Home » Latest Stories » వ్యవసాయం » హై “టెక్” రైతు…జామ సాగుతో హై ప్రాఫిట్స్ అందుకుంటూ..

హై “టెక్” రైతు…జామ సాగుతో హై ప్రాఫిట్స్ అందుకుంటూ..

by Bharadwaj Rameshwar
151 views

సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తే అందుకునే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు అధిక దిగుబడిని అందించే వంగడాలను సాగుచేయడంలో నూతన వ్యవసాయ పద్దతులను అనుసరిస్తే వచ్చే ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరుగుతుంది. దీంతో ఆదాయం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ క్రమంలోనే జామ సాగులో అత్యధిక డిమాండ్ ఉన్న తైవాన్ గోల్డ్ రకపు జామను పండిస్తూ గగన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎకరానికి రూ.25 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. సదరు తైవాన్ గోల్డ్ రకం జామ రకం ప్రత్యేకతలు పాటు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గురించిన పూర్తి వివరాలతో పాటు ఈ రకం జామ సాగు విధానాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

విలక్షణమైన పండు

తైవాన్ గోల్డ్ అనేది అసాధారణమైన రుచి మరియు నాణ్యతకు ప్రసిద్ధి చెందిన జామ జాతి. ఈ పండు మధ్య మరియు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. అయితే ఇది చాలా సంవత్సరాలుగా భారతదేశంలో పండిస్తున్నారు. తైవాన్ గోల్డ్ జామ ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది, ఇది తీపి మరియు పుల్లని కలయికగా ఉంటుంది మరియు ఇది చాలా మంది పండ్ల ప్రేమికులకు ఇష్టమైనది. తైవాన్ గోల్డ్ జామ యొక్క అత్యంత విలక్షణమైన లక్షణాలలో దాని రంగు కూడా ఒకటి. ఈ రంగు పసుపు, ఎరుపు వర్ణాలను కలగలిపి ఉంటుంది. ఈ కలయిక సాధారణంగా ఇతర రకాల జామలలో కనిపించదు. ఈ పండు ఇతర రకాల జామకాయల కంటే పెద్దదిగా ఉంటుంది మరియు ఇది మృదువైన మరియు దృఢమైన ఆకృతిని కలిగి ఉంటుంది.

పోషకాల గని

తైవాన్ గోల్డ్ జామ విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువ పరిమాణాంలో ఉంటాయి, మరియు ఇందులో ఫైబర్, సి మరియు ఎ విటమిన్లు, మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పండులో కేలరీలు మరియు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది, బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. తైవాన్ గోల్డ్ జామలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు అత్యవసరం. ఈ పండులో పొటాషియం కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. అందువల్ల రక్తపోటుతో బాధ పడుతున్నవారికి ఈ జామ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ తైవాన్ రకం జామకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది.  

అనేక రకాలుగా ఉపయోగించవచ్చు..

తివాన్ గోల్డ్ జామ ఒక బహుముఖ పండు, దీనిని వివిధ రకాలుగా ఆస్వాదించవచ్చు. దీనిని తాజాగా తినవచ్చు లేదా సలాడ్లు, స్మూతీస్ మరియు ఇతర వంటలలో ఉపయోగించవచ్చు. పండ్లను జామ్‌లు, జెల్లీలు మరియు ఇతర నిల్వలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

టెక్కీ రైతు మెంటార్

సాంకేతికత పై అవగాహన ఉన్న రైతుగా గగన్ తన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ వినూత్న మార్గాలను వెదికేవారు. ఈ క్రమంలో తైవాన్ గోల్డ్ రకం జామ గురించి తెలుసుకుని దానిని సాగు చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఇతను ఎకరా వ్యవసాయ క్షేత్రం నుంచి రూ.25 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. అంతేనా అధిక నాణ్యత గల జామపండు కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు గగన్ వ్యవసాయ క్షేత్రం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. అతను తన జామపండ్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ అతని ఉత్పాదకు మరింత ప్రాచూర్యం తీసుకువచ్చి మార్కెట్‌లో అధిక ధరకు అమ్మడు పోవడం ప్రారంభించింది.  ఈ కోర్సులో మీకు మెంటార్‌గా ఈ హై టెక్ రైతుగా పేరుగాంచిన గగన్ వ్యవహరిస్తారు. 

ఈ కోర్సుతో ఎన్నో మెళుకువలను నేర్చుకోవచ్చు…

జామ సాగుకు అవసరమైన సలహాలను ఈ గగన్ ద్వారా పొందడమే కాకుండా ఇంకా మరెన్నో విషయాలను మనం ffreedom App లోని ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. మిగిలిన జామ సాగుతో పోలిస్తే తైవాన్ గోల్డ్ రకం జామ సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఈ రకం జామ సాగులో ఉన్న దశల గురించి ఈ కోర్సు ద్వారా అవగాహన వస్తుంది. తైవాన్ గోల్డ్ జామ సాగుకు అనువైన భూమి, వాతావరణ పరిస్థితుల గురించి ఈ కోర్సులో తెలుసుకుంటాం. భూమిని దుక్కి దున్నిన తర్వాత మొక్కలను ఎలా నాటాలో ఈ కోర్సు మనకు నేర్పిస్తుంది. సాగుకు అవసరమైన పెట్టుబడితో పాటు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అందే సబ్సిడీల పై అవగాహన పెంచుకుంటాం. తైవాన్ గోల్డ్ రకం జామ మొక్కలకు నీటి సరఫరా ఎలా ఉండాలో ఈ కోర్సు పూర్తి అవగాహన కల్పిస్తుంది. పంట కోతకు వచ్చిన తర్వాత ఎలా కోయాలి, పండ్లను ఎలా ప్యాకింగ్ చేయాలన్న విషయం పై పూర్తి అవగాహన వస్తుంది. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ధరలు నిర్ణయించాలి, ఎగుమతి చేసేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అన్ని విషయాలు ఈ కోర్సు మనకు నేర్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జామ సాగు సంబంధ విషయలే కాకుండా మార్కెటింగ్‌కు సంబంధించిన విషయాలను కూడా ffreedom App కోర్సు మనకు తెలియజేస్తుంది. 

ffreedom App యాప్ అందించే అనేక కోర్సులను చూసి విజయవంతంగా వ్యవసాయన్ని చేస్తూ అధిక లాభాలు అందుకుంటున్న రైతులు, పారిశ్రామికవేత్తల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!