“కిటికీ మూసుకుపోతే తలుపు తెరిచే ఉంటుంది.” అనే సామెత రాధిక జీవితానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే చిరుద్యోగి అయిన ఆమె కొన్ని పరిస్థితుల వల్ల నిరుద్యోగిగా మారింది. అయితే ధైర్యం కోల్పోలేదు. తన లోని ప్రతిభను పెట్టుబడిగా పెట్టి ఉన్నతంగా ఎదిగుతూ చాలా మందికి ఆదర్శప్రాయమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం.
చిరుద్యోగి..నిరుద్యోగిగా మారారు
బెంగళూరు రూరల్ ప్రాంతానికి చెందిన రాధిక మొదట్లో ఓ చిరుద్యోగిగా పనిచేస్తూ కుటుంబ పోషణలో తనవంతు సహాయం అందించేవారు. కొంత కాలం తర్వాత పుట్టిన బిడ్డ బాగోగులు చూడటం కోసం ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓ తల్లిగా పిల్లాడి బాగోగులు చూస్తున్నా కుటుంబ ఆదాయం తగ్గిపోవడంతో ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. తనలో ఉన్న ప్రతిభను పెట్టుబడిగా పెట్టి జీవితంలో ఎదగాలని భావించింది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని దారుల్లో ప్రయత్నించారు.
ffreedom App చేయూతతో యజమానిగా
ఈ క్రమంలోనే రాధికకు ffreedom App గురించి తెలిసింది. ఈ యాప్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. యాప్‌లో అందుబాటులో ఉన్న టైలరింగ్ కోర్సు ను పూర్తి చేశారు. ముఖ్యంగా కొలతలు ఎలా తీసుకోవాలి, నెక్‌లైన్ మరియు అందులోని రకాలు, నెక్‌లైన్ డ్రాప్టింగ్, కాన్వాస్ లేకుండా నెక్‌లైన్ ఎలా కుట్టాలి అన్న విషయాలు నేర్చుకున్నారు. అదేవిధంగా కుర్తీ, బోట్ నెక్, కుర్తీ, పైజామా, బ్లౌజ్, ఫ్రాక్స్ అందంగా ఎలా కుట్టాలో వాటిని ధరను ఎలా నిర్ణయించాలో నేర్చుకున్నారు. అటు పై నేర్చుకున్న విషయాలన్నింటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మొదలు పెట్టింది. దీంతో మొదటినెలలోనే రూ.4వేల రుపాయల సంపాదన చవిచూసింది. ఇది చిన్న మొత్తమే కావచ్చు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంతో తనలో ఉన్న ప్రతిభకు పదును పెట్టి జీవితంలో నిలదొక్కుకోవడం అన్నది చాలా ముఖ్యం. అవిధంగా చేయడం వల్లే రాధిక ఎంతో మంది గృహిణులకు ఆదర్శప్రాయమయ్యింది. ఈ విషయమై రాధిక ఫ్రీడం యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ…”నేను చిరుద్యోగి నుంచి నిరుద్యోగిగా మారాను. అయితే నేను ఇప్పుడు ఇంటి వద్దనే ఉంటూ టైలరింగ్ షాప్ నడుపుతున్నాను. అంటే నా షాపునకు నేనే యజమాని. ఇందుకు ffreedom App కు ధన్యవాదాలు. అంతేకాకుండా నేను ఇంటి వద్దనే ఉంటూ కోళ్లు, మేకలను పెంచుతున్నాను. త్వరలోనే వాటి వల్ల కూడా ఆదాయం అందుతుంది. పిల్లలు, కుంటుంబం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన వారు అక్కడే ఆగిపోకుండా వారి ప్రతిభతో ఏదేని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. “ అనే చక్కటి సందేశాన్ని ఇచ్చారు.