Home » Latest Stories » విజయ గాథలు » అబ్రకదబ్రా… గిలిగిలి చూ!- యూట్యూబ్ మాంత్రికుడు స్టోరీ!

అబ్రకదబ్రా… గిలిగిలి చూ!- యూట్యూబ్ మాంత్రికుడు స్టోరీ!

by Bharadwaj Rameshwar
317 views

మ్యాజిక్ అనేది ఒక అద్భుత కళ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మ్యాజిక్ ను ఇష్టపడని వారెవరైనా ఉంటారా? ఉండరు కదా! చిన్నప్పుడు, స్కూళ్లలో ప్రత్యేకంగా వచ్చి, మ్యాజిక్ చేసి చూపించే వారు. వారి వస్త్రధారణను,  వారి మ్యాజిక్ ట్రిక్స్ ను నొఱప్పలించి, కళ్ళు విప్పారించి చూసే ఉంటాము. ఈ రోజు మనం అటువంటి మాయాజాలం చేసే, మాంత్రికుడి గురించే  తెలుసుకోనున్నాం. మాతో పాటు మీరందరూ ఆసక్తిగా ఉన్నారు కదా? ఇంకెందుకు, లేట్… ఇప్పుడే దీని గురించి తెలుసుకోవడం మొదలుపెడదామా? 

వంటగాడు-మ్యాజిక్ ను  నాన్న నుంచి ఒంటబట్టాడు!

అతడు ముందో వంటగాడు. దాదాపు ఐదేళ్లుగా అసిస్టెంట్ చెఫ్ గా పనిచేస్తూ ఉన్నాడు. అతడికి ఆ గుర్తింపు చాలదు అనిపించింది. చంద్రధర్  అంటే, కేవలం ఒక ఉద్యోగిగానే కాదు, ప్రత్యేక గుర్తింపును  కలిగి ఉండాలి అని అనుకునేవాడు. చిన్నప్ప్పుడే, అతడి తండ్రి దగ్గర నుంచి మంత్రజలాన్ని ఒంటబట్టాడు.  ఆ వైపుగా అడుగులు వెయ్యడం ప్రారంభించాడు. నాన్న నేర్పిన కళకి, తన సొంత మెరుగులు దిద్దడం మొదలుపెట్టాడు. ప్రొఫెషనల్ మాంత్రికుల బాడీ లాంగ్వేజ్ వంటి వాటిపై ధ్యాస ఉంచి, దానిని గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు.  

చుట్టుపక్కల వారు నన్ను చూసి నవ్వేవారు!

అతడు ఇంద్రజాలకుడిగా వృత్తిని చేపడదాం అనుకున్న సమయంలో అతడికి, అతడి బంధువుల నుంచి లభించినదల్లా, ఈసడింపులు మరియు ఎగతాళి మాత్రమే  . అతడిని “నువ్వు మ్యాజిక్ చేస్తావా?” అంటూ గేలి చేసేవారు. అతడు మాత్రం, తండ్రి అతడికి నేర్పించిన ఈ కళను కాపాడుకుకోవాలి అని మాత్రమే ఆలోచించాడు. 

ఆ దిశగా అడుగులు పడడం ప్రారంభించాయి. తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని అతడు ప్రారంభించాడు. 

నూతన అధ్యాయం. 

చంద్రధర్ , తన ఆశయం దిశగా అడుగులు వెయ్యడం ప్రారంభించాడు. మొదట్లో స్కూల్స్, చిన్న చిన్న సెంటర్స్ లలో, తన విద్యను ప్రదర్శించేవాడు. జనాదరణ బాగానే ఉండేది. కానీ, డబ్బులు అంతగా వచ్చేవి కావు. అతడు, ఉద్యోగం వదిలి, ఇలా మాంత్రికుడిగా మారడం మంచి డెసిషన్ కాదో, అవునో తెలియని సంశయంలో ఉండేవాడు.  చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలలో, ప్రదర్శనలు ఇచ్చేవాడు. మెల్లగా డబ్బులు పెరగడం మొదలు అయింది. అప్పుడే అతడి జీవితంలో మెరుపులా తళుక్కుమంది, ffreedom app!

గొప్ప అధ్యాయం మొదలు!

యూట్యూబ్ ద్వారా అతడు, ఈ విద్యను ఇంకో మెట్టు ఎలా ఎక్కించాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు,  యూట్యూబ్ లో ffreedom app వారి  “యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఎలా?” అనే కోర్సును చూడడం జరిగింది. వెంటనే, ఆ కోర్సు సబ్స్క్రిప్షన్ తీసుకుని నేర్చుకోవడం ప్రారంభించాడు. “యూట్యూబ్ ఛానల్ ను ఎలా ఓపెన్ చెయ్యాలి” నుంచి, “యూట్యూబ్ బేసిక్ ఎడిటింగ్ చేయడం, థంబ్ నైల్ ను ఎలా క్రీయేట్ చేసుకోవాలి అని యూట్యూబ్  గురించి A టూ Z, అన్నిటిని నేర్చుకున్నాడు.    

ఈ కోర్సును చూసి, ఛానల్ ప్రారంభినప్పటి నుంచి, అతడి మ్యాజిక్ కు డిమాండ్ పెరగసాగింది. మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చెయ్యకుండా, యూట్యూబ్ నుంచే అతడి మ్యాజిక్ షో ను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, మన మహబూబ్‌నగర్ మాంత్రికుడు. ఈ ఛానల్ లో అతడు, ఇప్పటిదాకా పుట్టిన రోజు వేడుకలలో చేసిన మ్యాజిక్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తాను ఈ యూట్యూబ్ ఛానల్ ను ఆయన తండ్రికి నివాళిగా భావిస్తున్నాను అని చెప్పేటప్పుడు, చంద్రధర్   కళ్ళు చెమర్చాయి!

మీరూ మీకొచ్చిన కళతో, యూట్యూబ్ ద్వారా జనాలకి చేరువ అవుదాం అనుకుంటున్నారా? ఇప్పుడే, ffreedom app నుంచి యూట్యూబ్ కోర్సును నేర్చుకోండి. 

అంతవరకూ, అబ్రకదబ్రా… గిలిగిలిచూ అనే, చంద్రధర్  వీడియోలను చూసి ఎంజాయ్ చెయ్యండి!

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!