“వయస్సు ఒక నంబర్ మాత్రమే. ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు. ఎలా ఎదుగుతున్నామన్నది ముఖ్యం” వంటి వాఖ్యానాలు ఎన్నింటినో పుట్టవీరయ్య గురించి చెప్పవచ్చు. 68 ఏళ్ల ఈ సీనియర్ సిటిజన్ మేకలు, గొర్రెలను పెంచుతు అధిక ఆదయాన్ని గడిస్తున్నారు. అంతేకాక ఈ మేకలు, గొర్రెలను నాలుగు కాళ్ల ఏటీఎం అంటున్నారు. ఇలా అనడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం ఈ స్ఫూర్తిదాయక కథనం చదివేద్దాం రండి.
సంపాదన అంతంత మాత్రమే…
కర్ణాటకకు చెందిన 68 ఏళ్ల ఔత్సాహిక రైతు పేరు పుట్టా వీరయ్య. ఇతను పదోతరగతి పూర్తి చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఉద్యోగానికి వెళ్లలేకపోయారు. తండ్రి నుంచి వచ్చిన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. మొదట్లో బాగానే సంపాదించేవారు. అయితే వాతావరణంలో మర్పులు రావడంతో పాటు ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేయలేకపోవడం వల్ల సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది. అయితే వ్యవసాయంతో పాటు మేకలను, గొర్రెలను కూడా పెంచడం మొదలుపెట్టారు. అయితే సరైన యాజమాన్య పద్దతులు పాటించకపోవడంతో వాటిలో ఎక్కువగా చనిపోయేవి. దీంతో కుటుంబ పోషణకు B.comకు చదివిన తన కుమారుడిని బెంగళూరుకు పంపించారు. వ్యవసాయం ద్వారా అందే అరకొర సొమ్ముతో పాటు కొడుకు పంపించే డబ్బుతో కుటుంబం గడిచిపోయేది. ఈ క్రమంలో పుట్టవీరయ్యకు ffreedom App గురించి తెలిసింది.
మేళుకువలు నేర్చుకుని..
ఫ్రీడం యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న పుట్టవీరయ్య వ్యవసాయానికి సంబంధించిన అనేక కోర్సులను చూసారు. అందులో చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం ఆయన్ను బాగా ఆకర్షించింది. దీంతో యాప్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకుని గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించిన మెళుకువలను నేర్చుకున్నారు. వ్యాధినిరోధకత ఎక్కువగా ఉన్న మేకలు, గొర్రెలను కొనుగోలు చేసారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల సబ్సిడీలు పొందారు. పశువులకు అవసరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేవారు. మేకలు, గొర్రెలకు వచ్చే వ్యాధులు, నివారణ, టీకాల విషయంలో అప్రమత్తంగగా వ్యవహరించేవారు. మొత్తంగా రూ.50 వేల పెట్టుబడి పెట్టి మూడు నుంచి నాలుగు నెలల లోపు రూ.30 వేల ఆదాయాన్ని పొందారు.
కుమారుడు కూడా మేకలు, గొర్రెల పెంపకం వైపు..
దీంతో తన పెట్టుబడిని పెంచి మరిన్ని మేకలు, గొర్రెలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా తన వద్ద ప్రస్తుతం ఉన్న 25 మేకలు, గొర్రెల సంఖ్యను 50 నుంచి 75 కు పెంచి వీటి ద్వారా ఏడాదికి రూ.8 లక్షల సంపాదన గడించాలని పుట్ట వీరయ్య ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక మేకలు, గొర్రెల పెంపకంలో లాభాలు చూసిన పుట్ట వీరయ్య కుమారుడు కూడా బెంగళూరు నుంచి వెనక్కు వచ్చి పూర్తి స్థాయిలో మేకలు, గొర్రెలు పెంపకంలో తండ్రికి సాయం అందిచాలని భావిస్తున్నారు. ఈ విషయమై పుట్టవీరయ్య ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…”మేకలు, గొర్రెల పెంపకం అనేది నడిచే ఏటియం వంటిది. ఎందుకంటే ఏటియం దగ్గరకు మనం వెళ్లి డబ్బులు డ్రా చేయాలి. అయితే ఇవి మన వెంట నడుస్తూ మనకు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తాయి. అంటే వీటికి మార్కెట్‌లో డిమాండ్ ప్రతి రోజూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.” అని నవ్వుతూ వివరించారు.