“చదువుకు, వ్యాపారంలో విజయానికి సంబంధం లేదు” అన్న విషయం వాసవి వ్యాపారాభివృద్ధిని చూస్తే నిజమే అనిపిస్తుంది. మరిన్ని వివరాలను ఆమె విజయ గాథను చదివి తెలుసుకుందాం.
8 తరగతి చదివిన వ్యాపారవేత్త
హైదరాబాద్‌కు చెందిన వాసవి చదివింది 8వ తరగతి మాత్రమే. పెళ్లైన కొన్నాళ్లు జీవితం చాలా బోర్ అనిపించింది. మొదటి నుంచి వ్యాపారం చేయాలని కలలు కనే తనకు ఇలా కేవలం గృహిణిగానే మిగిలిపోవడం ఇష్టం ఉండేది కాదు. దీంతో వ్యాపార అవకాశాల కోసం ఎప్పుడూ అన్వేషించేది. ఈ క్రమంలో ఒకసారి టీవీలో వచ్చిన ఫ్రీడం యాప్ వాసవి దృష్టిని ఆకర్షించింది. దీంతో ffreedom App ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివిధ కోర్సుల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది.
A to Z యాప్ నుంచే
ffreedom App నుండి, ఆమె హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారం అంటే ఏమిటి?, హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించలి, అవసరమైన పెట్టుబడి, రుణాలు, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు, చాక్లెట్ తయారీ ప్రక్రియ, మార్కెటింగ్, డిమాండ్, సేల్స్, వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలి మరియు మార్కెట్‌ను అనుసరించి ధరలను ఎలా నిర్ణయించాలి తదితర విషయాలన్నింటినీ యాప్ లోని కోర్సు ద్వారానే నేర్చుకున్నారు.
రూ.4000 పెట్టుబడితో ప్రారంభించి..
తాను నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం మొదట కేవలం రూ.4000లతో చాక్లెట్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, పరికరాలు కొని వివిధ రకాల ఫ్లేవర్డ్ చాక్లెట్లను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. వినియోగదారులన నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ను అనుసరించి ఇన్‌గ్రేడియట్స్ పరిమాణంలో మార్పులు తీసుకువచ్చి విభిన్న రుచుల్లో చాక్లెట్స్‌ను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. అదే సమయంలో యాప్ ప్రతినిధి నుంచి కూడా సహకారం అందుకున్నారు. దీంతో క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ లాభాలు అందుకోవడం ప్రారంభించారు. ఈ విషయమై వాసవి ఫ్రీడం యాప్ ప్రతినిధితో తన విజయానందాన్ని వాసవి ఇలా పంచుకున్నారు. …”ఒక గృహిణిగా ఉన్న నన్ను ఇప్పుడు చాలా మంది ఓ సక్సస్‌ఫుల్ వ్యాపారవేత్తగా గుర్తిస్తున్నారంటే ఇందుకు ffreedom App కారణం. చాక్లెట్ వ్యాపారంలో లాభాలు త్వరగా వస్తాయి. ఇది నా స్వానుభవం. చివరిగా ఒక మాట చాక్లెట్ మాత్రమే కాదు అది అందించే లాభాల రుచులు కూడా వెరి వెరి స్వీట్”.