Home » Latest Stories » విజయ గాథలు » జీవనోపాధి కోసం అప్పుడు- జీవితమే ‘అమృత’మయం ఇప్పుడు!

జీవనోపాధి కోసం అప్పుడు- జీవితమే ‘అమృత’మయం ఇప్పుడు!

by Rishitaraj

అమృత, చేతిలో MCA డిగ్రీ పట్టా ఉంది. కానీ, కేవలం కాగితాలతో కడుపు నిండదు కదా! జీవనోపాధి మార్గాల కోసం వెతుకుతూ ఉండేవారు. మొదట్లో, వారు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. చేతికి సరిపడా సంపాదిస్తున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కరోనా వారి జీవితంపై నీళ్లు చల్లింది. కరోనా కారణంగా, ప్రపంచ దేశాలే కాదు, సాధారణ మధ్యతరగతి జీవితాలు కూడా కుదేలు అయ్యాయి. అందులో, అమృత ఒకరు! ఆదాయానికి గండి పడడంతో, మళ్ళీ మొదటికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఏదైమైనా, తన కాళ్ళ మీద తాను, నిలబడాలి అని అమృత గట్టిగా నిశ్చయించుకున్నారు. వారి సంకల్పానికి Boss Wallah తోడైయ్యింది. సాధారణంగా సాగే వారి జీవితాల్లో, అద్భుతాలు జరుగుతాయా?

స్టాక్ మార్కెట్లో, రాకెట్!

బిజినెస్ వైపుగా అమృత అడుగులు సాగాయి. ఈ యాప్ నుండి స్టాక్ మార్కెట్ కోర్సు తీసుకున్నారు. ఈ కోర్సు నుంచి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నారు. దీని వల్ల లాభాలు ఏంటి? ఇందులో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, స్టాక్స్ వల్ల ఎంతవరకు లాభాలు ఉండొచ్చు వంటి విషయాలు, వారు క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నారు. వారు ఊహించిన దానికంటే, ఎక్కువగా వీటి నుంచి లాభాలు పొందారు. స్టాక్ మార్కెట్స్ పెట్టుబడి ద్వారా, 35 శాతం నుంచి 40 శాతం వరకు లాభాలు, వారిని వరించాయి. పరిస్థితులు చాలా వరకు మెరుగవ్వడం ప్రారంభించాయి. 

తండ్రి వేరుశెనగ పంటతో, తలరాత మార్చుకుని!

స్టాక్ మార్కెట్ ఇచ్చిన విజయం, వారికెంతో ఉత్సహాన్ని ఇచ్చింది. ఇంకా ఎదగాలనే సంకల్పంతో, ఆయిల్ మిల్ కోర్సు నేర్చుకోవడం ప్రారంభించారు. 1000 చదరపు అడుగులలో, ఒక షాపును అద్దెకు తీసుకున్నారు. వారి తండ్రి పండించే వేరుశెనగె వారి ముడిసరుకు. ఆయిల్ మిల్ కోర్సు నుంచి, కేవలం వ్యాపార విషయాలే కాక, పెట్టుబడి ఎలా సమకూర్చాలి, ఇటువంటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఎలా ఉంటుంది, అవి ఎలా పొందాలి ? వంటి అంశాల గురించి పూర్తిగా నేర్చుకోవడం వారికెంతో మేలు అయింది. 

ఒక యంత్రానికి, 1 లక్ష సబ్సిడీని పొందడంతో పాటుగా, బ్యాంకు నుంచి PMFME పథకం ద్వారా 8 లక్షల రుణాన్ని పొందారు. ప్రస్తుతం, రోజూ 60 లీటర్ల వేరుశెనగ మరియు కొబ్బరి నూనెను తీస్తున్నారు. వాటిని స్థానిక రైతులకు లీటర్‌ రూ. 350/ మరియు హోల్‌సేల్‌లో రూ. 280/లీటర్‌కు విక్రయిస్తున్నారు. 

ఆర్థిక స్వేచ్ఛకు మరో నిర్వచనం, Boss Wallah!

ఈ యాప్ అందించిన స్థైర్యం, వారిని ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా అడుగులు వేసేలా చేసింది. Boss Wallah ద్వారా ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ మరియు బీమా కోర్సుల గురించి కూడా నేర్చుకుని, దీని ద్వారా 4 నుంచి 6 లక్షల సంపాదించే స్థాయిలో వారిప్పుడు ఉన్నారు. 

వారు సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యాలతో, వారి ఆర్థిక పరిస్థితిని మలుపు తిప్పగలిగారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించగలిగారు. Boss Wallah CEO, సుధీర్ సర్ నుండి, టర్మ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్‌ మాత్రమే కాకుండా, ఆర్థిక అక్షరాస్యత గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇదే వారిని, వారి స్నేహితులను బీమా తీసుకునేలా ప్రేరేపించింది. 

మా లక్ష్యం, ప్రతీ ఒక్కరికి జీవనాధారం కలిపించి, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కలిపించడం! మొత్తంమీద, ఒక గొప్ప లక్ష్య సాధన కొరకు స్థాపించినబడిన Boss Wallah, అమృత జీవితాన్ని అమృతమయం చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు కదూ!

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!