సంపాదన సరిపోయేది కాదు…
తెలంగాణాలోని రంగారెడ్డికి చెందిన మల్లేష్ ITI చదివి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. అయితే వచ్చే సంపాదనా ఏ మూలకూ సరిపోయేది కాదు. దీంతో తన మనకు నచ్చిన వ్యవసాయం చేసి ఉన్నతస్థితికి రావాలని తపన పడేవారు. అయితే చాలా మంది “చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవారికే లాభాలు రావడం లేదు. ఇక నీ చేత ఏమవుతుంది” నిరుత్సాహ పరిచేవారు. అయినా మల్లేష్ వెనకడుగు వేయలేదు. వ్యవసాయం గురించి, వివిధ రకాల సాగు పద్దతుల గురించి వేర్వేరు మార్గాల్లో సమాచారాన్ని సేకరించేవారు. ఈ క్రమంలోనే ffreedom App గురించి తెలిసింది. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వేర్వేరు కోర్సులను చూశారు. స్వతహాగా వ్యవసాయం పై మక్కువ కలిగిన మల్లేష్ సమీకృత వ్యవసాయ విధానం, కొబ్బరి చెట్ల పెంకం, సేంద్రియ వ్యవసాయం కోర్సుల్లో చేరి అనేక విషయాలను నేర్చుకున్నారు.
ఇలా అయితే నీ సంపాదన “0” అన్నారు…
నేర్చుకున్న విషయాలను మల్లేష్ క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సేంద్రియ పద్దతుల్లో వరిని పండించాలని నిశ్చయించుకున్నారు. అయితే మల్లేష్ నిర్ణయాన్ని ఎవరూ హర్షించలేదు. పైగా సేంద్రియ విధానంలో వరి పండించితే పెట్టుబడి ఖర్చులు కూడా రావన్నారు. అయినా మల్లేష్ తన నిర్ణయం పై వెనక్కు తగ్గలేదు. యాప్‌లో సూచనలను అనుసరించి తూ.చ తప్పకుండా సేంద్రియ పద్దతుల్లో వరిని సాగు చేయడం మొదలు పెట్టారు. ఒక ఎకరాలో సేంద్రియ విధానంలో వరిని సాగు చేసారు.
లాభాల సాగు…
మొదటి ఏడాది రూ.30వేలు పెట్టుబడిగా పెట్టారు. ఖర్చులన్నీ పోను ఒక ఎకరాకు రూ.20 వేల లాభాన్ని అందుకున్నారు. సేంద్రియ విధానంలో వరి పండించడం వల్ల మొదటిసారి తక్కువ దిగుబడే వస్తుంది. అయితే సరైన మార్కెట్ విధానాలను అనుసరించడం వల్ల లాభాలు అందుకోవచ్చునని మల్లేష్ నిరూపించారు. అయితే సేంద్రియ విధానంలో రెండు, మూడో ఏడాదిలో ఉత్పాదకత పెరుగుతూ పోతుంది. అంతేకాకుండా పంటను ఆశించే చీడలు కూడా తగ్గుతాయి. దీంతో పెట్టుబడి కూడా తగ్గి అధిక లాభాలు వస్తాయని మన మల్లేష్ చెబుతున్నారు. అతను మన ఫ్రీడం యాప్ ప్రతినిధితో ఏమంటున్నారో మీరే వినండి. “సేంద్రియ విధానంలో పండిన వరికి డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో యాప్ ద్వారా ముందుగానే తెలిసింది. డిమాండ్ ఎక్కడ ఉందో అక్కడ పండిన పంటను అమ్మాను. అంతేకాకుండా స్థానిక మార్కెట్‌లో కూడా కొంత భాగాన్ని విక్రయించాను. మొత్తంగా అందరూ ఆశ్చర్యపోయేలా సేంద్రియ విధానంలో మొదటిసారే అధిక లాభాలు అందుకున్నాను.” అని పేర్కొన్నారు.