మంచి రుచితో పాటు ఎక్కువ పోషక విలువలు ఉన్న మామిడి ఫలాలకు రాజు వంటిది. సేంద్రియ విధానంలో మామిడి పండిస్తే ఆ రుచి మరింతగా పెరుగుతుంది. అంతే కాకుండా పెట్టుబడి కూడా తగ్గుతుంది. అందువల్లే ఇటీవల కాలంలో మామిడిని చాలా మంది సేంద్రియ విధానంలో పండించడానికి ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు మామిడి రసం, మామిడి తాండ్ర వంటి ఉప ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. అందువల్లే సేంద్రియ విధానంలో మామిడిని పండిస్తూ చాలా మంది కోట్లలో సంపాదిస్తున్నారు. .
ఫలాల రాజు మామిడి ఉత్పత్తిలో మనమే ఫస్ట్
ప్రపంచలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారత దేశం మామిడి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశం నుంచి ప్రతి ఏడాది 21వేల మెట్రిక్ టన్నుల మామిడి వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. దీంతో దేశంలోని మామిడి రైతులు ప్రతి ఏడాది రూ.271.84 కోట్ల ఆదాయం గడిస్తున్నారు. అయితే సేంద్రియ విధానంలో ఈ మామిడిని ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి ఇందుకు రెట్టింపు విధానంలో ఆదాయాన్ని అందుకోవచ్చు. మొత్తంగా ప్రతి ఏడాది ఓ మామిడి రైతు సేంద్రియ విధానంలో మామిడిని పండిస్తే దాదాపు రూ.12 లక్షల ఆదాయాన్ని అందుకోవడానికి వీలవుతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక విధానాలను అనుసరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలూ అందుతాయి.
సేంద్రియ విధానంలో మామిడి ని పండించే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలు అందిస్తోంది. ముఖ్యంగా సబ్సిడీల రూపంలో మెక్కులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు అందజేస్తుంది. అయితే సేంద్రియ విధానంలో మామిడి పండించి విక్రయించే విధానం పై రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. ఇందుకుగాను ఇప్పటికే ఈ విధానంలో పంటను పండిస్తున్న రైతుతో మాట్లాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా సేంద్రియ విధానంలో మామిడిని పండించాడానికి అవసరమైన ప్రత్యేక పరికరాల పై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. సంప్రదాయ విధానంలో కాకుండా మామిడి మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. మొక్కలను కూడా ప్రత్యేక విధానంలో నాటాల్సి ఉంటుంది. పంట కోత నుంచి నిల్వ, ప్యాకింగ్, ఎగుమతుల వరకూ అనేక జాగ్రత్తులు తీసుకోవాలి. దేశ విదేశాల్లోని మార్కెట్ పరిస్థితులను అనుసరించి పంటకు ధర నిర్ణయించడం పై అవగాహన పెంచుకోవాలి. మొత్తంగా కొన్ని ప్రత్యేక మెళుకువలను అలవరుచుకుని సేంద్రియ విధానం లో పంటను పండిస్తే మామిడి రైతులు ఎక్కువ లాభాలను అందుకోవచ్చు.