“కష్టాలు మన మీదకి రాళ్ళలా వచ్చి పడుతుంటే, దానితోనే మెట్లు కట్టుకుని పైకి ఎదగమంటాడు”, ఓ కవి!
అమృతకి ఈ మాటలు సరిగ్గా వరిస్తాయి. కోవిడ్ మహమ్మారి మన జీవితాలను అతలాకుతలం ఎలా చేసిందో, మీ అందరికి తెలుసు. అమృత, అలాంటి కష్టాల నుంచి బయటపడి, సొంతంగా బిజినెస్ చేస్తూ, ఇప్పుడు ఎలా ఆర్థికంగా స్థిరపడిందో తెలుసుకోవాలంటే, స్టోరీలోకి ఒక లుక్ వెయ్యండి!!!
సోషల్ మీడియా నుంచి స్టాక్ దాకా !
అమృత కర్ణాటకలోకి జడగొండనహళ్ళి అనే కుగ్రామం నుంచి వచ్చింది. ఈమె తండ్రి సాధారణ వేరుశెనగ రైతు. తను డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఫ్రీలాన్సర్ గా చేస్తూ ఉండేది. కరోనా వచ్చి దేశాలను ఆర్థికంగా కుదిపేసిన తర్వాత, ఎంతో మంది ఉద్యోగాలను, జీవనాధారాలను కోల్పోయారు. ఆ సమయంలో, అమృత వర్క్ కూడా, ఏ మాత్రం సాఫీగా సాగలేదు.
సంపాదన అంతా పూర్తిగా పడిపోయిన సమయంలో, ఆమె ఒకరోజు ffreedom app గురించి తెలుసుకొని, అందులో స్టాక్ మార్కెట్ కోర్సును నేర్చుకోవడం ప్రారంభించింది. ffreedom లో వాటి గురించి పూర్తిగా నేర్చుకుని, స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం, ద్వారా 35-40% వరకు లాభాలను పొందింది.
ఇంకో పెట్టు పైకి ఎదుగుతూ…
అమృత కు, ఆ లాభాలతో ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే, భవిషత్తు బాగుంటుందని అనిపించింది. తండ్రి వేరుశెనగ పొలం కావడంతో, ఆయిల్ బిజినెస్ అయితే బాగుంటుందని అనుకుంది. కానీ, ఆమెకు ఆర్థిక లావాదేవీల గురించి ఆవగింజైన తెలియదు! అందుకే, ffreedom ను ఆశ్రయించి, oil బిజినెస్ గురించి అన్ని మెళకువలు నేర్చుకుంది.
సొంతంగా ఆయిల్ మిల్ పెట్టుకుని, రోజుకి కొద్దీ మొత్తంలో నూనె తీస్తూ ఉండేవారు. ఆమె తండ్రి పండించిన వేరుశెనగలనే ఆమె ముడిసరుకుగా వాడుకుని, నూనెను తీసి, పక్కన ఉండే రైతులకి, బంధువులకి అమ్మడం ప్రారంభించింది. కొద్దీ కాలంలోనే, ఆ చుట్టూ పక్కల అమృత ఆయిల్ మిల్ అంటే, తెలియని వారు లేరన్నంత ప్రాచుర్యం పొందింది.
ఆ app ద్వారా ఆయిల్ తీయ్యడంలో మెలకువలతో పాటు, ఆయిల్ మెషిన్ ఎలా వాడాలి? ఏది మంచిది? నూనె వడపోత, పాకేజింగ్, ట్రాన్స్ పోర్ట్ విధానం, మార్కెటింగ్ మెళకువలు వంటి పూర్తిగా తెలుసుకుంది.
ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు?
చిన్నగా ప్రారంభించిన ఆమె వ్యాపారం, మెల్లగా పుంజుకుని బిజినెస్ ను విస్తృతపరిచే ఆమె ఆలోచిస్తున్నారు. ఇప్పడికే ఒక షాప్ కు అద్దెకు తీసుకుని, అందులోకి, రెండు ఆయిల్ మెషిన్లు కొన్నారు. అందులో, ప్రభుత్వం ఒక మెషిన్ కి రాయితీని కలిపించింది.
PMFME పథకం కింద ఎనిమిది లక్షల లోను, తీసుకుని షాపుని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి నూనె, వేరుసెనగ నూనెలతో, విజయవంతంగా నడుస్తూ ఉంది.
Ffreedom app సంస్థాపకుడు సుదీర్ గారికి పెద్ద ఫ్యాన్!
గొప్ప ఆలోచనతో ffreedom app కంపెనీ ని నెలకొల్పిన సుధీర్ అంటే, స్వతహాగా, అమృతకి ఎనలేని అభిమానం. సుధీర్ గారి వద్దనుంచి, ఆమె ఆర్థికంగా ఎన్నో మెళకువలు నేర్చుకోవడంతో పాటు, ఆరోగ్య బీమా అవసరాన్ని తెలుసుకుని, ఒక పాలసీ కూడా తీసుకున్నారు.
చిన్న స్థాయిని నుంచి వచ్చి, సొంతంగా బిజినెస్ పెట్టుకున్నారు కదా, అని ఆమెతో ఎవరైనా అంటే, ఆమె జీవితంలోకి వెలుగులా ప్రవేశించి, తనను ఆర్థికంగా నిలదొక్కుకునేట్టు చేసింది, ffreedom app ఏ, అంటూ నవ్వుతూ చెప్తారు, మా అమృత!
అమృతలా మీరు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, సొంతంగా బిజినెస్ చేసి, ఇంకొకరికి ఉపాధి కలిగించే స్థాయికి ఎదగాలి అని అనుకుంటున్నా , లేక , స్టాక్ మార్కెట్, ఆయిల్ గానుగ బిజినెస్ పై ఆసక్తి ఉన్నా, ఈ కోర్సులు అన్ని ffreedom app లో లభిస్తాయి.