత్వం ఉంటే విజయం నిన్ను వెదుక్కొంటూ వస్తుంది అన్న స్టేట్‌మెంట్ తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన శ్రీ వర్థన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే ఫ్రీడం యాప్ సహాయంతో అతను తాను పెట్టుబడి పెట్టిన మొత్తానికి పికిల్స్ వ్యాపారం ద్వారా మూడు రెట్ల ఆదాయం అందుకున్నారు. ఇందులో అధిక శాతం నాన్ వెజ్ పికిల్స్ ద్వారా వచ్చినవే. అందువల్లే ఇతను అడిగిన వెంటనే వ్యాపార చతురతకు మెచ్చి డిస్ట్రిక్ట్ రూరల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (DRDA) దాదాపు రూ.25,00,000 రుణంగా అందించడానికి ముందుకు రావడమే కాకుండా ఇతని పికిల్స్ తయారీ యూనిట్‌ను మైక్రో ఇండస్ట్రీగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో శ్రీ వర్థన్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇందుకు ప్రధాన కారణమైన ffreedom App కు ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా, శ్రీ వర్థన్ వ్యాపార ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం కూడా అందువల్ల ఆయన వ్యాపార ప్రయాణాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

డిగ్రీ చదివిన కరీనగర్‌కు చెందిన యువకుడు

శ్రీ వర్థన్ సొంత నగరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్. అతను బీకాం చదవివారు. అటు పై కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు. అయినా కూడా జీవితంలో ఏదో అసంతృప్తి. ఇంత చదివి ఎవరి కోసమో పనిచేయడంలో అర్థం లేదనుకున్నారు. దీని నుంచి బయటపడటానికి తానే ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించారు. దీని వల్ల తన అసంతృప్తి తొలిగిపోవడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించవచ్చునని భావించారు. ఈ క్రమంలో ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి? ఎక్కడ ప్రారంభించాలి అనే విషయాలను తెలుసుకోవడం కోసం అనేక మార్గాల్లో  ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతనికి ffreedom App గురించి ఓ ఫ్రెండ్ ద్వారా తెలిసింది.  వెంటనే ఈ ఫ్రీడం యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న వ్యాపార, వ్యవసాయ సంబంధించిన అనేక కోర్సులను చూశారు. ఇందులో వెన్, నాన్ వెజ్ పికిల్స్ తయారీ బిజినెస్ కోర్స్ పట్ల శ్రీ వర్థన్ బాగా ఆకర్షితులయ్యారు. ఈ కోర్సులో చేరి అనేక విషయాలను తెలుసుకున్నాడు. వీటితో పాటు అనేక కోర్సులను చూసినా పెద్దగా వాటి పై ఆసక్తి ప్రదర్శించలేకపోయాడు. తన మనస్థత్వంతో పాటు ఇంటి వద్ద ఉన్న పరిస్థితులకు సరిపోయే పచ్చళ్ల లేదా పికిల్స్ తయారీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అటు పై ఫ్రీడం యాప్ ద్వారా వెజ్ పికిల్స్ మరియు నాన్ వెజ్ పికిల్స్ వ్యాపార ప్రారంభానికి అవసరమైన పెట్టుబడి ఎంత? ఎక్కడ నుంచి అనుమతులు తీసుకోవాలి? రిజిస్ట్రేషన్ ఎలా అన్న విషయాల పై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. అటు పై ఏ సమయంలో ఏ ఏ పచ్చళ్లు తయారు చేయాలి? వాటిని ఎటువంటి మార్కెట్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి? మొదలైన విషయాల పై స్పష్టత తెచ్చుకున్నారు. అంతే కాకుండా మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ మెళకువలను నేర్చుకున్నారు. ముఖ్యంగా స్థానిక తెలంగాణ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులకు ధరలు ఎలా నిర్ణయించాలో తెలుసుకున్నాడు.  

ఫిష్ పికిల్ మరియు ఎగ్ పికిల్ ‌తో ఎక్కువ సంపాదన 

శ్రీ వర్థన్ ప్రీడమ్ యాప్ ద్వారా తెలుసుకున్న, నేర్చుకున్న అన్ని విషయాలను స్థానికంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం నేర్చుకున్నాడు. ముఖ్యంగా తయారీలో అంటే అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ పికిల్స్ తయారీలో మెళుకువలను సంపాదించారు. వీటిలో కూడా నాన్ వెజ్ పికిల్స్ పై పట్టు సాధించాడు. అటు పై అన్ని రకాల పికిల్స్ తయారీ చేసి అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులో ఎగ్ పికిల్, ఫిష్ పికిల్ అధికంగా అమ్మడు పోతున్నట్లు ఆయన గుర్తించారు. దీంతో రూ.5,000 పెట్టుబడితో ఈ రెండు పికిల్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. కేవలం మూడంటే మూడు రోజుల్లో శ్రీ వర్థన్ తయారు చేసిన పికిల్స్ లేదా పచ్చళ్లు అమ్ముడు పోయి రూ.45 వేలు చేతికి అందాయి. ముందుగానే చెప్పినట్లు ఇందులో అధిక శాతం ఎగ్ పికిల్ మరియు ఫిష్ పికిల్స్ తయారీ, అమ్మకం వల్ల వచ్చినవే. దీంతో శ్రీ వర్థన్ రెట్టించిన ఉత్సాహంతో పచ్చళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో స్థానిక డిస్ట్రిక్ట్ రూరల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (DRDA) ప్రభుత్వ అధికారులతో కలిసి తన ఆలోచనలు పంచుకున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇతని ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను క్షుణంగా పరిశీలించి శ్రీ వర్థన్ కు రూ.25 లక్షలను అప్పుగా అందించడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా శ్రీ వర్థన్ పచ్చళ్ల తయారీని ఓ మైక్రో ఇండస్ట్రీ స్థాయిలో మెుదలు పెట్టడానికి అవసరమైన సహకారాలు కూడా అందిస్తున్నారు. ఈ విషయమై శ్రీ వర్థన్ మాట్లాడుతూ వ్యాపారాన్ని ప్రారంభించి పదిమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్న నాకు చేయూతను ఇచ్చింది ffreedom App. ఈమేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతేకాకుండా ఇప్పటికీ నేను పచ్చళ్ల తయారీకి సంబంధించిన సందేహాలకు సమాధానాలను ఈ యాప్ ద్వారానే పొందుతున్నాను అని పేర్కొన్నారు. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!