Home » Latest Stories » వ్యాపారం » ఎర్రచందనం…కోట్ల రుపాయల సంపాదనకు మార్గం

ఎర్రచందనం…కోట్ల రుపాయల సంపాదనకు మార్గం

by Sajjendra Kishore
246 views

రెడ్ సాండర్స్ లేదా ప్టెరోకార్పస్ శాంటాలినస్ అని కూడా పిలువబడే ఎర్ర చందనం సాగు పట్ల రైతులు ఇటీవల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏ పంటను పండించినా కూడా అందనంత లాభాలు ఈ పంట సాగులో ఉండటమే. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఈ ఎర్రచందనం సాగుద్వారా కోట్ల రుపాయల ఆదాయాన్ని చవిచూడవచ్చు. ఎర్రచందనం అనేది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక విలువైన చెట్టు జాతి. ప్రపంచంలో ఈ జాతి మరెక్కడా పెరగదు. ముఖ్యంగా ఎర్ర చందనం కలప మృదువుగా ఉంటూ అందమైన ఫర్నీచర్లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి, అలంకార వస్తువులను రూపొందించడానికి ఈ చెక్క ఎంతో అనుకూలం.  అందువల్లే ఈ ఎర్రచందనం చెట్టు నుంచి లభించే కలపకు అంతర్జాతీయ మార్కెట్లో ధర ఎక్కువగా పలుకుతూ ఉంది. అయితే, ఎర్రచందనం సాగు చేయడం అనేది సులభమైన ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. దీనికి పక్కా ప్రణాళిక, మరియు వనరులు అవసరం. వీటితో పాటు సహనం మరియు పట్టుదల అవసరం. ఈ కథనంలో ఎర్రచందనం పెంపకంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలతో సహా వివిధ అంశాలను విశ్లేషించాము మరియు ఈ వ్యాపారంలో ఎలా విజయం సాధించాలనే దానిపై కొన్ని చిట్కాలు మరియు మార్గదర్శకాలను అందిస్తాము.

సరైన నేలను ఎంచుకోవాలి..

ఎర్రచందనం సాగుకు అన్నింటి కంటే ప్రధానమైనది నేల రకం. ఎర్రచందనం కొండలు లేదా రాతి ప్రాంతాలలో బాగా ఎదుగుతాయి. సముద్ర మట్టానికి కనీసం 1000 మీటర్ల ఎత్తులో సాగు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా సాగు చేసే ప్రాంతంలో నాటిన చెట్లకు ఎల్లప్పుడు సూర్యరశ్మి బాగా తగలాలి. లేదంటే ఎర్రచందనం మొక్కగా ఉన్న సమయంలో పరాన్న మొక్కలు వాటి పై పెరిగుతాయి. దీని వల్ల వీటి ఎదుగుదల సరిగా ఉండదు. అదేవిధంగా తగిన నీటి వసతి ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యం. ఇందుకోసం డ్రిప్ ఇరిగేషన్ విధానం అవలంభించడం ఉత్తమమైన సాగు విధానమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

అనుమతులు చాలా ముఖ్యం

ఎర్ర చందనం సాగుకు అనువైన భూమిని ఎంచుకున్న తర్వాత చేయాల్సిన పని అధికారుల నుంచి అనుమతులు పొందడం. చాలా విలువైన ఈ చెట్లను పెంచడం, విక్రయించడం కోసం వ్యవసాయ, అటవీశాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భూ వినియోగ క్లియరెన్స్ సర్టిఫికెట్స్‌ పొందడం కూడా ఈ అనుమతుల్లో భాగమే అని గుర్తుంచుకోవాలి. అవసరమైన అనుమతులు పొందిన తరువాత, తదుపరి దశ చెట్లను నాటడానికి అనుగుణంగా భూమిని సిద్ధం చేయడం. ఇందులో కలుపు మొక్కలు, రాళ్లు, రప్పలను తీసివేసి మంచి ఎరువులను వేసి భూమిని చెట్లను నాటడానికి అనువుగా తీర్చి దిద్దాలి. మీరు నాటబోయే ఎర్రచందనం మొక్కలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. నర్సరీలో పెంచిన నాణ్యమైన మొక్కలను ఎంచుకుని జాగ్రత్తగా పొలం వద్దకు చేర్చాలి. భూమిని సిద్ధం చేసి, నారు సిద్ధమైన తర్వాత, ఎర్రచందనం చెట్లను నాటడానికి సమయం ఆసన్నమైంది. వేరు పరిమాణం కంటే రెట్టింపు పరిమాణంలో గుంతను త్రవ్వడం, రంధ్రం దిగువన ఉన్న మట్టిని వదులు చేయడం మరియు తగిన లోతులో మొక్కను నాటడం వరకూ ప్రతి విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. . నారుకు క్రమం తప్పకుండా నీరు పెట్టడం మరియు వాటికి అవసరమైన పోషకాలు మరియు ఎరువులు అందించడం కూడా చాలా ముఖ్యం. 

మొక్కల సంరక్షణ చాలా ముఖ్యం

అటు పై మొక్కలను జాగ్రత్తగా సంరక్షిస్తూ రావాలి. ఎర్రచందనం చెట్లు పరిపక్వతకు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, మరియు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో, చెట్లకు క్రమం తప్పకుండా నీరు పెట్టడం, ఎరువులు వేయడం మరియు అనవసరమైన కొమ్ములను కత్తిరించడం ద్వారా చెట్లను సంరక్షిస్తూ ఉండాలి. చెట్లను తెగుళ్లు మరియు వ్యాధుల నుండి రక్షించడం మరియు ప్రమాదాల వల్ల పెరిగిన చెట్లు పడిపోకుండా చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎర్రచందనం చెట్లు పరిపక్వతకు చేరుకున్న తర్వాత, వాటిని విక్రయించి గణనీయమైన లాభం పొందవచ్చు. కోత ప్రక్రియను జాగ్రత్తగా ప్లాన్ చేయడం మరియు సమన్వయం చేయడం, అలాగే దాని నాణ్యత మరియు విలువను నిర్ధారించడానికి కలపను సరిగ్గా నిల్వ చేయడం మరియు రవాణా చేయడం చాలా ముఖ్యం. ఇలా ఎర్రచందనం మొక్కను నాటి నప్పటి నుంచి విక్రయించేంత వరకూ ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోట్ల రుపాయల ఆదాయం పొందవచ్చు. 

ఎవరు సాగు చేయవచ్చు. 

వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం పొందాలని భావిస్తున్వనారు ఈ ఎర్రచందనం సాగును చేపట్టవచ్చు. అదేవిధంగా సమీకృత వ్యవసాయ విధానాల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నవారు ఈ ఎర్రచందనం సాగు పట్ల ఆసక్తికనబరచవచ్చు. కాగా, ఎర్రచందనం సాగు మరియు విక్రయానికి ఈ కథనం మొదట్లో చెప్పినట్లు ప్రత్యేక అనుమతులు అవసరం అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ffreedom App లోని ఈ కోర్సు ద్వారా మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!