“కష్టపడే తత్వం, సరైన వ్యూహం ఈ రెండూ కలిస్తే విజయం నీ చెంతకే చేరుతుంది.” ఈ వాఖ్యానం తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన శ్రీ వర్థన్ కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే సరైన వ్యూహంతో ప్రయత్నించడంతో మూడు రోజుల్లోనే పెట్టుబడికి మూడు రెట్ల లాభాన్ని పికిల్ బిజినెస్ లో అందుకున్నారు. అంతేనా ఇతని వ్యాపార చతురతకు మెచ్చి డిస్ట్రిక్ట్ రూరల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (DRDA) రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ పికిల్ బిజినెస్‌ను మైక్రో ఇండస్ట్రీగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామని కూడా భరోసా ఇచ్చింది.
సున్నా నుంచి మొదలు పెట్టి
తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన శ్రీ వర్థన్ Bcom పూర్తి చేశారు. అటు పై కొన్ని సంస్థల్లో పనిచేశారు. అయినా ఏదో అసంతృప్తి. దీంతో తానే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి పదిమందికి ఉపాధి కల్పించాలని భావించేవారు. అందువల్ల వివిధ వ్యాపారావకాశాల కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే ffreedom App గురించి తెలిసింది. యాప్‌ను డౌన్లోడ్ చేసి అందులో ఉన్న అనేక కోర్సులను చూశారు. ముఖ్యంగా పికిల్స్ తయారీ బిజినెస్ కోర్స్ శ్రీ వర్థన్‌ను బాగా ఆకర్షించింది. ఈ కోర్సులో చేరి పికిల్ బిజినెస్ కు సంబంధించిన అన్ని విషయాల పై పూర్తిగా అవగాహన పెంచుకున్నారు.
అన్ని విషయాలు యాప్ ద్వారానే
తన మనస్థత్వానికి, ఇంటి పరిస్థితులకు సరిపోయే పచ్చళ్ల (పికిల్స్) తయారీ బిజినెస్‌ను ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. ఫ్రీడం యాప్ ద్వారా పికిల్స్ వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి, రిజిష్ట్రేషన్, అనుమతుల విషయం పై పూర్తిగా అవగాహన పెంచుకున్నారు. అటు పై ఏ సమయంలో ఏ ఏ పికిల్స్ తయారు చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకున్నారు. అంతేకాక డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ మెళుకువలను నేర్చుకున్నారు. ముఖ్యంగా స్థానిక మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులకు ధరలను ఎలా నిర్ణయించాలో అవగాహన పెంచుకున్నారు.
ఎగ్ పికిల్… ఫిష్ పికిల్‌తో మాయ
శ్రీ వర్థన్ యాప్ ద్వారా నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలు పెట్టారు. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ పికిల్స్ తయారీ లో మెళుకువలను సంపాదించారు. ముఖ్యంగా ఎగ్ పికిల్, ఫిష్ పికిల్ పై పట్టుసాధించారు. అటు పై రూ.5వేల పెట్టుబడితో పికిల్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. కేవలం మూడు రోజుల్లోపు శ్రీ వర్థన్ తయారైన పికిల్స్ అన్నీ అమ్ముడు పోయి రూ.45 వేలు చేతికి అందింది. ఇందులో అధిక భాగం ఎగ్, ఫిష్ పికిల్స్ నుంచే అందింది. అంతే శ్రీ వర్థన్ అనందం వర్ణనాతీతం. రెట్టించిన ఉత్సాహంతో పికిల్ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో DRDA అధికారులను కలిసి తన ఆలోచనలు పంచుకున్నారు. శ్రీ వర్థన్ వ్యాపార ప్రణాళికలు నచ్చి అధికారులు రూ.25 లక్షలను రుణంగా అందించడానికి అంగీకరించారు. దీంతో పికిల్ తయారీని ఓ మైక్రో ఇండస్ట్రీ స్థాయిలో మొదలుపెట్టడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదులుపెట్టారు. ఈ విషయమై శ్రీ వర్థన్ ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…”పరిశ్రమను స్థాపించాలన్న ఆలోచనతో ఉన్న నాకు చేయూతను ఇచ్చింది ffreedom App. ఈ మేలును ఎప్పటికీ మరిచిపోనూ. నా సందేహాలకు సమాధానాలను ఇప్పటికీ నేను ఈ యాప్ ద్వారానే పొందుతున్నాను.” అని పేర్కొన్నాను.