బిజినెస్ ప్రారంభించడం అనేది అందరూ ఏదో దెయ్యమో- భూతమో అన్నట్టుగా చూస్తారు. డబ్బులేదనో, సమయం లేదనో, మరేదో కారణాల వల్ల ఆ వైపు పోరు! అలాంటి వారందరూ, ఊసూరుమనుకుంటూ, మధ్య తరగతి చట్రాలలో జీవితాంతం మిగిలిపోతారు. ప్రతీ నెలా, “అమ్మో ఒకటో తారీకు” అంటూ కంటి మీద కునుకు లేకుండా జీవిస్తారు. వారి లైఫ్ మొత్తం అలానే గడిచిపోతుంది. ఇంకొంతమంది, అలా కాకుండా ప్రారంభ దశలో కాస్త రిస్క్ చేసి, కష్టపడి బిజినెస్ చేస్తూ… మంచి ఆర్థిక సంపాదన పొందుతూ ఉంటారు. దీనితో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది, వారి జీవితానికి వారే బాస్ గా ఉంటారు. ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి!
ఆ రెండో కోవకే చెందుతాడు మన దేవరాజ్! పెద్ద వయసు లేదు, మాట్లాడితే నిండా పాతికేళ్ళు కూడా లేవు. అయితే ఏముంది… గొప్పగా సంపాదించాలి, మంచి బిజినెస్ మ్యాన్ గా ఉండాలి అనే, ఆలోచన అతడికి ఉంది. దానిని ఆచరణలోకి తీసుకురావడానికి ffreedom app తోడైంది. ఇంకేముంది, సక్సెస్ అతడి వాకిట్లోకి నించుంది. పౌల్ట్రీ ఫార్మింగ్ ద్వారా బిజినెస్ లో అడుగుపెట్టిన దేవరాజ్ కథను పూర్తిగా తెలుసుకోండి!
మార్నింగ్ చదువు- ఈవెనింగ్ బ్రతుకు తెరువు!
దేవరాజ్ ఒక విద్యార్థి. అటు చదువు, ఇటు పౌల్ట్రీ ఫార్మింగ్. రెండు పడవల మీద కాలు వెయ్యడం అంత సులభం కాదు. కానీ “సాధనాత్ సాధ్యతే సర్వం” అనిపించాడు, దేవరాజ్. ఉదయం నాలుగింటికి లేవడంతో అతడి దినచర్య మొదలు అవుతుంది. 9 గంటల దాకా పొలంలో పని, పౌల్ట్రీలో పని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత, 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండిటి వరకు కాలేజీ. ఆ పైన, రెండింటి నుంచి రాత్రి 9 గంటల దాకా మళ్ళీ పొలం మరియు పౌల్ట్రీని చూసుకుంటూ ఉంటాడు. అతడు చిన్నగా ప్రారంభించిన ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ ని ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వరకు విస్తరించాడు.
2018 సం. అతడి జీవితాన్నే మార్చేసింది.
దేవరాజ్ 2018 సంవత్సరం వరకు, ఒక సాధారణ విద్యార్థి. ఆ ఏడాది, అతడి తండ్రి చదువుతో పాటు ఏదైనా ప్రారంభిస్తే మంచిది అని చెప్పడంతో, ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. కిరాణా కొట్టుతో అతడి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కానీ అది సవ్యంగా సాగలేదు. నష్టాలు పెద్దగా లేనప్పటికీ, నిరాశ అతడిని చుట్టుముట్టింది.
అప్పుడే అతడు యూట్యూబ్ లో ffreedom app వారి వీడియోలను చూడడం ప్రారంభించాడు. పౌల్ట్రీ ఫార్మింగ్, మష్రూమ్ ఫార్మింగ్ మరియు కొవ్వొత్తి (కాండిల్) మేకింగ్ బిజినెస్ ను చూసాడు. అయితే, కరోనా కారణాల వల్ల బిజినెస్ ను రెండు సంవత్సరాల పాటు వాయిదా వెయ్యాల్సి వచ్చింది. ఆ సమయంలో, అతడు app లో మరెన్నో కోర్సులు చూసి, బిజినెస్, ఫైనాన్స్ మరియు పౌల్ట్రీకి సంబంధించి మరిన్ని మెళకువలను నేర్చుకున్నాడు.
ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ, నాలుగు లక్షల సంపాదన!
దేవరాజ్, కేవలం 20 వేలతో స్క్రాప్ నుంచి షెడ్ ను నిర్మించాడు. మేత కోసం నాచ్యురల్ పదార్ధాలను వినియోగిస్తూ ఉన్నాడు. మొదట, 50 కోళ్లతో ప్రారంభం అయిన అతడి బిజినెస్, ఆ తర్వాత అభివృద్ధి చెంది, సెకండ్ బ్యాచ్ ను అతడు 250 కోళ్లతో ప్రారంభించాడు. ఇందుకు కానూ, అతడు 4 లక్షల ఆదాయాన్ని పొందాడు! వాటికి మేత ఎలా తయారు చెయ్యాలి, వాటికొచ్చే వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి వంటివి ffreedom app నుంచి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండడంతో, అతడు మేత ఖర్చు, ఇతరత్రా ఖర్చును మిగుల్చుకుంటున్నాడు.
ప్రస్తుతం దేవరాజ్…
దేవరాజ్, తన పౌల్ట్రీ ఫార్మింగ్ ను విస్తరించే పనులలో ఉన్నాడు. మహబూబ్‌నగర్ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న అనేక హోటళ్లలో అతడి చికెన్ కి మంచి డిమాండ్ ఉంది. అతడు ప్రస్తుతం, టర్కీ కోళ్లు, గిన్నె కోళ్లు, మేకలు వంటివి కూడా పెంచుతూ ఉన్నాడు. వెంకాబ్ చికెన్, సుగుణ చికెన్ తరహాలో సుప్రీమ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనే బ్రాండ్ ను నెలకొల్పనున్నారు. ఇప్పటికే, దేవరాజ్ బిజినెస్ కు ఆఫ్-లైన్ నుంచే కాక, ఇంస్టాగ్రామ్ మరియు వాట్సాప్ నుండి విశేష సంపాదన లభిస్తుంది!
దేవరాజ్, ఈ బిజినెస్ ను ప్రారంభించే ముందు… ఎదగాలనే కల ఉన్న విద్యార్థి. అతడికి ఒక మెంటార్ అవసరం. ఆ మెంటార్ ffreedom app రూపంలో, అతడి ఈ సక్సెస్ జర్నీలో అతడి వెన్నంటే నిలిచింది. మీ సక్సెస్ జర్నీని ఎప్పుడు మొదలుపెడుతున్నారు?