Home » Latest Stories » విజయ గాథలు » పచ్చళ్ల వ్యాపారంలో అద్భుతాలు సృష్టస్తున్న 65 ఏళ్ల “యంగ్” సిటిజన్

పచ్చళ్ల వ్యాపారంలో అద్భుతాలు సృష్టస్తున్న 65 ఏళ్ల “యంగ్” సిటిజన్

by Bharadwaj Rameshwar

“ఎంచుకున్న రంగంలో రాణించడానికి వయస్సు అడ్డుకాదు. వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే.” అంటున్నారు. 65 ఏళ్ల నాగలక్ష్మి గారు. కొత్త సాంకేతికతను నేర్చుకుని దానిని ఆచరణాత్మకంగా అమలు చేసి పచ్చళ్ల వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తున్న ఈ బెంగళూరు వాసిని సీనియర్ సిటిజన్ అనడం కంటే యంగ్ సిటిజన్ అనడం బాగుంటుందేమో! కదా? ఆమె విజయ గాథను చదివి నాగలక్ష్మి గారిని సీనియర్ కంటే యంగ్ సిటిజన్ అనడమే కరెట్టుగా ఉంటుందని మీరే చెప్పండి. 

చాలా ఏళ్లుగా పచ్చళ్లు చేస్తున్నా…

బెంగళూరుకు చెందిన శ్రీమతి నాగలక్ష్మి వయస్సు ప్రస్తుతం 65 ఏళ్లు. ఈమె దాదాపు 15 నుంచి 20 ఏళ్లుగా పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నారు. దీనితో పాటు మసాలా పొడులు కూడా చేసి అమ్మేవారు. మొన్నటి వరకూ ఇది తనకు ఒక హాబి మాత్రమే. మరీ బలవంతం పెడితే దీన్ని తన స్నేహితులు, దూరపు చుట్టాలు మరియు పొరుగువారికి విక్రయించడం చేసేది. దీని వల్ల కొంత ఆదాయం కూడా వచ్చేది. అయితే దానిని ఎప్పుడు వ్యాపార కోణంలో చూడలేదు. అయితే కొంత మంది సన్నిహితుల సూచనలతో దీనిని వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? అని ఆలోచించడం మొదలు పెట్టింది

మార్కెటింగ్ మెళుకువలు నేర్పించిన ffreedom App

నాగలక్ష్మి గారి చేతి పచ్చళ్లు అంటే బంధువులు, కుటుంబ సభ్యులు లొట్టలు వేసుకుని మరీ తినేవారు. అంటే ఉత్పత్తి నాణ్యమైనదే. అయితే దీనికి వ్యాపార హోదా తీసుకురావాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం నాగలక్ష్మీ పలు చోట్ల వెదికారు. చివరికి ffreedom App రూపంలో ఆమెకు సమాధానం దొరికొంది. ఈ యాప్‌లోని పికిల్ లేదా పచ్చళ్ల బిజినెస్, ఈ కామర్స్ కోర్సుల్లో చేరింది. పచ్చళ్ల కు ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకున్నారు, అంతే కాకుండా పచ్చళ్లు, మసాలా పొడులను సరఫరా & పంపిణీ చేయడం, ధర నిర్ణయించడం పై అవగాహన పెంచుకున్నారు. అంతేకాకుండా ఖాతాలు, ఫ్రాంఛైజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ & కస్టమర్ సపోర్ట్, రిజిస్ట్రేషన్ తదితర విషయాలన్నింటిని బాగా నేర్చుకున్నారు.

బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుని

ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఈ చలాకీ  బామ్మ గారు వ్యాపారానికి  లైసెన్స్ కూడా పొందిందారు.  తాను తయారు చేసే ఉత్పత్తులకు “సూర్య అయ్యంగార్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్” పేరుతో నూతన బ్రాండ్‌ ను క్రియేట్ చేసుకున్నారు. నేర్చుకున్న విషయాలతో పాటు ఫ్రీడం యాప్ ప్రతినిధి ఎప్పటికప్పుడు అందించే సలహాలు, సూచనలతో మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేసేవారు. దీంతో ప్రతి యూనిట్ అమ్మకం పై  10% నుండి 12% వరకు లాభం పొందుతున్నారు.  ముఖ్యంగా నవంబర్ 2021లో fssai నుండి లైసెన్స్ పొందడం పచ్చళ్ల అమ్మకాల్లో గణనీయమైన ప్రగతిని తీసుకువచ్చింది. .

వాట్సప్ గ్రూపుల నుంచి ఈ కామర్స్ సైట్ల వరకూ

ఈ 65 ఏళ్ల యంగ్ అండ్ యాక్టీవ్ బామ్మ వాట్సాప్ గ్రూప్‌ని కూడా నిర్వహిస్తున్నారు. సభ్యులు నేరుగా ఆమెకు ఆర్డర్లు ఇస్తారు. మరియు డిజిటల్ లావాదేవీల ద్వారా చెల్లింపులు చేస్తారు. సొమ్ము అందిన తర్వాత రెండు రోజుల లోపు సరుకును డెలివరీ చేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రస్తుతం నాగలక్ష్మీ కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.  అలాగే కొన్ని ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతున్నారు. మన ఫ్రీడం యాప్ ప్రతినిధి ఈ 65 ఏళ్ల వయస్సులో ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే…”కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం.” అని తడుముకోకుండా సమాధానమిచ్చారు. “అయినా వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. ఉత్సాహకంగా ముందుకు వెళ్లినప్పుడు మన ఎదుగుదలకు వయస్సు అడ్డురాదు. ఈ విషయంలో తనకు కొత్త విషయాలను ఎంతో ఓర్పుతో నేర్పించిన ffreedom App కు ఎప్పటికీ కృతజ్ఞతలు” అని చెప్పారు. అయితే మా ప్రతినిధి మాత్రం “మీరు పెద్దవారు మాకు మీ ఆశీర్వాదం కావాలని” అని వినమ్రతతో పేర్కొన్నారు. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!