ఎదగాలి అనే కోరిక ఉంటె, ఆకాశమే నీ హద్దురా” అంటాడో కవి! దారిలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఉన్నా సరే, గమ్యం దిశగా అడుగులేస్తున్నారు, మన నల్గొండ బిడ్డ, లుక్మన్. అతడు పెద్దగా చదువుకోలేదు. ఏ బిజినెస్ చేస్తే, బాగుంటుందో అవగాహన లేదు. తెలిసిన వాళ్ళు, కోళ్ల ఫార్మ్ బిజినెస్ చేస్తుంటే, తానూ ప్రారంభిద్దాం అనుకున్నాడు. కానీ పెట్టుబడి లేక ఆగిపోయాడు.
కట్ చేస్తే, ఆ చుట్టూ పక్కల ఉన్న ఊర్లలో లుక్మన్ అంటే, తెలియని వారుండరు. అందరూ, అతడు అప్డేట్ చేసే కంటెంట్ కోసం కాచుకుని ఉన్నారు. అతడు ఇప్పుడో యూట్యూబర్… కాదు కాదు, యూట్యూబ్ సెలబ్రిటీ!
ఇంతకూ, ఎవరా లుక్మన్… ఏమిటా కథ? మీరూ, ఓ లుక్కెయ్యండీ!
పెద్దగా చదువుకోలేదు… కానీ పైకి ఎదగాలి అనే కోరిక!
నల్గొండ కుర్రాడు లుక్మన్, పెద్దగా చదువుకోలేదు. వెనకాల ఆస్తి పాస్తులేం లేవు. జీవితంలో ఏం చెయ్యాలో ఐడియా లేదు. గ్రానైట్ పనులు, వరి పొలంలో పని చేస్తూ ఉండేవాడు. అతడికి ఇంకేదో సాధించాలి. తనకంటూ గుర్తింపు ఉండాలి అని ఆలోచించేవాడు. రకరకాల బిజినెస్ లకోసం వెతుకుతూ ఉండేవాడు. అతడి బంధువులు, కొందరు కోళ్ల ఫార్మ్ బిజినెస్ లో ఉన్నారు. తానూ ఆ బిజినెస్ చేస్తే, ఎలా ఉంటుంది అని అనిపించింది. అదే తడవుగా, అతడి బంధువు దగ్గర, కోళ్ల పెంపకం గురించి తెలుసుకోవడం గురించి ప్రారంభించాడు. కానీ, అతడి బంధువులు అతడికి అడ్డు చెప్పారు. ఈ బిజినెస్ లో అంతగా లాభాలు ఉండవు అని చెప్పడంతో, అతడు ఒక వెనకడుగు వేసాడు. చికెన్ పెంపకం చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు.
ఒక్క అడుగు వెనక్కి- పది అడుగులు ముందుకు!
లుక్మన్ తన దగ్గర అంత పెట్టుబడి లేకపోవడంతో, కోళ్ల ఫార్మ్ ఆలోచనకు పుల్ స్టాప్ పెట్టాడు. అప్పుడే అతడి బుర్రలో యూట్యూబ్ ఆలోచన తళుక్కుమంది. వెంటనే, ఇంటర్నెట్ లో యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చెయ్యాలి అని వెతకడం ఆరంభించండి. అతడిని ffreedom app వారి “యూట్యూబ్ కోర్స్” ఆకర్షించింది. వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకుని, దాని గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇంకా ఆయిల్ ఫార్మింగ్, వ్యవసాయ సంబంధిత కోర్సులు చూసినప్పటికీ, వాటి పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉండడం తో యూట్యూబ్ తో ముందుకు వెళదాం అని నిశ్చయించుకున్నాడు.
కెమెరా ముందు మాట్లాడాలంటే, భయం భయం!
మొదట్లో, కెమెరా ముందు మాట్లాడాలన్నా, కనీసం నించోవాలన్నా చాలా ఇబ్బంది పడేవాడు. తానూ ఎక్కువగా చదువుకోపోవడం వల్ల, తన మాట తీరు విషయంలో కాస్త ఆందోళనకు గురైయ్యేవాడు. అయితే, పోను పోనూ, కెమెరా అతడికి అలవాటు అయింది. అలాగే, వీడియోలు హిందీలో ఉండేవి. వాటికి తెలుగు రాష్ట్రాల నుంచి, ఆదరణ తక్కువగా ఉండడంతో, వీడియోలను తెలుగులో చెయ్యడం ప్రారంభించాడు. అప్పటినుంచి, అవి తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణ పొందడం ప్రారంభించాయి.
అతడి వీడియోలలో, కుందేళ్ళ వేట, కోళ్ల ఫారం, చిన్న చిన్న పక్షులు / జంతువులు వేట చూపించడంతో, తెలుగు వాళ్ళు అందరూ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూసినట్టు, ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూస్తున్నారు. ఈ యూట్యూబర్ వీడియోలను మీరు చూసారా?
“మనల్ని ఎవడురా ఆపేది?”
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఎంత తేలికో, దానిని సమర్థవంతంగా నడపడం, ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. కొత్త విషయాలకు అప్డేట్ అవ్వడం, థంబ్నెయిల్ ఆసక్తికరంగా నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. వీటన్నిలో, అతడికి చేదోడు-వాదోడు గా ఉంది, మన ffreedom app! ఇక్కడ నేర్చుకున్న విషయాలకి తోడు, ఎల్లప్పుడూ లభించే మెంటార్ల మద్దతు, అతడిని యూట్యూబర్ గా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, అతడు యూట్యూబ్ ద్వారా సంపాదించడం కూడా మొదలుపెట్టాడు. వింటేనే, ఎంతో ఆనందంగా ఉంది కదూ! ఒకప్పుడు, లుక్మన్… ఊరూ-పేరూ తెలియని ఒక వ్యక్తి, మరిప్పుడో … అతడో ఫేమస్ యూట్యూబర్.