“ఆమె వయస్సులో చిన్న. కాని ఆలోచనలు పెద్దది. ఈ క్రమంలో ffreedom app సహకారం అందించింది. దీంతో ఆమెకు కోరుకున్న విజయం అందింది.” ప్రసన్న జ్యోతి మంథెన జీవితాన్ని ఒక్క మాటలో ఇలా చెప్పవచ్చు. మీకు కూడా ఈ సక్సెస్ స్టోరి ద్వారా ప్రసన్న జ్యోతి వ్యాపార జీవితాన్ని పూర్తిగా తెలుసుకుని శహభాష్ అనండి.
ఇంటర్ కాగానే పెళ్లి…
తూర్పుగోదావరికి చెందిన ప్రసన్న జ్యోతి వయస్సు ప్రస్తుతం 24 ఏళ్లు. ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి కూడా చేసేశారు పెద్దవాళ్లు. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఏదో అసంతృప్తి ప్రసన్న జ్యోతిని వేధించేది. తాను కూడా కుటుంబ పోషణకు ఎంతో కొంత సంపాదించాలనుకునేవారు. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీలు పడేది కాదు. దీంతో ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలని భావిస్తూ ఉండేవారు. అయితే తనకు వివిధ రకాల పిండి పదార్థాలు శుచిగా, రుచిగా తయారు చేయడం వచ్చు. దీనినే ఎందుకు వ్యాపార మార్గంగా ఎంచుకోకూడదనుకున్నారు. ఈ సందర్భంలో ఓ ఫ్రెండ్ ద్వారా ffreedom App గురించి తెలిసి దీనిని తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు.
అన్ని విషయాలు యాప్ ద్వారేనే…
యాప్ ద్వారా ఏదేని బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి? అనే కోర్సుతో పాటు పూతరేకులు తయారీ, విక్రయానికి సంబంధించిన కోర్సును కూడా నేర్చుకున్నారు. ప్రసన్న జ్యోతికి అంతకు ముందుగానే పూతరేకులు తయారి పై అవగాహన ఉంది. అయితే పూతరేకుల తయారీ, విక్రయానికి అనుమతులు ఎలా తీసుకోవాలో ఫ్రీడం యాప్ ద్వారా తెలిసిందే. అంతేకాకుండా తక్కువ ధరకే ముడిపదార్థాల సేకరణ, తయారీ, డిమాండ్, మార్కెంగ్, జమా ఖర్చులు వంటి విషయాలెన్నింటినో ప్రసన్న జ్యోతి మంథెన ఫ్రీడం యాప్ ద్వారా నేర్చుకున్నారు. అటు పై నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలు పెట్టారు.
రూ.20 వేల పెట్టుబడి రూ.50 వేల ఆదాయం
ప్రారంభ పెట్టుబడి రూ.20 వేలతో పూత రేకుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను కావాల్సిన పరికరాలను కూడా కొనుగోలు చేశారు. ఒకరిని పూత రేకుల తయారీ, మార్కెట్‌లో తనకు సహాయంగా తీసుకున్నారు. మొత్తంగా రూ.20 వేల పెట్టుబడితో తయారైన పూత రేకులు అమ్మగా దాదాపు రూ.50 వేల ఆదాయం వచ్చింది. ఇలా ప్రారంభించిన కొద్ది రోజులకే లాభాలు రావడంతో ప్రసన్న జ్యోతి మంథెన ఆనందానికి అవధులు లేవు. ఈ విషయమై ffreddom App మా ప్రతినిధితో జ్యోతి మాట్లాడుతూ “అతి తక్కువ సమయంలోనే పెట్టిన పెట్టుబడికి లాభాలు కళ్ల చూసాను. కష్టమర్లలో ఫ్రెండ్స్, బంధువులే కాకుండా స్వీట్ షాపులు, బెకరీలు కూడా ఉన్నాయి. ఇలా కస్టమర్లను పెంచుకోవడానికి ఉపయోగపడిన ffreedom App కు ధన్యవాదాలు. ఇక్కడ మీకు మరో విషయం కూడా చెప్పాలి. నేను మరొకరికి ఉపాధి కూడా కల్పించే స్థితికి చేరుకున్నాను. అన్నింటికంటే ఇదే నాకు ఎక్కువ సంతృప్తి ఇస్తోంది.” అని ప్రసన్న జ్యోతి తెలిపారు.