Home » Latest Stories » Uncategorized » రికరింగ్ డిపోసిట్లో (RD) డబ్బులు దాయాలి అనుకుంటున్నారా? 3 ఉత్తమమైన మార్గాలను తెలుసుకోండి!

రికరింగ్ డిపోసిట్లో (RD) డబ్బులు దాయాలి అనుకుంటున్నారా? 3 ఉత్తమమైన మార్గాలను తెలుసుకోండి!

by Bharadwaj Rameshwar

మీరు ఒక్కసారే ఎక్కువ డబ్బులు జమ చెయ్యలేని వారా? నెల నెలా ఎంతో కొంత చిన్న మొత్తం దాయాలి అనుకుంటున్నారా? ఇలా డబ్బులు దాచిపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, SIP  విధానం, RD, చిట్ ఫండ్స్ లాంటివి అన్నమాట. 

  రిస్క్ లేకుండా డబ్బులు దాచుకోవాలి అనుకునే వారికి, రికరింగ్ డిపోసిట్ అనేది అత్యుత్తమ మార్గం. అందుకే, ఈ RD విధానం మిగతా అన్నీ, డబ్బు పొదుపు చేసే మార్గాల కంటే పాపులర్ అయ్యింది. ఈ విధానంలో కనిపించే ఎన్నో ఉపయోగాలు, సదుపాయాలు వల్లే, రికరింగ్ డిపోసిట్ చిరు ఉద్యోగులు, దిగువ, మధ్య తరగతి వారికి పర్సనల్ పిగ్గీ బ్యాంకు గా ఉంటుంది. 

ఇందుకు ఎన్నో కారణాలు కావచ్చు. తక్కువ మొత్తంలోనే ప్రారంభించే వెసులుబాటు, risk అనేది అస్సలు లేకపోవడం వాటితో పాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. లేట్ ఎందుకు,  రికరింగ్ డిపోసిట్ గురించి, పూర్తిగా తెలుసుకోడానికి, ఇక్కడ చదవండి!

ఇక్కడ డబ్బులు పొదుపు చెయ్యడం చాలా ఈజీ!

అసలు ముందు రికరింగ్ డిపోసిట్ అంటే ఏంటో తెలుసుకుందాం! నెల నెలా నిర్ణయించిన తేదికి డబ్బులు, కొంత కాలం పాటు జమ చేసుకుంటూ వెళ్లడం. అంటే, మీరు నెల నెలా వెయ్యి రూపాయిలు దాయాలి అనుకుంటే, ప్రతి నెలా… కొంత కాలం పాటు,. మీరు వెయ్యి  రూపాయిల చొప్పున బ్యాంకులో ఆర్.డి విధానం కింద జమచేస్తూ పోవాలి. ఆ నిర్ణిత కాలం పూర్తి అయిన తర్వాత మీకు, అసలు మరియు వడ్డీ కలిపి, ఒకే సారి మీ చేతికి అందుతుంది!

పిల్లల పెళ్లి కోసం,  లేదా కొంతకాలం డబ్బు దాచి, నగలు కొనుక్కుందాం అనుకున్నా… లేదా దీర్ఘ  కాలం పొదుపు చేద్దాం  అనుకున్నా, ఆర్.డీ కట్టడం చాలా  మంచి పద్ధతి!   

కేవలం పది రూపాయలు నుంచి కట్టుకోవచ్చు!

అవును మీరు నమ్మినా నమ్మక పోయిన ఇది నిజం. ఆర్.డిను, తక్కువ డబ్బులతో, అంటే నెల నెలా కేవలం పది రూపాయలు చెల్లించి కూడా మీరు ఈ విధానం ద్వారా డబ్బు పోగు చేసుకోవచ్చు! 

ఇంత తక్కువ డబ్బులతో మీ పొదుపు విధానం మొదలు అవుతుంది కాబట్టే, ఈ విధానంలో ధనికులే కాకుండా, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఆఖరికి పేదవారు కూడా ఇందులో ఎంతో కొంత దాస్తూ ఉంటారు! 

ఈ ఆర్.డి విధానంలో మనం డబ్బులను పోస్ట్ ఆఫీసులో, బ్యాంకులలో, NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెపెనీలు, ఉదాహరణకు ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కాపిటల్ వంటి సంస్థలు) మరియు కార్పొరేట్ కంపెనీలు, వీటన్నిలో మీరు డబ్బులను దాచుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లు ఎప్పటి నుంచో పనిచేస్తూ,  ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయి. 

 RD విధానం, ఎందుకు మంచిది?

ఈ విధానంలో సాధారణంగా వడ్డీ రేట్ 5 శాతం నుంచి ఉంటుంది. ఇది ఒక్కో బ్యాంకు ను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులలో సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే వడ్డీ కాస్త ఎక్కువగా  ఉంటుంది. ముందే చెప్పినట్టు ఇందులో పది  రూపాయల నుంచి మనం దాచుకోవచ్చు. అయితే కనీసం 1000 లేదా 500 రూపాయల నుంచి మీరు దాచుకుంటే, మీకు మంచి రాబడి అందుతుంది. . 

మీ డబ్బు మెచ్యూరిటీ అయ్యే సమయం, అంటే ఎన్ని నెలలు కట్టాలి అనేది మీరే  నిర్ణయించుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు, 6 నెలల నుంచి 5 సంవత్సరాల దాకా, మీరు ఎంచుకునే అవకాశాన్ని కలిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మూడు నెలల వ్యవధితో కూడా కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కానీ, మీరు మధ్యలో తీసుకోవడానికి చెల్లుబాటు అవ్వదు!

సాధారణంగా సేవింగ్స్ కంటే,  RD విధానంలో వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధానంలో మీ రికరింగ్ డిపోసిట్ పూచికత్తుపై మీ డిపోసిట్ లో 95 శాతం వరకు ఋణం కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. 

అయితే, మీరు మెచ్యూరిటీ కాలం వ్యవధి ముగియకుండానే, మీ డబ్బులు తీసుకోవాలంటే మాత్రం పెనాల్టీ చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్లెక్సీ ఆర్. డీ విధానాన్ని ఎంచుకుంటే గనుక, మీరు నిర్ణయించుకున్న అమౌంట్ కంటే, ఎక్కువ కట్టుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు నిర్ణయించుకున్న అమౌంట్ 1000 రూపాయలు అయితే గనుక, మీరు వీలుని బట్టి తర్వాతి నెలలలో మీరు 2000, 3000 లేదా ఆ పైనా చెల్లించే అవకాశం ఉంటుంది.  

అలాగే, ఇందులో వచ్చే వడ్డీని మనం ఒకేసారి అయినా తీసుకోవచ్చు, లేదా త్రైమాసికం, అర్ధ వార్షికం విధంగానైనా తీసుకోవచ్చు.  

ఎవరైనా ఓపెన్ చెయ్యొచ్చు!

RD ఖాతాను ఎవరైనా ఓపెన్ చెయ్యొచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. పది ఏళ్ళు నిండిన ఎవరైనా ఇందులో ఖాతాను తెరవవచ్చు. ఒకవేళ మీరు మీ పిల్లకి ఓపెన్ చెయ్యాలి అనుకునేంటే, వారు పది ఏళ్లకంటే తక్కువ ఉన్నవారైతే, వారికి మీరు సంరక్షులుగా ఉంటూ, ఖాతాని తెరవవచ్చు! 

RD లేదా SIP? ఏది మంచిది?

 ఇవి రెండు మనం డబ్బు ఒకేసారి కాకుండా, నెల వారీగా దాచుకునే సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. మాకసలు రిస్క్ వద్దు అనుకునే వారికి, ఆర్డీ  ఉత్తమమైన ఆప్షన్. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోగలను అనుకుంటే మీరు, SIP విధానం లో డబ్బులు దాయొచ్చు. 

రికరింగ్ డిపాజిట్ ద్వారా, మీకు తక్కువ వడ్డీ లభిస్తుంది. కానీ, డబ్బుల గురించి ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. SIP ద్వారా మీకు ఎక్కువ వడ్డీ వచ్చినప్పటికీ, మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది.

మీరు ఆర్.డీ విధానం ద్వారా నెలకు రెండు వేల రూపాయలు జమ చేసారు అనుకుందాం. 5 సంవత్సరాలకి మీ డబ్బు, 1,20,000 అవుతుంది. దానికి బ్యాంకు వారు 5.7 శాతం(ఒక్కో బ్యాంకును బట్టి వడ్డీ శాతం మారుతూ ఉంటుంది) వడ్డీ వేశారు అనుకుందాం! మీకు మీ మెచ్యూరిటీ సమయంలో, 1,36,025 రూపాయల దాకా అందుతుంది!

అదే SIP విధానంలో, మీరు నెలకి 2 వేల రూపాయల కింద జమ చేస్తూ పోతే, మీ 5 ఏళ్ళ మెచ్యూరిటీ నిండే సమయానికి మీకు, 1,64,972 దాకా రావచ్చు. అంటే మీరు జమ చేసిన 1. లక్షల రూపాయలకి అధనంగా, మీకు 45,000 రూపాయలు వడ్డీ ద్వారా వచ్చింది. 

ఖచ్చితంగా మీకు రికరింగ్ డిపాజిట్ కంటే ఎక్కువ డబ్బు ఏ వచ్చినప్పటికీ,  ఈ నంబర్లు స్టాక్ మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. 

అందువల్ల మీకు డబ్బులు రావచ్చు! పోవచ్చు!అందువల్ల కొన్నిసార్లు మీరు డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిస్క్ తీసుకునే వారికి SIP బెస్ట్ ఆప్షన్. అలాగే, ఒక్క లక్ష్యం కోసం (పెళ్లికోసం, ఇల్లు కోసం) దాచుకునేవారు, అలాగే… చిన్న మొత్తంలో కూడా దాచుకోవాలి అనుకునేవారికి, ది బెస్ట్ ఆర్.డీ. 

కానీ, ఈ రెండు విధానాల్లోనూ, డబ్బు నెల నెలా జామచెయ్యాలి కాబట్టి, మీరు ఇది ప్రారంభించే ముందే, మీ వల్ల నెల నెలా ఎంతవరకు కట్టగలరో అంతవరకు మాత్రమే, చెల్లించేటట్టు పెట్టుకుంటే, మధ్యలో ఆపెయ్యవల్సిన పని ఉండదు. 

ప్రస్తుతం ఎన్నో బ్యాంకులు, కేవలం మొబైల్ యాప్ ద్వారా కూడా ఖాతాను తెరిచే వెసులుబాటుని కలిపిస్తున్నాయి. 

దీని ద్వారా మీరు మీ పనులు మానుకుని బ్యాంకుకు వెళ్లి మరీ డబ్బు కట్టవలసిన పని లేదు. దానితో పాటు, మీరు ఆటో రెన్యూవల్ ఆప్షన్ ను ఎంచుకుంటే, మీరు నిర్ణయించుకున్న తేదీ నాడు ఆటోమేటిక్ గా డబ్బు, మీ రికరింగ్ డిపోసిట్ ఖాతాలోకి పడిపోతుంది. 

రికరింగ్ డిపోసిట్ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, ఒక్కసారి దానిలో ఇన్వెస్ట్ చేసేముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది. అందుకే, ఆర్.డి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే, ffreedom app లో ఈ కోర్సులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. దీనితో పాటు, డబ్బులు జమ చేసుకోవాలి అనుకుంటే, ఎలాంటివి ఉంటాయి, మీ పరిస్థితిని బట్టి ఏది మంచిది? ఎంతవరకు జమ చేస్తే, మీరు లాభపడతారు వంటి ఇతర కోర్సులు కూడా ఇక్కడ చూడొచ్చు!

పెద్ద శ్రమ లేకుండానే, మీరు డబ్బులు దాయగల్గుతున్నారు అంటే, మంచిదే కదా!

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!