“నలుగురు నడిచిన దారిలో నడవడం నాకు తెలియదు.” అన్న ప్రిన్స్ మహేశ్ బాబు పాట చిక్కబళాపురకు చెందిన మంగళమ్మ జీవితానికి సరిపోతుంది. అందుకే అతి త్వరలోనే ఆమె దాదాపు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల ఆదాయం అందుకోబోతున్నారు.
ఆలోచనలకు రూపం ఇచ్చిన ffreedom app:
కర్ణాటకలోని చిక్కబళాపురకు చెందిన మంగళమ్మ వయస్సు 50 సంవత్సరాలు. ఆమె చేనేత కార్మికురాలు. వచ్చే ఆదాయం సరిపోక చీరలు కూడా అమ్మేది. అయితే ఆ పని, ఆదాయం మంగళమ్మకు సంతృప్తిని ఇచ్చేది కాదు. తన ఆలోచనలన్నీ వ్యవసాయం మీదే. విభిన్నంగా వ్యవసాయం చేసి ఎక్కువ ఫలసాయం పొందాలని తపించేది. ఇందుకోసం అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. మఖ్యంగా యూ ట్యూబ్‌లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలు, కథనాలు ఎక్కువగా చూసేది. ఈ క్రమంలోనే ffreedom app గురించి తెలిసింది. అందులో అందుబాటులో ఉన్న విభిన్నమై పదుల సంఖ్యలో వ్యవసాయ కోర్సుల గురించి నేర్చుకోవడానికి సిద్ధపడింది.
విభిన్నత వైపు మొగ్గు చూపిన వైనం
సాధారణంగా వ్యవసాయం అంటే చాలామంది వరి, చెరుకు వంటి సంప్రదాయ పంటలను మాత్రమే పండించడానికి ఇష్టపడుతారు. అయితే మంగళమ్మ మాత్రం నలుగురు నడిచే దారిలో కాకుండా విభిన్నంగా నడవడానికి నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అటవీ, బహుళ పంటల సాగుకు సంబంధించిన కోర్సులను నేర్చుకుంది.
డిమాండ్ ఎక్కువ ఉత్పత్తి తక్కువ
సౌందర్య సాధనాలు, ఔషదాలు, ఆహార పరిశ్రమలో వినియోగించే శ్రీ గంధం చెక్కకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ అధికం. ప్రపంచవ్యాప్తంగా, ఏటా 6,000 నుండి 7,000 మెట్రిక్ టన్నుల శ్రీ గంధం చెక్కకు డిమాండ్ ఉంది. ఇందులో భారతదేశం నుంచి సంవత్సరానికి 200 టన్నుల శ్రీ గంధం ఉత్పత్తి అవుతోంది. మిగిలిన అన్ని దేశాల నుంచి 400 టన్నుల శ్రీ గంధం ఉత్పత్తి అవుతోంది. అంటే ఇప్పటికే ప్రతి ఏటా 5,400 టన్నుల శ్రీ గంధం కొరత ఉంది. ఇక భవిష్యత్తులో ఈ శ్రీ గంధం చెక్కకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
తనకున్న ఒక ఎకరం పొలంలో
భవిష్యత్తులో ఈ శ్రీ గంధానికి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని గ్రహించిన మంగళమ్మ తనకున్న ఎకరం పొలంలో 300 శ్రీ గంధం మొక్కలను, 40 మహాగని మొక్కలను నాటింది. అంతే కాకుండా కొద్ది మొత్తంలో నిమ్మ, మునగ చెట్లను కూడా పెంచుతోంది. ఈ చెట్లు కోతకు వచ్చిన తర్వాత ప్రస్తుత రేటునే పరిగణనలోకి తీసుకుంటే 300 శ్రీ గంధం చెట్ల నుంచే వందల కోట్ల రుపాయలు ఆదాయం వస్తుంది. ఇక కుటుంబ పోషణకు ప్రస్తుతం నిమ్మ, మునగ చెట్ల నుంచి క్రమం తప్పక ఆదాయం వస్తోంది. ఈ విషయమై మంగళమ్మ ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…”కుటుంబ పోషణకు మొదట్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది పడటం లేదు. ఒక్క శ్రీ గంధం చెట్లు కోతకు వస్తే వందల కోట్ల ఆదాయం అందుతుంది. మహాగని మొక్కల నుంచి అందే ఆదాయం దీనికి అదనం. నాకు సమాజంలో గుర్తింపు కూడా వచ్చింది. నా పొలాన్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ffreedom app, శ్రీధర్ సార్.” అంటూ ఆనందం నిండిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.