వ్యవసాయం చేస్తూ, లక్షల్లో సంపాదించడం సాధ్యమౌతుందా? సాగు చేయడం సామాన్యుడికి సాధ్యమౌతుందా? వంటి ప్రశ్నలన్నింటినీ పటా పంచలు చేస్తూ, ffreedom app ఫార్మింగ్ పై అనేక కోర్సులను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, వివిధ రకాల పండ్ల సాగు, పాడి పెంపకం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అనేక పంటల సాగు వంటి కోర్సులు పొందుపరిచాం. వివిధ పద్ధతుల్లో సాగు చేస్తూ, గణనీయమైన, అద్భుతమైన లాభాలు సంపాదించే విధంగా రైతులకు అవకాశాలు & జ్ఞానం కలిపించడం, ఫార్మింగ్ చేసే వారిని ఆర్థికంగా బలపరచడం, రైతంటే, తలెత్తుకు తిరిగేలా చేయడమే మా లక్ష్యం. మా యాప్ నుంచి ఎంతో మంది రైతులు, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుని, ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. వారిలో ఒకరైన శ్రీ వినోద్ కుమార్ గారి గురించి, ఈ రోజు తెలుసుకోండి!
చిత్రదుర్గ, సివిల్ ఇంజనీర్ టూ సక్సెస్ఫుల్ ఫార్మర్!
వినోద్ కుమార్, కర్ణాటకలోని, చిత్రదుర్గ జిల్లా, హిరియూర్ తాలూకాకు చెందిన వారు. వీరు సివిల్ ఇంజనీరింగ్ లో ఎం. టెక్ చేశారు. చిన్నప్పటి నుంచి, వ్యవసాయంపై ఉన్న అభిమానం వల్ల, కొంత భూమి కొన్నారు. అయితే, వ్యవసాయంపై అంతగా అవగాహన లేకపోవడం వారికి మైనస్ గా మారింది. అప్పుడే ffreedom app వారి జీవితంలోకి ప్రవేశించింది. దీని ద్వారా, ఉన్న పొలాన్ని ఉత్తమ విధానాల్లో ఎలా సాగు చేయాలి, వీటి నుంచి బెస్ట్ ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి అని నేర్చుకున్నారు. సిబ్బంది కొరత, కలుపు మొక్కలు, కీటకాల బెడద నుంచి పంటను ఎలా కాపాడుకోవాలో కూడా ఇందులో నేర్చుకున్నారు.
దానిమ్మ సాగుతో రూ. 8 లక్షల సంపాదన!
ffreedom app నుంచి వారు దానిమ్మ సాగు గురించి నేర్చుకున్నారు. దీనిని రెండు ఎకరాల్లో సాగు చేస్తూ, ఉత్తమ ఫలితాలు పొందుతున్నారు. దాదాపు రెండు ఎకరాల నుంచి, వీరు ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలను సంపాదించడంతో, వీరికి ఉత్సహం రెట్టింపయింది. దానిమ్మ పండించడంతో పాటుగా, జామ సాగు, అంజీరా సాగు, ఆరంజ్ ఫార్మింగ్, కొబ్బరి చెట్లు ఫార్మింగ్, వాల్ నట్స్ సాగు, వంటి వివిధ రకాల పంటలతో పాటు, ఈ మధ్యే పౌల్ట్రీ ఫార్మింగ్ & గొర్రెల పెంపకం కూడా ప్రారంభించారు. వీటి నుంచి రానున్న రోజులలో, దీని నుంచి 20-30 లక్షల సంపాదన పొందుతారని వీరు భావిస్తున్నారు.
సమీకృత సాగుతో, కాసుల వర్షం
సమీకృత లేదా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అంటే, ఒకే చోట అనేక రకాల పంటలు, పాడి, ఆక్వా, గొర్రెలు పెంచడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గించడం అలాగే, ఒక దాని నుంచి మరొకటి ప్రయోజనం చెందే విధంగా చేయడం. దీని ద్వారా గొప్ప లాభాలు పొందొచ్చు. వినోద్ కుమార్ కేవలం, దానిమ్మ సాగే కాకుండా, అంజీర పండు సాగు నుంచి, నాలుగు నుంచి ఐదు లక్షలు, జామ సాగు నుంచి 2 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అతి త్వరలోనే, వీరు చేపల పెంపకం కూడా ప్రారంభిస్తూ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కు తరువాతి స్థాయికి తీసుకు వెళ్లనున్నారు.
మొత్తం మీద, వినోద్ కుమార్ ffreedom app నుంచి ఇంటిగ్రేటెడ్ సాగు కోర్సును వంటబట్టి, దాని నుంచి అద్భుతమైన రీతిలో లాభాలు పొందుతూ, ఔరా అనిపిస్తున్నారు. మీరూ, మన దేశంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి అనుకున్నా లేదా ఎన్నో రకాల సాగుల గురించి తెలుసుకుని, సక్సెస్ఫుల్ రైతుగా స్థిరపడాలి అంటే, ఈరోజే ffreedom app లో మీకు నచ్చిన కోర్సును ఎన్నుకొని, నేర్చుకోవడం ప్రారంభించండి.