“చదువుకు, సంపాదనకు అనులోమానుపాత సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటే, అసలు చదువుకు, సంపాదనకు సంబంధమే లేదు” అంటున్నారు బసవరాజ్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఈయన మేకలను గొర్రెలను పెంచుతూ నెలకు సాఫ్ట్‌వేర్ జీతాన్ని మించి ఆదాయాన్ని గడిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫెయిల్…ఓ చిరుద్యోగి
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మాన్వీకి చెందిన బసవరాజ్ ఇంటర్మీడియట్ (PUC) ఫెయిల్ అయ్యారు. దీంతో కుటుంబ పోషణకు రేడియం స్టిక్కర్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. తరువాత పెయింటింగ్‌కు సంబంధించిన షాపు నిర్వహించేవారు. అయితే ఇందులో కూడా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. ఇదిలా ఉండగా ఇతను షాపు నిర్వహణతో పాటు వారసత్వంగా వచ్చిన పొలంలో కొద్దిగా వ్యవసాయం కూడా చేసేవారు. అయితే మొదటి నుంచి పశుపోషణ పై బసవరాజుకు మక్కువ ఎక్కువ. ఈ పశుపోషణను పారిశ్రామిక స్థాయిలో నిర్వహిస్తే ఎక్కువ లాభాలు తక్కువ సమయంలోనే గడించవచ్చనేది ఇతని ఆలోచన. అయితే వ్యాపారాన్ని కాని, ఓ పరిశ్రమను కాని, వ్యాపారాన్ని కాని నిర్వహించాలంటే మంచి చదువు అవసరమని చెబుతూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు.
ffreedom App సహకారంతో…
అయితే బసవరాజ్ ఎప్పుడూ తన ప్రయత్నం మారలేదు. పశుపోషణకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో తెలుసుకుంటూనే ఉండేవారు. ఈ క్రమంలోనే మూడేళ్ల ముందు గొర్రెలను, మేకలను పెంచి అమ్మడం మొదలు పెట్టారు. అయితే ఎక్కువ లాభం కనబడలేదు. ఈ క్రమంలో ffreedom App గురించి తెలిసింది. వెంటనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకానికి సంబంధించిన కోర్సులను చూశారు. ముఖ్యంగా మేకలు, గొర్రెల పెంపకానికి సంబంధించిన అనేక విషయాలను నేర్చుకున్నారు. కోర్సులో సూచించిన విధంగా మేకలు, గొర్రెల పెంపకంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు ముఖ్యంగా అధిక దిగుబడిని ఇచ్చే జాతులను కొనుగోలు చేశారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల అనుమతులు, సబ్సిడీలు పొందారు. పశువులకు అవసరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేవారు.. మేకలు, గొర్రెలకు వచ్చే వ్యాధులు, నివారణ, టీకాల విషయంలో అప్రమత్తంగా ఉండేవారు.
సాఫ్ట్‌వేర్ ను మించి ఆదాయం.
కోర్సుల్లో నేర్చుకున్న విషయాలను తూ.చా తప్పకుండా అమలు చేశారు. ముఖ్యంగా డిమాండ్‌ను అనుసరించి ధరను నిర్ణయించడం, సరఫరా వంటి విషయాల పై దృష్టి సారించారు. దీంతో తక్కువ కాలంలోనే పశుపోషణలో అధిక లాభాలు చవిచూశారు. ప్రస్తుతం బసవరాజ్ ఫామ్‌లో 30 మేకలు, ఏడు గొర్రెలు, వందల సంఖ్యలో కోళ్లు ఉన్నాయి. ఒక్క మేకలు, గొర్రెల అమ్మకాల నుంచే నెలకు రూ.1 లక్ష రుపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. “ఈ విషయమై బసవరాజ్ ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…”మొదట్లో చాలా మంది చదువు లేనందువల్ల వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేవని చెప్పేవారు. అయితే ఫ్రీడం యాప్ లో నాలాంటి వారికి కూడా వ్యాపారాన్ని, పరిశ్రమను లాభసాటిగా ఎలా నడపాలో అర్థమయ్యేలా చెప్పేవారు. యాప్‌లో విషయాలను అమలు చేసి ప్రస్తుతం ఓ నెలకు సాఫ్ట్‌వేర్ అందుకునే జీతాన్ని మేకలు, గొర్రెల పెంపకం, విక్రయం వల్లే అందుకుంటున్నాను. అందుకే చదువుకు, వ్యాపారానికి సంపాదనకు సంబంధం లేదని బల్లగుద్దీ మరీ చెప్పగలను.” అని పేర్కొన్నారు.